twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కంగ్రాట్స్ ఎన్టీఆర్, వక్కంతం వంశీ: అంతర్జాతీయ పోలీస్ జర్నల్ లో "టెంపర్"

    |

    యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కు బూస్ట్ ఇచ్చిన చిత్రం టెంప‌ర్. అప్ప‌టివ‌ర‌కూ వ‌రుస ఫెయిల్యూర్స్ లో ఉన్న తార‌క్ కు ఆ సినిమా మంచి ఎన‌ర్జీని ఇచ్చింది. క‌మ‌ర్శియ‌ల్ గాను సినిమా పెద్ద స‌క్సెస్ అయింది. పూరీజగన్నాథ్- ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన ఫిల్మ్ టెంపర్. ఇప్పుడు ఈ సినిమా మరో అరుదైన మెట్టు ఎక్కేసింది.

     యంగ్ టైగర్ ఎన్టీఆర్

    యంగ్ టైగర్ ఎన్టీఆర్

    రెగ్యులర్‌గా మాస్ సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, రూట్ మార్చి చేసిన తొలి చిత్రం టెంపర్. ఎప్పుడు తన సొంత కథలతోనే సినిమాలు చేసే పూరి జగన్నాథ్ ఫస్ట్ టైం ఈ సినిమా కోసం వక్కంతం వంశీ దగ్గర కథ తీసుకున్నాడు.

    నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్

    నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్

    ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్‌గా నటించిన టెంపర్ ఘనవిజయం సాధించటంతో పాటు ఎన్టీఆర్ను అభిమానులకు మరింత చేరువ చేసింది.వరస డిజాస్టర్‌లతో కొట్టుమిట్టాడుతున్న ఎన్టీఆర్‌కి `టెంప‌ర్` టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించిన ఈ చిత్రం. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను తెగ అలరించింది.

    యూనివర్సల్ కాన్సెప్ట్‌ కావడం వల్లనే

    యూనివర్సల్ కాన్సెప్ట్‌ కావడం వల్లనే

    యూనివర్సల్ కాన్సెప్ట్‌తో తీసిన సినిమా కావడం వల్లనే టెంపర్‌ను నవలగా రాశానని వక్కంతం వంశీ తెలిపారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పవర్‌ఫుల్ పోలీస్ అధికారి దయా పాత్రలో నటించిన విషయం తెలిసిందే. సినిమా కథలో సార్వజనీన అంశాలు వుండటం వల్ల ఇంగ్లీష్ నవలా రూపంలో రాయడం అంత కష్టంగా అనిపించలేదని వక్కంతం వంశీ చెప్పారు.

     ముగింపు వేరు

    ముగింపు వేరు

    నవల రాయడానికి ఎనిమిది నెలల సమయం పట్టింది. అయితే ఈ నవలలో ఉండే ముగింపు వేరు, సినిమాలో ఉండే ముగింపు వేరు, ఆ ముగింపు ఏమిటన్నది తెలుసుకోవాలంటే ఆ బుక్ కొనాలాసిందే. ప్రముఖ పబ్లిషింగ్‌ సంస్థ బ్లూమ్స్‌ బర్రీ రచయిత వక్కంతం వంశీ రాసిన టెంపర్‌ నవలను ప్రచురించింది.

     సినిమాకథ నవలా రూపంలోకి

    సినిమాకథ నవలా రూపంలోకి

    ఇప్పటివరకు ఇండస్ట్రీలో నవలల ఆధారంగా సినిమాలు తెరకెక్కడం చూశాం. కాని ఈ సారి వినూత్నంగా ఓ సినిమా కథ నవలా రూపంలోకి మారింది. మరి ఆ గౌరవం మన తెలుగు సినిమాకి దక్కడం విశేషం.

    ప్రపంచం లోనే టాప్ పబ్లిషర్

    ప్రపంచం లోనే టాప్ పబ్లిషర్

    గతం లోనూ టాలీవుడ్ లో వెండితెర నవల లు మామూలే అయినా... ఒక తెలుగు సినిమా ఏకంగా ఇంగ్లిష్ లోకి వెళ్ళటం, ప్రపంచం లోనే టాప్ పబ్లిషర్ లలో ఒకటైన బ్లూమ్స్ బెర్రీ దీన్ని పబ్లిష్ చేయటమూ మామూలు విషయం కాదు.

    అంతర్జాతీయ పోలీస్‌ జర్నల్‌

    అంతర్జాతీయ పోలీస్‌ జర్నల్‌

    ఇటీవల మార్కెట్‌లోకి సైలెంట్‌గా వచ్చిన టెంపర్‌ ఇంగ్లీషు నవల అంతర్జాతీయ పాఠకులను ఉర్రూతలూగిస్తోంది. అయితే ‘ కాప్స్‌ టుడే' అనే అంతర్జాతీయ పోలీస్‌ జర్నల్‌లో ‘టెంపర్‌' నవలని ప్రశంసిస్తూ ప్రత్యేకంగా రాయడం తెలుగుసాహితీ లోకానికి గర్వకారణం.

     దయా క్యారెక్టర్‌ని ఆకాశంలో నిలబెట్టింది

    దయా క్యారెక్టర్‌ని ఆకాశంలో నిలబెట్టింది

    ఈ నవలలో ఉండే ముగింపు "దయా" క్యారెక్టర్‌ని ఆకాశంలో నిలబెట్టిందని పబ్లిషింగ్‌ హౌస్‌ ప్రతినిధి ప్రవీణ్‌ అన్నారు. రచయిత వంశీకి సమయం లేని కారణంగా ఈ నవలను ఇంకా అధికారికంగా ఆవిష్కరించలేదు. అయినప్పటికీ ఇప్పటికే అనూహ్యమైన రీతిలో అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. కాగా ఈ నవలని వంశీ ప్రపంచంలోని నిజాయితీగల పోలీసులకు అంకితమిచ్చారు.

    English summary
    The movie Temper got released in the year 2015 and gave some breath to both director and hero. Vakkantham has penned an English novel based on Temper's story as a Novel. Now International police journal Cops Today Publishd a special story on this book
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X