twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బెజవాడలో పైన అమ్మవారు.. కింద కమ్మవారు.. డీజే టార్గెట్ అగ్రిగోల్డ్ స్కామ్.. మాటలు తూటాలుగా..

    కామెడీ, యాక్షన్ అంశాలను మేలవించి అగ్రిగోల్డ్ స్కామ్‌పై దర్శకుడు హరీశ్ శంకర్ సంధించిన సినీ అస్త్రమే దువ్వాడ జగన్నాథం.. బాధితులను కాపాడేందుకు హీరో కంకణం కట్టుకోవడం ఈ కథలో ప్రధాన పాయింట్. తాజాగా ఏపీలో బ్

    By Rajababu
    |

    కామెడీ, యాక్షన్ అంశాలను మేలవించి అగ్రిగోల్డ్ స్కామ్‌పై దర్శకుడు హరీశ్ శంకర్ సంధించిన సినీ అస్త్రమే దువ్వాడ జగన్నాథం.. రొటీన్ కథే అయినా భావోద్వేగాన్ని, హాస్యాన్ని, యాక్షన్, ఎంటర్‌టైన్ సమపాళ్లలో కలగలిపి డీజేను కొత్తగా చూపించడంలో సఫలమయ్యాడనేది టాక్. డీసెంట్ కామెడీని ఎంచుకోవడం ప్రధాన ఆకర్షణ. ప్రేక్షకుడిని ఆహ్లాదపరిచే విధంగా క్లైమాక్స్‌లో కామెడీ ఎంచుకోవడం గమనార్హం.

    Is Duvvada Jagannadham Movie story targets Agrigold Scam?

    విజయవాడ కేంద్రంగా జరిగిన అగ్రిగోల్డ్ కుంభకోణం లాంటి సీరియస్ సబ్జెక్ట్‌ను ఎంటర్‌టైన్‌మెంట్ పద్ధతిలో చెప్పడానికి దర్శకుడు ప్రయత్నించాడు. బాధితులను కాపాడేందుకు హీరో కంకణం కట్టుకోవడం ఈ కథలో ప్రధాన పాయింట్.

    తాజాగా ఏపీలో బ్రహ్మణ కమిషన్ చైర్మన్ ఐవీకే కృష్ణారావు ఘటన నేపథ్యం ఈ చిత్రానికి యాప్ట్‌గా మారే అవకాశం ఉంది. విజయవాడ కేంద్రంగా కొందరు నేతలు బ్రహ్మణ సంఘానికి చెందిన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు ఈ కథకు సూట్ అయ్యేలా ఉన్నాయనే వాదన వినిపిస్తున్నది.

    భూకబ్జాదారులు.. క్రిమినల్స్

    భూకబ్జాదారులు.. క్రిమినల్స్

    భూకబ్జాదారులను, క్రిమినల్స్‌ను ఏరి వేసే పోలీస్ అధికారి పాత్రలో మురళీ శర్మ మరోసారి తనదైన శైలిలో నటనను ప్రదర్శించాడు. సుబ్బరాజు పాత్ర బాగా ఉంటుంది. అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

    అగ్రో డైమండ్ కుంభకోణం

    అగ్రో డైమండ్ కుంభకోణం

    ఈ చిత్రంలో జరిగే భూ కుంభకోణానికి అగ్రో డైమండ్ అనే పేరుపెట్టారు. డిఫాల్టర్ల ఆగడాలు, బాధితుల కష్టాలను ఉద్వేగభరితంగా చిత్రీకరించారు. ఏపీ రాజధానిని కేంద్రంగా చేసుకొని సాగిన ఈ భూదందా సహజంగానే ప్రేక్షకుడిని కదలిస్తుంది. ఇప్పటివరకు పత్రికల్లోనే వచ్చిన కథనాలకు ఇది తెరరూపంగా నిలిచింది.

    డైలాగ్స్ తూటాలుగా..

    డైలాగ్స్ తూటాలుగా..

    హరీశ్ శంకర్ రాసిన డైలాగ్స్ తెరమీద తూటాల పేలాయి. ఓ సీన్లో ‘బెజవాడలో పైన అమ్మవారు.. కింద కమ్మవారు' అంటూ చెప్పే డైలాగ్స్‌కు ప్రేక్షకులకు మంచి స్పందన వచ్చింది. సభ్య సమాజానికి ఏం చెబుతామనుకొంటున్నావ్ లాంటి డైలాగ్స్ ఆకట్టుకొన్నాయి. ఇలాంటి డైలాగ్స్ ఏ సందర్భంలో వచ్చాయి.. ఎందుకు వచ్చాయి అనేది తెరమీద చూసి ఆనందించాల్సిందే. సీరియస్ సన్నివేశాల్లో అల్లు అర్జున్ చేత చెప్పించిన సంభాషణలు ఫ్యాన్స్ పండుగలా మారాయి. బ్రహ్మణ యాసపై స్టైలిష్ స్టార్ దృష్టిపెడితే మరింత బాగుండేదనే టాక్ వినిపిస్తున్నది.

    ఫైట్స్.. మ్యూజిక్ గుడ్..

    ఫైట్స్.. మ్యూజిక్ గుడ్..

    సినిమా ప్రారంభంలో వచ్చే ఫైట్, ఇంటర్వెల్ ఫైట్ బాగుంది. అల్లు అర్జున్ ఫోర్స్ తెరమీద బాగా పండింది. కీలక సన్నివేశాల్లో దేవీ శ్రీ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. వెన్నెల కిషోర్ కామెడీ మరోసారి పండింది.

    పుష్కలంగా పూజా గ్లామర్

    పుష్కలంగా పూజా గ్లామర్

    పూజా హెగ్డే గ్లామర్ ఈ చిత్రానికి మరో ఆకర్షణ. పూజా హెగ్డే పాత్ర కథను బట్టి పరిమితంగా ఉన్నా.. ప్రేక్షకుడికి ఎలాంటి గ్లామర్ లోటు కనిపించదు. ఈ సినిమా టాలీవుడ్‌లో స్థిరపడేందుకు ఆమెకు దోహదపడుతుంది.

    English summary
    Duvvada Jagannadham Movie story targets Agrigold Scam. Hero Allu Arjun tries to rescue the investors in Agri Diamond which audience relate to the burning Agrigold issue in Vijayawada. Director Harish Shankar penned like Bezawada lo paina Ammavaru , Kindha Kammavaru” dialogues get huge response.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X