»   » ఐపీఎల్ 8: హృతిక్, అనుష్క, షాహిద్, సైఫ్ ఫెయిల్యూర్ షో

ఐపీఎల్ 8: హృతిక్, అనుష్క, షాహిద్, సైఫ్ ఫెయిల్యూర్ షో

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 8 ఓపెనింగ్ సెర్మనీ ఎంతో సక్సెస్ అవుతుందని ఊహించిన అభిమానులకు నిరాశ మిగిలింది. బాలీవుడ్ సూపర్ స్టార్లు హృతిక్ రోషన్, షాహిద్ కపూర్, పర్హాన్ అక్తర్, అనుష్క శర్మ లాంటి వారు పెర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ ఫెయిల్యూర్ షోగా చిత్రకెక్కింది.

అందుకు కారణం....ఓపెనింగ్ సెర్మనీ ప్రారంభం కాగానే వర్షం పడటమే. దీంతో కార్యక్రమాలన్నీ ప్లాన్డ్ గా సాగలేక పోయాయి. వర్షం తగ్గిన తర్వాత తీరిగ్గా కార్యక్రమాలు మొదలయ్యాయి. మరో వైపు వివిధ జట్ల కేప్టన్లు ఆహ్వానించే క్రమంలో సైఫ్ అలీ ఖాన్ తడబడ్డాడు. ఒకరికి బదులు మరొకరి పేరు పిలిచాడు.

ఇక షాహిద్ కపూర్ స్టేజీపై తడబడ్డాడు. ఐయా ఎ డిస్కో డాన్సర్ సాంగుకు పెర్ఫార్మెన్స్ చేసే క్రమంలో బైక్ పై నుండి దాదాపుగా క్రింద పడబోయాడు. స్టేజీపై తను వేయాల్సిన స్టెప్స్ మరిచి పోయాడు. మరో వైపు అనుష్క శర్మ తన పెర్ఫార్మెన్స్ కోసం ఎంచుకున్న స్లో సాంగ్ బాగోలేదు. ఆమె బాయ్ ఫ్రెండు విరాట్ కోహ్లి తప్ప ఆమె షో ఎవరూ ఎంజాయ్ చేయలేక పోయారు. ఇక పర్హాన్ అక్తర్ పాట పాడి అలరించాలని చూసాడు కానీ అతని లిప్ సింక్ కాలేదనే విమర్శలు వచ్చాయి. హృతిక్ రోషన్ పెర్ఫార్మెన్స్ ఫర్వాలేదు కానీ చాలా పాత పాట ఎంచుకున్నాడు. గత ఐపీఎల్ సీజన్లతో పోలిస్తే ఐపీఎల్-8 సీజన్ ప్రారంభోత్సవ కార్యక్రమం చాలా చెత్తగా సాగిందనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.

వర్షం

వర్షం


వర్షం కారణంగా ఐపీఎల్ 8 ప్రారంభోత్సవ కార్యక్రమం ఫెయిల్యూర్ షోగా మిగిలి పోయింది.

సైఫ్ అలీ ఖాన్

సైఫ్ అలీ ఖాన్


సైఫ్ అలీ ఖాన్ యాంకరింగ్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు.

షాహిద్ కపూర్

షాహిద్ కపూర్


షాహిద్ కపూర్ కూడా పెర్ఫార్మెన్స్ విషయంలో ఫెయిల్ అయ్యాడు.

అనుష్క శర్మ

అనుష్క శర్మ


అనుష్క శర్మ తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోలేక పోయింది. ఆమె బాయ్ ఫ్రెండ్ విరాట్ మాత్రం ఆమె షోను తెగ ఎంజాయ్ చేసాడు.

విరాట్ కోహ్లి

విరాట్ కోహ్లి


గర్ల్ ఫ్రెండ్ పెర్పార్మెన్స్ చూస్తున్న విరాట్ కోహ్లి.

పర్హాన్ అక్తర్

పర్హాన్ అక్తర్


మరో వైపు పర్హాన్ అక్తర్ పెర్ఫార్మెన్స్ కూడా సభికులను ఆకట్టుకోలేకపోయింది.

హృతిక్ రోషన్

హృతిక్ రోషన్


హృతిక్ రోషన్ డాన్స్ మూమెంట్స్ బావున్నాయి కానీ...అతను ఎంచుకున్న పాట బాలేదనే విమర్శలు వచ్చాయి.

హాట్ లుక్

హాట్ లుక్


హృతిక్ రోషన్ సూపర్ హాట్ లుక్ తో ఆకట్టుకున్నాడు.

హృతిక్-అనుష్క

హృతిక్-అనుష్క


హృతిక్ రోషన్, అనుష్క పెర్ఫార్మెన్స్ అనంతరం హగ్, పెక్ తో ఒకరినొకరు గ్రీట్ చేసుకున్నారు.

English summary
Indian Premier League 8 opening ceremony kick started with Bollywood superstars Hrithik Roshan, Shahid Kapoor, Farhan Akhtar and Anushka Sharma's performances despite rain. The IPL 8 opening ceremony was the most anticipated and extravagant event which turned out sour. Right from Shahid Kapoor's performance to Hrithik Roshan's finishing performance, nothing seemed to go on as planned.
Please Wait while comments are loading...