»   » ఆ సాంగ్ లేకుండా పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’చేయలేడా...?

ఆ సాంగ్ లేకుండా పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’చేయలేడా...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

'దబాంగ్" చిత్రాన్ని పవన్ కళ్యాణ్ రీమేక్ చేస్తున్న విషయం తెలియగానే, ఒరిజినల్ వెర్షన్ చూసినవాళ్లంతా 'మున్నీ కౌన్..?" అంటూ క్వశ్చన్ చేశారు. 'దబాంగ్"లో మున్నీ బద్నాం హుయీ పాట అంత పాపులర్ అయింది మరి. గత సంవత్సరం బాలీవుడ్ టాప్ సాంగ్ అనిపించుకున్న ఈ పాటలో మలైకా అరోరా డాన్స్ చేసింది. 'దబాంగ్" రీమేక్ చేయడమంటే మున్నీ పాటని లేకుండా మాత్రం చేయలేరనేంతగా ఆ పాట హిట్ అయింది.

మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా కానీ ఆ ట్యూన్ ని యథాతథంగా వాడుకునే అవకాముంది, అయితే ఈ ఐటమ్ సాంగ్ లో డాన్స్ చేసేది ఎవరనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. మలైకాతోనే మళ్లీ చేయిస్తారో, లేక 'గబ్బర్ సింగ్" కోసం మరెవరైనా హాట్ లేడీ మున్నీ అవతారమెత్తుతుందో కొన్నాళ్లాగితే తెలుస్తుంది. అలాగే ఒరిజినల్ హీరో స్టెప్ బ్రదర్ క్యారెక్టర్ చేసిన అర్బాజ్ ఖాన్ పాత్రని తెలుగు వెర్షన్ లో ఎవరు చేస్తారని కూడా డిస్కషన్ జరుగుతోంది. శివాజీ లేదా శర్వానంద్ కి ఈ క్యారెక్టర్ ఆఫర్ చేస్తారని టాక్ వినిపిస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu