»   » తండ్రి కాబోతున్న టాప్ హీరో.. భార్యకు సారీ చెప్పిన..

తండ్రి కాబోతున్న టాప్ హీరో.. భార్యకు సారీ చెప్పిన..

Written By:
Subscribe to Filmibeat Telugu

'ఓకే బంగారం' టాలీవుడ్‌కు పరిచయమైన మళయాల నటుడు, ప్రముఖ హీరో మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ తండ్రి కాబోతున్నారు. 2011లో అమల్ సుఫియాతో దుల్కర్ పెళ్లైన విషయం తెలిసిందే. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ తండ్రి కాబోతున్నాడనే విషయం మల్లూవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

మమ్ముట్టి తనయుడిగా

మమ్ముట్టి తనయుడిగా

ప్రముఖ మలయాళ హీరో మమ్ముట్టి తనయుడిగా సినీ పరిశ్రమంలోకి అడుగుపెట్టిన దుల్కర్ సల్మాన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మణిరత్నం దర్శకత్వం వహించిన ఓకే బంగారం ద్వారా టాలీవుడ్‌కు సుపరిచితం.

టాలీవుడ్‌కు ఒకే బంగారం

టాలీవుడ్‌కు ఒకే బంగారం

సల్మాన్ దుల్కర్ నటించిన పలు మలయాళ మూవీస్ తెలుగులోకి డబ్ అయ్యాయి. ఆయన సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొన్నాయి. ఇటీవల దుల్కర్ కజిన్ మగ్బూల్ పెళ్లి వేడుకలో స్మార్ట్ హీరో సతీమణి అమల్ సూఫియా గర్భవతి అనే విషయం తేటతెల్లమైంది.

భార్య ప్రెగ్నెంట్.. కన్‌ఫర్మ్

భార్య ప్రెగ్నెంట్.. కన్‌ఫర్మ్

దుల్కర్ సన్నిహితుల సమాచారం ప్రకారం ప్రస్తుతం అమల్ ప్రగ్నెన్సీతోనే ఉందని టాక్. మే చివరి వారంలో లేదంటే జూన్ ఫస్ట్ వీక్ లో దుల్కర్, అమల్ దంపతులకు పండంటి బిడ్డ జన్మించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఐదో వివాహా వార్షికోత్సవం

ఐదో వివాహా వార్షికోత్సవం

దల్కర్ సల్మాన్ దంపతులు గతేడాది డిసెంబర్‌లో ఐదో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకొన్నారు. ఈ వేడుక సందర్భంగా సల్మాన్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ‘కార్టూన్ లాంటి నన్ను నీవు ఎలా పెళ్లి చేసుకొన్నావో నాకు ఇప్పటికీ అర్ధం కాదు.

దూరంగా ఉన్నందుకు సారీ

దూరంగా ఉన్నందుకు సారీ

అయినా థ్యాంక్స్ బేబీ. హ్యపీ వెడ్డింగ్ డే. ఐదు సంవత్సరాలు ఐదుసార్లు కనురెప్పలు కొట్టినంత తేలికగా గడిచిపోయాయి అని ట్వీట్ చేశారు. ఈ వెడ్డింగ్ వేడుకకు నీకు దూరంగా ఉన్నందుకు సారీ. నేను ఇంటికి చేరుకోగానే నీకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాను అని అన్నారు.

English summary
‘ఓకే బంగారం’ టాలీవుడ్‌కు పరిచయమైన మళయాల నటుడు, ప్రముఖ హీరో మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ తండ్రి కాబోతున్నారు. 2011లో అమల్ సుఫియాతో దుల్కర్ పెళ్లైన విషయం తెలిసిందే. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ తండ్రి కాబోతున్నాడనే విషయం మల్లూవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu