»   » వినికిడి లోపం ఉన్న చిట్టిబాబుకు ఎలా సాధ్యం..ఇలా సస్పెన్స్ లోకి నెట్టావ్ ఏంటి సుక్కు!

వినికిడి లోపం ఉన్న చిట్టిబాబుకు ఎలా సాధ్యం..ఇలా సస్పెన్స్ లోకి నెట్టావ్ ఏంటి సుక్కు!

Subscribe to Filmibeat Telugu
రంగస్థలం చిత్రంలో రాజకీయ అంశాలు : 2019 టార్గెట్ నా ?

విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రంగస్థలం చిత్రంపై అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. 1985 నాటి పరిస్థితులకు అనుగుణంగా రంగస్థలం చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ అందంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రాంచరణ్ ఈ చిత్రంలో వినికిడి లోపం ఉన్న యువకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా చిట్టిబాబు పాత్రలో రాంచరణ్ అదరగొట్టడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక సమంత రామలక్ష్మి పాత్ర కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల సోషల్ మీడియాలో లాంతర్ గుర్తుకు ఓటేయండి అంటూ ఆది లుక్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆది ఈ చిత్రంలో రాంచరణ్ కు సోదరుడిగా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ అంశమే ఉత్కంఠతో అభిమానులని కుదురుగా ఉండనీయడం లేదు.

క్రేజీ మూవీగా మారిపోతున్న రంగస్థలం

క్రేజీ మూవీగా మారిపోతున్న రంగస్థలం

రంగస్థలం చిత్రం ప్రారంభం అయినప్పటి నుంచి మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. 1985 పరిస్థితుల నేపథ్యంలో సుకుమార్ అచ్చతెలుగు కథని తెరకెక్కించబోతున్నాని అంతా భావించారు.

లోపం ఉన్నప్పటికీ చిట్టిబాబు అదుర్స్

లోపం ఉన్నప్పటికీ చిట్టిబాబు అదుర్స్

రంగస్థలం అనే ఊళ్ళో చిట్టి బాబు అనే వినికిడి లోపం ఉన్న కుర్రాడు. వినికిడి లోపం ఉన్నప్పటికీ చిట్టిబాబు హుషారైన కుర్రాడే. చిట్టిబాబు హుషారు ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలంటే విడుదల వరకు ఆగాల్సిందే.

రామలక్ష్మి సంగతి

రామలక్ష్మి సంగతి

సమంత ఈ చిత్రంలో రామలక్ష్మిగా నటిస్తోంది. సమంత పాత్రకు ప్రత్యేకంగా టీజర్ కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. రామలక్ష్మి అందాలని వర్ణిస్తూ ఎంతసక్కగునవె సాంగ్ విడుదల చేసారు. అభిమానులకు ఆ పాట తెగ నచ్చేసింది. ఇటీవల రంగమ్మ మంగమ్మ అనే రొమాంటిక్ సాంగ్ కూడా విడుదల చేసారు. ఈ సాంగ్ ఉర్రూతలూగిస్తున్న సంగతి తెలిసిందే.

1985 పరిస్థితులకు అనుగుణంగా

1985 పరిస్థితులకు అనుగుణంగా

సుకుమార్ ఈ చిత్రాన్ని 1985 పరిస్థితులకు అనుగుణంగా తెరకెక్కిస్తున్నారు. ఆ సమయంలో ఉన్న పల్లెటూరి వాతావరణానికి తగ్గట్లుగా సెట్లు వేసి చిత్రీకరణ జరిపినట్లు తెలుస్తోంది. సినిమా చూసినంత సేపు 1985 కాలంలోకి వెళ్లిన అనుభూతి అభిమానులకు కలగనునట్లు ఇన్ సైడ్ టాక్.

అలా అనుకుంటే పొరపాటే

అలా అనుకుంటే పొరపాటే

రంగస్థలం చిత్రం కేవలం అందమైన పల్లెటూరి నేపథ్య చిత్రం అని అనుకుంటే పొరపాటు పడ్డట్లే. ఈ చిత్రంలో రక్తి కట్టించే రాజకీయ సన్నివేశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి గతంలోనే వార్తలు వచ్చాయి.

మరో క్లూ ఇచ్చాడు

మరో క్లూ ఇచ్చాడు

రంగస్థలం చిత్రంలో రాజకీయ అంశాలు ఉన్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ క్లూ ఇచ్చింది. హీరో ఆదిపినిశెట్టి ఈ చిత్రంలో రాంచరణ్ సోదరుడిగా నటిస్తున్నాడు. ఆది పినిశెట్టి లుక్ ఇటీవల సోషల్ మీడియాలో తెగ చల్ చల్ చేసింది. లాంతర్ గుర్తుకే మీ ఓటు అంటూ ఆది లుక్ కనిపించింది.

చిట్టిబాబుకు ఎలా సాధ్యం

చిట్టిబాబుకు ఎలా సాధ్యం

చిట్టి బాబు సోదరుడు ఎన్నికలో పోటీ చేస్తుంటే అతడికి కచ్చితంగా ప్రత్యర్థి ఉంటాడు.ఆ ప్రత్యర్థి ఎవరు, వారి నుంచి వినికిడి లోపం ఉన్న చిట్టిబాబు తన సోదరుడిని గెలిపించడం సాధ్యమేనా ? గెలిపించాడా లేదా ? వంటి ప్రశ్నలని సుకుమార్ అభిమానులకు వదలిపెట్టి సస్పెన్స్ లోకి నెట్టాడు.

రాజకీయ రంగస్థలం వెండి తెరమీదే

రాజకీయ రంగస్థలం వెండి తెరమీదే

సుకుమార్ రేకెత్తించిన సస్పెన్స్ వీడాలంటే మార్చ్ 30 న రంగస్థలం చిత్రం చూడవలసిందే. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం త్వరలో ఆడియో వేడుకకు సిద్ధం అవుతోంది.

English summary
Interesting details on Rangasthalm story. Interesting discussion on Aadi role
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu