»   » ఫొటోలు: ఇంత లగ్జరీగా ఫామ్ హౌస్ కట్టడం, గర్ల్ ఫ్రెండ్ తో మజా ఆ స్టార్ హీరోకే చెల్లు

ఫొటోలు: ఇంత లగ్జరీగా ఫామ్ హౌస్ కట్టడం, గర్ల్ ఫ్రెండ్ తో మజా ఆ స్టార్ హీరోకే చెల్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: సల్లూ భాయ్ పెళ్లంటే చేసుకోలేదు కానీ మిగతా అన్ని విషయాల్లోనూ మస్తు ఎంజాయ్ చేస్తూంటాడు. ముఖ్యంగా విలాసాల విషయంలో ఆయన తర్వాతే ఎవరైనా అన్నట్లుగా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తూంటాడు. ఆయన ఓ సినిమా చేస్తే చాలు కోట్లకు కోట్లు రెమ్యునేషన్ పరంగా వచ్చి పడిపోతున్నాయి. దాంతో భూమిమీదే స్వంతంగా స్వర్గాన్ని ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నాడు.

ప్రొద్దు ప్రొద్దునే ఈ ఉపోద్గాతం అంతా ఎందుకూ అంటే...ఆయన ఫామ్ హౌస్ ఫొటోలు మీకు చూపెట్టబోతున్నాం కదా. దాని గురించి కాస్త బిల్డప్ ఇద్దామని అంతే. ఫామ్ హౌస్ అంటే అల్లాటప్పాది కాదు. చూస్తే అరే..ఎన్ని జన్మలెత్తాలి ఇంత గొప్ప ఫామ్ హౌస్ సొంతం అవ్వాలి అని అసూయపడేటంత గొప్పగా ఉంది. అరే పార్టీకి గట్రా పోయినావా..ఆ ఫామ్ హౌస్ కు కళ్లతో చూసినట్లే చెప్తున్నావు అంటే అక్కడ ఫొటోలు చూసా, అవే మీకు చూపించి మురిపిద్దామనుకుంటున్నా.

ఆయన గత నలభై సంవత్సరాలుగా ముంబై లోని గెలాక్సి అపార్టమెంట్ లో ఫ్యామిలీతో ఉంటూంటాడు. ఆయనో చిన్న గదిని షేర్ చేసుకుంటాడు. అయితే చాలా మందికి ఈ ఫామ్ హౌస్ గురించి తెలవదు. అక్కడే సల్మాన్ భారీ ఎత్తున పార్టీలు ఇస్తూంటాడు. అక్కడికి బాలీవుడ్ సెలబ్రెటీలే కాదు వివిధ రంగాల్లోని గొప్పవాళ్లు చాలా మంది రెగ్యులర్ విజిటర్స్.

పార్టీ లు ఇవ్వటం అంటే సల్మాన్ కు మహా సరదా. ఓ సుల్తాన్ లాగ నైట్ లైఫ్ ని ఫామ్ లో ఎంజాయ్ చేస్తూంటాడు సల్మాన్ అని చెప్తూంటారు. ఈ రోజు మీకు సల్మాన్ పాన్వెల్ ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్న ఫామ్ హౌస్ లోపల ఎలా ఉందో చూపబోతున్నాం.

 లగ్జరీని రీ డిఫైన్

లగ్జరీని రీ డిఫైన్

లగ్జరీ అనే పదాన్ని డిక్షనరీలో ఈ ఫామ్ చూసి యాడ్ చేసారా లేక రీ డిఫైన్ చేసారా అన్నట్లుగా ఈ ఫామ్ హౌస్ లోపల ఉంటుంది. ముంబైలోని మోస్ట్ ఎక్సపెన్సివ్ ప్రోపర్టీస్ లో ఇది ఒకటి. సల్మాన్ స్వయంగా డిజైన్ చేసుకున్న ఈ ఫామ్ హౌస్ లోపల అద్బుతమే అంటారు.

 ఓ రేంజిలో ఉంది కదూ

ఓ రేంజిలో ఉంది కదూ


బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ 150 ఎకరాల విస్తీర్ణంలో ఈ హాలిడే హోం ఏర్పాటు చేసుకుంటున్నాడట. గొరాయ్‌ బీచ్‌ సమీపంలో ఆయన ఐదు బెడ్‌ రూంల బంగ్లా కట్టించుకుంటున్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. తన పుట్టినరోజుని ఇదే ఫామ్ హౌస్ లో జరుపుకోవాలనుకుంటున్నాడట. అంతేకాదు.. ఇంటినే కాకుండా ఇంటి ఆవరణనీ తనకు నచ్చినట్లుగా డిజైన్‌ చేయించుకుంటున్నాడు.

సినిమా సెట్టింగ్ లా

సినిమా సెట్టింగ్ లా


హౌస్ వెనుక భాగంలో డర్ట్‌ బైకింగ్‌ ఎరీనా కూడా ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇదే ఎస్టేట్‌లో తన కుటుంబీకులు, అతిథుల కోసం మరో రెండు బంగ్లాలు కట్టించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. అంతేకాదు మహారాష్ట్ర ఈశాన్య ప్రాంతంలో పలు ఫామ్‌హౌస్‌లు కూడా ఏర్పాటుచేసుకోవాలనుకుంటున్నాడు సల్మాన్‌.

 ఇక్కడ కూడా చెల్లి అంటే..

ఇక్కడ కూడా చెల్లి అంటే..

సల్మాన్ కు తన చెల్లి అర్పితా ఖాన్ అంటే ప్రాణం. అందుకే ఈ ఫామ్ హౌస్ కు చెల్లి పేరుతో అర్పితా ఫామ్స్ అని పెట్టాడు. ఆమె కూడా అప్పుడప్పుడూ వచ్చి సేద తీరుతూంటుంది. తన అన్న తన పేరు మీద పెట్టిన ఈ ఫామ్ హౌస్ అందరికీ చూపి మురిసిపోతూంటుంది. అన్నయ్య సన్నిధి అదే మాకు పెన్నది అని కూడా పాడుతుందేమో.

మిగతా బాలీవుడ్ బ్యాచ్ కూడా..

మిగతా బాలీవుడ్ బ్యాచ్ కూడా..


సల్లూభాయ్‌ కొనుగోలు చేస్తున్న ప్రాపర్టీలపై ఇతర బాలీవుడ్‌ ప్రముఖులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇందుకోసం కొందరు సాల్సెట్టే, భెట్‌ తీర ప్రాంతాల్లో ఉన్న ద్వీపాల్లో బంగ్లాలు నిర్మించుకోవాలనుకుంటున్నారట.

 గణేష ప్రతిమ

గణేష ప్రతిమ


సల్మాన్ ఖాన్ తల్లి హిందు, తండ్రి ముస్లిం. అందుకే సల్మాన్ రెండు మతాలను సమానంగా గౌరవిస్తూంటాడు. తల్లి కోసం తన ఫామ్ హౌస్ లో అందమైన వినాయకుడు ప్రతమను ప్రతిష్టించాడు. మరి తల్లి కూడా అప్పుడప్పుడూ ఇక్కడకు వస్తూంటుంది కదా మరి.

 హే సుల్తాన్ ....

హే సుల్తాన్ ....

సల్మాన్ ఖాన్ లైఫ్ ని ఓ సుల్తాన్ లాగ ఎంజాయ్ చేస్తూంటాడు. ఇదిగో ఫామ్ హౌస్ లో ఇలా గుర్రంపై తిరుగుతూంటాడు. ఒక్కోసారి బైక్ పై, ఇంకోసారి కారులో , ఇలా గుర్రంపై ఓసారి మూడ్ ని బట్టి ఫాలో అయిపోతాడంతే. సల్మాన్ కు ఎందులో కిక్ లభిస్తే అందులోనే ఇలా ..

 కేసులు, గొడవలు ఎన్ని ఉన్నా..

కేసులు, గొడవలు ఎన్ని ఉన్నా..

వివాదాలు కోర్టు కేసులు ఇలా ఎన్ని సమస్యలు ఉన్నా అవి ఏమి సల్మాన్ విలాసవంతమైన జీవితం పై ఎటువంటి ప్రభావం చూపెట్టడం లేదు. ఈనేపధ్యంలో సల్మాన్ ఖాన్ నిర్మించుకుంటున్న హాలిడే హోమ్ గురించి సంబంధించిన విషయాలు బాలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి.

 డైరక్టర్, ఆయన భార్య

డైరక్టర్, ఆయన భార్య

ఈ ఫామ్ లో అప్పుడప్పుడూ వచ్చే అతిధిలతో పాటు రెగ్యులర్ విజిటర్స్ కూడా ఉన్నారు. అందులో ఒకరు సల్మాన్ తో భజరంగి భాయీజాన్ సినిమా డైరక్ట్ చేసిన కబీర్ ఖాన్. ఆయన తన భార్య మినీతో కలిసి ఇదిగో ఇలా ఈ ఫామ్ హౌస్ లో చక్కర్లు కొడుతున్నాడు. వాళ్ల ఎంజాయ్ వాళ్లది.

 గర్ల్ ఫ్రెండ్ కూడా ఓ లుక్కేసింది

గర్ల్ ఫ్రెండ్ కూడా ఓ లుక్కేసింది

అందరూ వచ్చి వెళ్తున్నారు ఓకే. మరి సల్మాన్ ఖాన్ గర్ల్ ఫ్రెండ్ లులియా వాంటర్ కనపడదే అనే డౌట్ మీకు వచ్చింది కదా. ఆమె కూడా ఇండియాకు వచ్చినప్పుడల్లా ఈ ఫామ్ హౌస్ లో స్టే చేస్తుంది. మనోడు సరదాగా ఫామ్ హౌస్ లో కబుర్లు చెప్తూ గడుపుతుంది. అందుకే ఆమెను కూడా సల్మాన్ ఇలా గుర్రంపై ఎక్కించాడు ఫామ్ హౌస్ లో.

 స్విమ్మింగా, రొమాన్సా

స్విమ్మింగా, రొమాన్సా

సల్మాన్ ఖాన్ ఇక్కడికి వచ్చి సరదాగా స్విమ్ చేయాలి అనుకుంటే...అందుకే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఇక్కడ చక్కగా జలకాలు ఆడుతూ గడపచ్చు. ఆయన గర్ల్ ఫ్రెండ్ తో ఎక్కువగా ఈ ప్లేస్ లోనే గడుపుతాడట. మరి కాస్త రొమాంటిక్ గానే ఉంది కదా.

 ఫ్యామిలీ కూడా ఫామ్ హౌస్ లో

ఫ్యామిలీ కూడా ఫామ్ హౌస్ లో


సల్మాన్ ఖాన్ పార్టీలు లేనప్పుడు అతని కుటుంబం ఇక్కడకు వస్తూంటుంది. ఆయన తండ్రి సలీమ్ ఖాన్ , తల్లి వచ్చి సేదతీరుతూంటారు. ముంబై స్పీడు లైఫ్ లో ఇలాంటి ఫామ్ హౌస్ లు అవసరం కదా. తన కొడుకు సంపాదించిన ఫామ్ హౌస్ లో హ్యాపీగా తిరగటం ఏ పేరెంట్స్ కు ఆనందంగా ఉండదు చెప్పండి.

 అది ఇది ఒకటి కాదు

అది ఇది ఒకటి కాదు


మీరు ఇప్పటిదాకా చూసి ఫామ్ హౌస్ ఫొటోలు వేరు, ఈ ఫామ్ హౌస్ వేరు. దీన్ని కూడా సల్మాన్ కొనుగోలు చేసాడు. ఇక్కడ పచ్చదనం ప్రేమగా పలకరిస్తుంది. చూసిన వెంటనే మారు ఆలోచన లేకుండా చాలా పెద్ద మొత్తం పెట్టి సల్మాన్ దీన్ని సొంతం చేసుకున్నారు. దీన్ని ఇంకా అద్బుతంగా చేసే పనిలో ఉన్నాడట.

 మీరేమనుకుంటున్నారు

మీరేమనుకుంటున్నారు

ఈ ఫొటోలన్నీ చూసారు కదా. సల్మాన్ ఫామ్ హౌస్ చూసాక మీకు ఏమి అనిపించింది. మీకూ అలాంటిది ఉంటే బాగుండును అనిపించిందా లేక వేరే ఆలోచనలు వచ్చాయా. వాటినన్నిటినీ చక్కగా క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. ఆలోచనలు పంచుకుందాం. సరదాను షేర్ చేద్దాం.

English summary
Salman Khan loves to live his life to the fullest. The actor has been staying in a small room with his family in Galaxy Apartments for the past 40 years but not many are aware that he has a huge farm house in Panvel, where the superstar often hosts big parties.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu