Rashmi Gautam సీక్రెట్‌గా పెళ్లి చేసుకొన్న టాప్ యాంకర్.. ఆ వ్యక్తి ఎవరంటే?
తెలుగు బుల్లితెరపై అందం, అభినయంతో రష్మీ గౌతమ్ చేసే హంగామా మాటల్లో చెప్పడం కష్టమే. మాటలతో గారడీ చేస్తూ.. గ్లామర్‌తో ప్రేక్షకులను మెప్పిస్తూ గత దశాబ్దకాలంగా టెలివిజన్, సినీ రంగంలో దూసుకెళ్తున్నారు. యాంకర్, హెస్ట్, నటిగా పలు రకాల పాత్రలతో ఆకట్టుకొంటూ తన కెరీర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి రష్మీ గౌతమ్ గురించి మీడియాలో ఘాటైన రూమర్లు వస్తూ ఉంటాయి. అయితే వాటి గురించి పట్టించుకోకుండా తన పనేంటో చూసుకొంటూ వెళ్తుంటారు. అయితే ఈ సారి ఆమె పెళ్లి గురించి జాతీయ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ఏమిటంటే?

జబర్దస్త్, ఢీ షోలతో బిజీగా
రష్మీ గౌతమ్ బుల్లితెరపై పాపులర్ షోలు జబర్ధస్త్, ఢీ లాంటి వాటిని తన గ్లామర్, పెర్ఫార్మెన్స్‌తో ముందుకు తీసుకెళ్లున్నారు. ఇటీవల కాలంలో ఎక్స్‌ట్రా జబర్దస్త్, బెస్ట్ ఆఫ్ జబర్ధస్త్, ఢీ 10 షోలతో ఎంతో మంది అభిమానులను ఆకట్టుకొన్నారు. ఏ మాత్రం తరగని అందంతో ప్రేక్షకులను మైమరిపిస్తున్నారు. గత 15 ఏళ్లుగా పలు రకాల షోలతో మెప్పిస్తున్నారు.

సుడిగాలి సుధీర్‌తో అఫైర్ అంటూ
అయితే బుల్లితెర మీద రష్మీ గౌతమ్ గ్లామర్‌కు తోడుగా సుడిగాలి సుధీర్‌తో కెమిస్ట్రీ మరింత ఆమెను ఎలివేట్ చేసింది. టెలివిజన్ షోలకు సంబంధించిన రేటింగ్ కోసం ప్రత్యకంగా స్కిట్స్ రాస్తూ ప్రేక్షకుల్లో వినోదాన్ని పంచేస్తున్నారు. సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ మధ్య అఫైర్ వార్తలను వారిద్దరూ సున్నితంగా తిరస్కరించారు. ఇలాంటి పరిస్థితుల్లో రష్మీ గౌతమ్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకొన్నారనే వార్త వైరల్ అయింది.

రష్మీ గౌతమ్ స్రీకెట్ మ్యారేజ్
రష్మీ గౌతమ్ ఎవరికి చెప్పకుండా సీక్రెట్‌గా పెళ్లి చేసుకొన్నారు. ఆమె భర్త సినీ పరిశ్రమకు సంబంధం లేని వ్యక్తి అంటూ ఓ గాసిప్ జాతీయ మీడియాలో వైరల్ అయింది. కెరీర్‌కు అడ్డుగా నిలుస్తుందనే కారణంతో ఆమె తన పెళ్లి విషయాన్ని గోప్యంగా ఉంటారు అనే విషయాన్ని కథనంలో ప్రస్తావించారు. అయితే ఈ వార్తలన్నీ గాలి వార్తలే అని టెలివిజన్, సినీ వర్గాలు కొట్టిపడేశారు.

చిరంజీవితో ఐటెమ్ సాంగ్
ఇక రష్మీ గౌతమ్ గురించిన మరో వార్త క్రేజీగా మారింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ చిత్రంలో రష్మీ ప్రత్యేక పాటలో నర్తిస్తున్నారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫిని అందిస్తున్న పాటలో చిరంజీవితో కలిసి ఐటమ్ సాంగ్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగులో బీజీగా ఉన్నారు అని కథనాలు వస్తున్నాయి.
Recommended Video

రష్మీ గౌతమ్ సినిమా కెరీర్ ఇలా..
రష్మీ గౌతమ్ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. 2002లో హోలీ చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పటి వరకు 20 చిత్రాలకుపైగా నటించింది. ఆమె ఇటీవల 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో నటించింది. ప్రస్తుతం భోళ శంకర్‌లో మరోసారి ఐటమ్ సాంగ్‌లో మెరిసేందుకు ప్రయత్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications











