యువ సామ్రాట్ నాగచైతన్య, అందాల తార అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న చిత్రం శైలజారెడ్డి అల్లుడు. టైటిల్‌కు తగినట్టుగానే రమ్యకృష్ణ మరోసారి పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటున్న ఈ చిత్రం ఆగస్టు 31న విడుదలయ్యేందుకు ముస్తాబవుతున్నది. ఇప్పటికే ఓ మోస్టారుగా ప్రచారం అందుకొన్నది. ఈ చిత్ర ప్రచార పోస్టర్లలో ఎక్కువగా రమ్యకృష్ణనే హైలెట్‌గా కనిపిస్తున్నది.
బాహుబలిలో శివగామి తర్వాత రమ్యకృష్ణకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇటీవల వచ్చిన హలో చిత్రంలో కూడా భారమైన పాత్రను పోషించింది. ఇలా సినిమా సినిమాకు కొత్త వేరియేషన్స్‌తో ముందుకొస్తున్న రమ్యకృష్ణ.. శైలజారెడ్డి చిత్రానికి అదనపు ఆకర్షణగా మారారు.
ఇక శైలజారెడ్డి అల్లుడు చిత్ర భారాన్ని కూడా రమ్యకృష్ణపైనే పడినట్టు కనిపిస్తున్నది. ఇప్పటికే ఆమె పోషించిన పాత్రపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒకవేళ రమ్యకృష్ణ రోల్ ప్రేక్షకులకు కనెక్ట్ అయితే ఈ సినిమా భారీ హిట్టు కొట్టడం తథ్యమనే మాట వినిపిస్తున్నది.
వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న అను ఇమ్మాన్యుయేల్‌కు మంచి పాత్ర లభించినట్టు తెలుస్తున్నది. గ్లామర్‌తోపాటు ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రను దక్కించుకొన్నట్టు సమాచారం.
శైలజారెడ్డి చిత్ర టీజర్‌కు ముహుర్తం పెట్టారు. ఈ టీజర్‌ను ఆగస్టు 1వ తేదీన సాయంత్రం 7 గంటలకు రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తున్నది. దర్శకుడు మారుతి ఈ చిత్రానికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
Yuva Samrat Naga Chaitanya’s Sailaja Reddy Alludu is all set for a grand release on 31st of this month. The First Look Teaser which will be released tomorrow. Sivagami Ramya Krishna is special attaction for this movie. Anu Emmanuel as the heroine. Maruthi is the director for the movie.
Story first published: Wednesday, August 1, 2018, 17:19 [IST]