Don't Miss!
- News
ప్యాకేజీ స్టార్ దేశభక్తి ఇది.. రిపబ్లిక్ డే సాక్షిగా మళ్ళీ దొరికిన పవన్ కళ్యాణ్!!
- Finance
world economy: ప్రపంచ దేశాల ఆర్థిక ర్యాంకుల్లో మనమెక్కడ ?
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Shyam Singha Roy గూగుల్‌లో ఆ విధంగా ట్రెండింగ్.. నాని సినిమా ఎలాంటి క్రేజ్ అంటే?
నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ థియేటర్లలో రిలీజై విమర్శకుల ప్రశంసలు అందుకొన్నది. పూర్వ జన్మ జాపకాల నేపథ్యంగా శ్యామ్ సింగరాయ్ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగించిన తర్వాత ఇటీవల నెట్‌ఫ్లిక్ష్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రస్తుతం ట్రెండ్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. అయితే సినిమా పరంగా కాకుండా గూగూల్‌లో చిత్రం ట్రెండ్ కావడానికి ప్రధాన కారణం ఏమిటంటే??

1969లో జరిగిన కథ నేపథ్యంగా
శ్యామ్ సింగరాయ్ సినిమాకు సంబంధించిన కథ విషయానికి వస్తే.. 1969లో బెంగాల్‌లో అభ్యుదయ భావాలు ఉన్న రచయిత జీవితంలో చోటుచేసుకొన్న కొన్ని సంఘటనల నేపథ్యంగా సాగుతుంది. ఈ సినిమా కథను సత్యదేవ్ జంగా అందించగా, టాక్సీవాలా ఫేమ్ దర్శకుడు రాహుల్ సంకిృత్యన్ పూర్తిస్థాయి వెండితెర కావ్యంగా మలిచారు.

మోడరన్, పిరియాడిక్ అంశాల మేలవింపుతో
సమకాలీన పరిస్థితులతోపాటు పిరియాడిక్ అంశాలతో నడిచే కథకు నాని, సాయిపల్లవి తమ పాత్రలతో జీవం పోశారు. తొలిసారి నాని యాంగ్రి మ్యాన్ లుక్‌తో ఆకట్టుకొన్నారు. దేవదాసి పాత్రలో సాయిపల్లవి మరోసారి వైవిధ్యమైన నటనను ప్రదర్శించారు. ఈ రెండు పాత్రలపై సినీ విమర్శకులు ప్రశంసల వర్షం కురిపించారు.

భాక్సాఫీస్ వద్ద భారీ లాభాలు
ఇక శ్యామ్ సింగరాయ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధించింది. ఏపీలో ప్రతికూల పరిస్థితులను ఎదురించి చక్కటి ఓపెనింగ్స్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల షేర్, 33.50 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేయగా, ఓవర్సీస్‌లో ఈ చిత్రం 3.75 కోట్లు రాబట్టింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 26.50 కోట్ల షేర్, 47 కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది. దీంతో ఈ చిత్రం 4 కోట్ల లాభాలను తన ఖాతాలో వేసుకొన్నది.

నెటిఫ్లిక్స్‌లో శ్యామ్ సింగరాయ్ సందడి
కోవిడ్ పరిస్థితుల కారణంగా థియేట్రికల్ రన్‌ను త్వరగా ముగించుకొన్న శ్యామ్ సింగరాయ్ చిత్రం నెటిఫ్లిక్స్ ద్వారా జనవరి 21వ తేదీన ఓటీటీలో రిలీజైంది. ఓటీటీలో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తున్నది. అయితే ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు గూగుల్‌లో రియల్ స్టోరీ అని వెతుకుతుండటంతో ట్రెండింగ్‌గా మారింది. ఇటీవల కాలంలో Shyam Singha Roy real story అని నెటిజన్లు సర్చ్ చేస్తుండటంతో ఈ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది.
Recommended Video

నిజంగా జరిగిన కథేనా అంటూ..
అయితే శ్యామ్ సింగరాయ్ సినిమా చూసిన తర్వాత ఇది నిజంగా జరిగిన కథనా? లేక కల్పితమా? ఈ సినిమాకు మూల కథ ఎక్కడి నుంచి పుట్టింది? శ్యామ్ సింగరాయ్ లాంటి మనిషి చరిత్రలో ఉన్నాడా? శ్యామ్ సింగరాయ్ కథ ఏమిటి? అంటూ నెటిజన్లు ఇంటర్నెట్‌లో విపరీతంగా శోధిస్తున్నారు. దాంతో ఇటీవల కాలంలో జరిగిన ఎక్కువ సర్చ్‌లో శ్యామ్ సింగరాయ్ ఒకటి కావడం ఆసక్తికరంగా మారింది.