»   » సమంతా, నాగ చైతన్యా పెళ్ళి మాట ఎత్తటం లేదేంటీ? ఎందుకు??

సమంతా, నాగ చైతన్యా పెళ్ళి మాట ఎత్తటం లేదేంటీ? ఎందుకు??

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగార్జున చిన్నకుమారుడు అఖిల్, శ్రియాల పెళ్ళి ఆగిపోవడంతో, సమంతా, నాగచైతన్య పెళ్ళి తొందరగా చేయాలని అక్కినేని కుటుంభం నిర్ణయించిందనీ మరి కొద్దిరోజుల్లోనీ వీరిద్దరి పెళ్ళీ ఉంటుందనీ అప్పట్లో వార్తలు వచ్చాయ్. ఈ సంవత్సరమే వీరి పెళ్ళి అఖిల్ తో పాటు జరగనుందని అనుకున్నారు కానీ అనుకోని కారణాల వల్ల అఖిల్ మ్యారేజ్ క్యాన్సిల్ అవటం తో ఆ ప్రపోజల్ కూడా ఆగిపోయింది. అయితే ఆ ముహూర్తానికి కాదుగానీ త్వరలోనే సమంతా, నాగచైతన్యా పెళ్ళి అన్నారు కానీ ఇప్పుడేమో అసలావిషయమే మర్చిపోయినట్టు కనిపిస్తోంది.

కెరీర్ పరంగా బిజీ అవుతున్నారు

కెరీర్ పరంగా బిజీ అవుతున్నారు

చాలా రోజుల కిందటే ఈ జంటకు నిశ్చితార్థం కాగా ఈ వేసవిలో వివాహ వేడుక ఉంటుందన్న ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించటం లేదు. వరుస సినిమాలకు కమిట్ అవుతూ చైతూ, సమంతలు కెరీర్ పరంగా బిజీ అవుతున్నారు.కనీసం మాటల్లో కూడా ఎక్కడా ఈ ఇద్దరి పెళ్ళి సంగతి వినిపించటం లేదు.

వరుస సినిమాలు ఒప్పుకుంటున్నాడు

వరుస సినిమాలు ఒప్పుకుంటున్నాడు

ఇప్పటికే రారండోయ్ వేడుక చూద్దా సినిమా షూటింగ్ పూర్తి చేసి చైతూ, కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ప్రేమమ్ లాంటి సూపర్ హిట్ అందించిన దర్శకుడు చందూ మొండేటితో మరో సినిమా చేసేందుకు అంగీకరించాడు. వీటితో పాటు ప్రేమమ్ సినిమాను నిర్మించిన సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో మరో సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నాడు.

 సినిమాలకు కమిట్ అవుతోంది

సినిమాలకు కమిట్ అవుతోంది

ఈ రెండు సినిమాలను జూలై నుంచే సెట్స్ మీదకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు.,,సమంత కూడా ఇదే స్పీడులో సినిమాలకు కమిట్ అవుతోంది. ఇప్పటికే నాగార్జునతో కలిసి రాజుగారి గది 2లో, రామ్ చరణ్ సుకుమార్ సినిమాల్లో నటిస్తున్న సమంత ఈ రెండూ పూర్తవ్వగానే మహానటి షూటింగ్ లో పాల్గొనేలా ప్లాన్ చేసుకుంది.

ఈ ఏడాదిపెళ్లి లేనట్టే

ఈ ఏడాదిపెళ్లి లేనట్టే

అదే సమయంలో తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాను చేసేందుకు రెడీ అవుతోంది. వీటితో పాటు విశాల్ కొత్త సినిమాకు ఓకె చెప్పే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం జంట కమిట్ అయిన సినిమాలు పూర్తవ్వటానికి మరో ఏడాది సమయం పడుతుంది. అంటే ఈ ఏడాది నాగచైతన్య, సమంతల పెళ్లి లేనట్టే అన్న టాక్ వినిపిస్తోంది.

English summary
The much-awaited marriage of Tollywood is Naga Chaitanya and Samatha but due to their professional work, they have postponed it for awhile. On another side, Nagarjuna is busy in producing Akhil's second film...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu