»   » వైవియస్ చౌదరి చెత్త ఐడియాని ఫాలో చేస్తున్న పూరీ జగన్నాధ్

వైవియస్ చౌదరి చెత్త ఐడియాని ఫాలో చేస్తున్న పూరీ జగన్నాధ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

దర్శకుడు పూరీ జగన్నాధ్ టైం బాగోలోక వైవియస్ చౌదరి స్కీమ్ ని ఫాలో చేస్తున్నాడా..అని ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు. విషయం ఏమిటంటే...పూరీ దర్శకత్వంలో లీడర్ హీరో రాణా ఓ చిత్రం కమిటయిన సంగతి తెలిసిందే. సురేష్ ప్రొడక్షన్స్, నల్లమలుపు బుజ్జి కలిసి నిర్మించే ఈ చిత్రం కోసం ఇలియానాని పూరీ..పట్టు పట్టి ఒప్పించారు. తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన పోకిరి కాంబినేషన్ మళ్లీ ఆ రేంజ్ అవుతుందని ఆయన భావిస్తున్నారు. అయితే ఇలియానాని దేవదాసుతో పరిచయం చేసిన వైవియస్ చౌదరి..ఆ తర్వాత వరస ఫ్లాపుల్లో ఉండి సలీం చేసారు. అప్పుడు కూడా ఇలాగే అన్నీ ప్రక్కనపెట్టి కేవలం ఇలియానా గ్లామర్ నే నమ్మారు..ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద భయంకరంగా బోల్తా కొట్టింది.ఇప్పుడు అదే సిట్యువేషన్ లో ఉన్న పూరీ మళ్ళీ ఇలియానానే నమ్ముకోవటం అందరికీ ఆసక్తి కలిగిస్తోంది. ఇలీయానాని పెట్టుకోవటం సెంటిమెంట్ గా బాగానే ఉన్నా..ఇదొక్కటే నమ్ముకుంటే మాత్రం కష్టం అంటున్నారు. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 4న గ్రాండ్ గా ఓపినింగ్ జరగనుందని సమాచారం. అలాగే సెప్టెంబర్ 18 నుంచీ ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళనుందని తెలుస్తోంది. అలాగే వెంకటేష్..చింతకాయల రవి చిత్రానికి సంగీతం అందించిన బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్స్ విశాల్..శేఖర్ కూడా ఈ చిత్రానికి కమిటయ్యారు.

Please Wait while comments are loading...