»   » ఎన్టీఆర్ జనతా గ్యారేజ్: సమంత, నిత్యా మీనన్ రోల్స్ ఇంట్రెస్టింగ్

ఎన్టీఆర్ జనతా గ్యారేజ్: సమంత, నిత్యా మీనన్ రోల్స్ ఇంట్రెస్టింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం 'జనతా గ్యారేజ్'. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు సమంత, నిత్యా మీనన్ నటిస్తున్నారు. దర్శకుడు హీరో క్యారెక్టర్ ను రెండు డిఫరెంట్ షేడ్లలో చూపించబోతున్నారు. అయితే సినిమాలో ఇద్దరు హీరోయిన్ల క్యారెక్టర్లు ఎన్టీఆర్ కనిపించే ఆయా షేడ్లలో అతని పాత్రకు బాగా అటాచ్ అయ్యేలా ప్లాన్ చేసారట.

హీరోయిన్ సమంత ఎన్టీఆర్ ఐఐటి క్లాస్ మేట్ గా కనిపిస్తుండగా.... నిత్యా మీనన్ పాత్రను కథలో ట్విస్ట్ జోడిస్తూ డిజైన్ చేసారని అంటున్నారు. ఎన్టీఆర్ ఐఐటి స్టూడెంటుగా ఉన్న సమయంలో అతని క్లాస్ మేట్ గా సమంత కనిపించబోతోంది. ఈ సమయంలో వీరి మధ్య నడిచే రొమాంటిక్ సీన్లు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి.

Interesting Character Sketches For Nithya Menen & Samantha In NTR's Janatha Garage

ఐఐటి ముంబైలో చదివిన ఒక వ్యక్తి... జనతా గ్యారేజ్ పెట్టి బలవంతుల అరాచకాలకు బలవుతున్న బలహీనులకు అండగా నిలవాలనే నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అనే అంశానికి నిత్యా మీనన్ పాత్రకు లింక్ ఉంటుందని టాక్.

సాధారణంగా కొరటాల శివ సినిమాల్లో హీరోయిన్ అంటే కథలో భాగమై ఉంటుంది. ఏదో పాటలు, గ్లామర్ కోసం ఆయన హీరోయిన్లను వాడే రకం కాదు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లను తీసుకోవడం వెనక కథ పరంగా అవసరం కాబట్టే వీరిద్దరి క్యారెక్టర్లను ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేసాడని అంటున్నారు. నిత్యా మీనన్ పాత్ర కథలో కీలకంగా ఉంటుందని, ఆ పాత్రతోనే కథలో ఒక ట్విస్ట్ ఉంటుందని తెలుస్తోంది.

English summary
It is learnt that both the leading ladies in NTR-Koratala Siva's Janatha Garage will have an interesting character sketch, designed to use their potentialities to the best. While Samantha is playing the actor's love interest and a classmate at IIT, Nithya Menen's role is apparently the twist in the plot.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu