»   » బాహుబలి-2 విజయాన్ని చూసి బాలీవుడ్ ఈర్ష్య పడుతోందా?

బాహుబలి-2 విజయాన్ని చూసి బాలీవుడ్ ఈర్ష్య పడుతోందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దేశంలో అతిపెద్ద సినీ పరిశ్రమ బాలీవుడ్ సైతం అందుకోలేని అతి పెద్ద విజయాన్ని రూ. 1000 కోట్ల వసూళ్లతో అందుకున్న మన 'బాహుబలి'ని చూసి బాలీవుడ్ ఈర్ష్య పడుతోందా? అంటే అవుననే అంటున్నారు.

ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు నమోదు చేస్తూ ప్రపంచాన్నిసైతం నివ్వెర పరుస్తున్న బాహుబలి-2 సినిమాపై అన్ని వర్గాల నుండి ప్రశంసలు అందుతున్నాయి. బాలీవుడ్ బడా హీరోలు, ఖాన్ త్రయం మాత్రం మన తెలుగు సినిమా విజయంపై మౌనంగానే ఉన్నారు.


Is Bollywood jealous about Baahubali’s success?

ప్రియాంక చోప్రా, కొందరు హిందీ ప్రముఖులు తప్ప..... సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ లాంట స్టార్స్, పెద్ద డైరెక్టర్లు ఎవరూ మన సినిమా గురించి కనీసం స్పందించలేదు. బాలీవుడ్ రికార్డులన్నీ తునాతునకలు చేసిన మన సినిమాను చూసి వారంతా ఈర్ష్య పడుతున్నారని అందుకే ఎవరూ స్పందించడం లేదని అంటున్నారు.


అయితే దక్షిణాది స్టార్ల నుండి మాత్రం బాహుబలిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. రజనీకాంత్, చిరంజీవి, శంకర్, మహేష్ బాబు ఇలా సౌత్ స్టార్స్ అందరూ ఇది మన సౌత్ సినిమా అంటూ గర్వ పడుతున్నారు.


English summary
S.S. Rajamouli’s magnum opus Baahubali is unstoppable and creating new records in Indian cinema. Except for a few stars like Priyanka Chopra from Hindi cinema, none of the big stars have reacted, especially the Khans.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu