»   » జెంటిల్ మేన్ - ఎవరికి ఎవరు బ్రేక్ ఇచ్చినట్టు..?

జెంటిల్ మేన్ - ఎవరికి ఎవరు బ్రేక్ ఇచ్చినట్టు..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

త‌న‌కు అష్టాచ‌మ్మాతో లైఫ్ ఇచ్చిన ఇంద్ర‌గంటికి తాను లైఫ్ ఇవ్వ‌డానికే జెంటిల్ మ‌న్ సినిమా చేస్తున్నాడనీ...ఒక వేళ ఈ సినిమా పోయిందీ అంటే మోహన్ తో పాటు నాని కూడా లైం లైట్ లోంచి మళ్ళీ వెళ్ళిపోతాడనీ కొన్ని గుసగుసలు ఇండస్ట్రీలో వినిపించాయి.. ఒక అడుగు ముందుకు వేసి మరీ "నానీ రిస్క్ తీసుకుంటున్నాడూ" అంటూ కూడా కొన్ని పత్రికలు రాసి పడేసాయి.

మోహన్ కోసమే నాని ఈ సినిమా ఒప్పుకున్నాడు అనేది నిజమో కాదో గానీ., సినిమా చూసాక చాలా మందికి ఒక విశయం అర్థమయ్యింది. ఈ సినిమా లో క్యారెక్టర్ కేవలం నాని ని దృష్టిలో పెట్టుకొనే రాసినట్టుంది. మరే హీరో ఆ క్యారెక్టర్ లో ఇమిడి పోలేడు. అందుకే మోహన కృష్ణ నాని ని సెలక్ట్ చేసుకున్నాడు.


nani

సినిమా మొత్తానికీ నాని నే మెయిన్ పిల్లర్.., తన భుజాల‌పైనే సినిమాను న‌డిపించాడు. ఈ తరహా కథ కొత్త కాక‌పోయినా. కథని సరిగ్గా నడపతం లో చాలా కేర్ తీసుకున్నాడు మోహనకృష్ణ. పట్టు గా ఉన్న స్క్రీన్ ప్లేతో ఎక్క‌డా త‌గ్గ‌కుండా కథని న‌డిపించాడు ఈ ద‌ర్శ‌కుడు. త‌న కెరీర్ లో ఇప్ప‌టి వ‌ర‌కు సాఫ్ట్ జోన‌ర్స్ మాత్ర‌మే ట‌చ్ చేసిన మోహ‌నకృష్ణ‌.. జెంటిల్ మ‌న్ తో చాలెంజ్ సబ్జెక్ట్ అయిన థ్రిల్ల‌ర్ జానర్ నీ ట‌చ్ చేసాడు.


థ్రిల్ల‌ర్స్ విష‌యంలో స్క్రీన్ ప్లే స‌రిగ్గా లేక‌పోతే అసలుకే మోసం వ‌స్తుంది. చిన్న లాజిక్ లోపించినా సినిమా మొత్తం గందర గోళం లో పడిపోయి. కంఫ్యూజన్ పెరిగి పోతుంది. కానీ ఇంద్ర‌గంటి అలాంటి త‌ప్పులు చేయ‌లేదు. అక్క‌డ‌క్క‌డా కొద్దిగా స్లోగా సాగినట్టనిపించినా. కొన్ని జాగ్రత్తలతో చక్కగా నడిపి చివ‌రికి ఇంత పోటీలోనూ ఒక సక్సెస్ కొట్టాడు. మొత్తానికి నాని సినిమా మొహమాటానికి ఒప్పుకున్నా అతనికి అత్యంత కీలక మైన విజయాన్ని అందించింది... ఇంకో కొన్నాళ్ళూ నాని కెరీర్ మీద బెంగ అవసరం లేదు.

English summary
Gentleman is a great watch for indraganti's Direction and Nani's stellar performance.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu