»   » సీక్రెట్ బయట పెట్టిన డైరెక్టర్: శ్రీదేవికి బోనీ కంటే ముందే అతడితో పెళ్లయింది!

సీక్రెట్ బయట పెట్టిన డైరెక్టర్: శ్రీదేవికి బోనీ కంటే ముందే అతడితో పెళ్లయింది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రీదేవి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూస్తే మనకు ఎన్నో వివాదాలు, విషాలు కనిపిస్తాయి. చిన్నతనం నుండి నటించడం ప్రారంభించిన శ్రీదేవి అప్పటి నుండి కష్టపడుతూనే ఉంది. తన భుజాలపైనే కుటుంబ భారాన్ని మోసింది. అయితే యుక్త వయసులోకి వచ్చిన తర్వాత శ్రీదేవి తనకు నచ్చినట్లుగా ఉండలేకపోయింది. ఆమె ప్రేమకు, ఇష్టాలకు తల్లితో పాటు కుటుంబ సభ్యులు అడ్డు పడుతూ ఉండేవారనే ఆరోపణలు ఉన్నాయి.

Sridevi's Life Truths : బోనీ కపూర్‌ను ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని బాధపడిందట ?
అతడితో ప్రేమాయణం

అతడితో ప్రేమాయణం

బోనీ కపూర్‌తో పెళ్లి కంటే ముందు శ్రీదేవి బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తితో చాలా సినిమాల్లో నటించింది. ఈ సమయంలోనే వీరు ప్రేమలో పడ్డారు. పెళ్లి కూడా చేసుకున్నారనే వార్తలు అప్పట్లో వినిపించాయి. అయితే నిజం ఏంటనేది బయటి ప్రపంచానికి అటు మిథున్ చక్రవర్తి కానీ, ఇటు శ్రీదేవి కానీ వెల్లడించలేదు.

మిథున్-శ్రీదేవి పెళ్లి నిజమే అంటున్న దర్శకుడు

మిథున్-శ్రీదేవి పెళ్లి నిజమే అంటున్న దర్శకుడు

అప్పట్లో మిథున్, శ్రీదేవి పెళ్లి జరిగిన మాట నిజమే అని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో సీనియర్‌ దర్శకుడు బాపయ్య తెలిపారు. శ్రీదేవితో ఆయన దాదాపు 16 సినిమాలు చేశారు. శ్రీదేవి గురించి బాగా తెలిసిన వ్యక్తి.

 మిథున్ స్వయంగా వెల్లడించారు.

మిథున్ స్వయంగా వెల్లడించారు.

శ్రీదేవితో వివాహం అయిందని మిథున్‌చక్రవర్తి నాతో స్వయంగా చెప్పారు. ఆ పెళ్లికి ఆయన తల్లిదండ్రులు కూడా వచ్చారని, బాంబేలోని మడ్‌ ఐల్యాండ్‌లోని బీచ్‌హౌస్‌లో తమ పెళ్లి జరిగిందని అతడు చెప్పినట్లు... బాపయ్య గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

తాళి మాత్రం కట్టలేదు

తాళి మాత్రం కట్టలేదు

‘వీరి పెళ్లి విచిత్రంగా జరిగింది. బెంగాలీ సంప్రదాయం ప్రకారం తాళి కట్టకుండా, చేతికి కడియం తొడిగి ఒక్కటయ్యారు.' అని బాపయ్య తెలిపారు. ఈ వ్యవహారాలేవీ ప్రత్యక్షంగా నేను చూడలేదు, మిథున్, ఇతర వ్యక్తుల ద్వారా తెలిసినవే అని బాపయ్య తెలిపారు.

ఏదైతే జరుగ కూడదనుకున్నానో అదే జరిగింది

ఏదైతే జరుగ కూడదనుకున్నానో అదే జరిగింది

అప్పట్లో ఓ సందర్భంలో నేను శ్రీదేవితో ఓ విషయం గురించి మాట్లాడుతూ... ‘రెండో పెళ్లివాడిని మాత్రం చేసుకోవద్దమ్మా' అని చెప్పాను. కానీ అనుకోని పరిస్థితుల్లో అదే జరిగిపోయింది. అప్పటికే పెళ్లయి పిల్లలు ఉన్న బోనీ కపూర్‌ను ఆమె రెండో వివాహం చేసుకుంది అని బాపయ్య తెలిపారు.

శ్రీదేవి మంచి డాన్సర్

శ్రీదేవి మంచి డాన్సర్

నేను శ్రీదేవితో ‘మక్సద్‌' పిక్చర్‌ చేసే సమయంలో స్నేక్‌ డ్యాన్స్‌ చేస్తుంటే ఆమె మోకాళ్లు కొట్టుకుపోయాయి. మోకాళ్లకు వేసుకునే నీక్యాప్స్‌ తెప్పించినా వేసుకోవడానికి ఆమె ఇబ్బంది పడింది. అయినా ఎక్కడా ఆమె డ్యాన్స్‌లో వెనుకడుగు వేయలేదు. బాధను భరిస్తూనే, ఆ ఛాయలేవీ ముఖంమీద కనిపించకుండా ఆ డ్యాన్స్‌ అద్భుతంగా చేసింది... అని బాపయ్య తెలిపారు.

చాలా కష్టపడుతుంది

చాలా కష్టపడుతుంది

శ్రీదేవి తను కమిటైన సినిమాలకు ఎంతో కష్టపడి పని చేసేది. సెట్‌లో ఎంతో హుందాగా, గౌరవంగా ఉండేది. ప్రతి షాట్‌ను ఛాలెంజింగ్‌గా తీసుకునేది. దర్శక, నిర్మాతలను ఇబ్బంది పెట్టేదికాదు.... అని బాపయ్య తెలిపారు.

 బాలీవుడ్ ఎంట్రీ తర్వాత

బాలీవుడ్ ఎంట్రీ తర్వాత

శ్రీదేవి బాలీవుడ్‌కు వచ్చిన తరువాత 15 సినిమాల వరకూ నాజ్‌ అనే యువతి డబ్బింగ్‌ చెప్పింది. తరువాత ‘వఖ్త్‌కి ఆవాజ్‌'లో ఆమె తొలిసారిగా డబ్బింగ్‌ చెప్పింది. అందులో హీరో మిధున్‌ చక్రవర్తి. అప్పుడు కూడా ఆమెకు కాన్ఫడెన్స్‌ వచ్చేవరకూ వారంరోజులు డబ్బింగ్‌ ఆపాం.... అని బాపయ్య తెలిపారు.

English summary
Sridevi allegedly got her marriage to Mithun annulled and broke up with him in 1988 since she got to know he would never hurt or leave Yogeeta.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu