»   » ఎన్టీఆర్, వక్కంతం ల "ధడ్కన్" ఆగినట్టేనా..?? ఇద్దరి మధ్యా అంత గొడవేమిటి

ఎన్టీఆర్, వక్కంతం ల "ధడ్కన్" ఆగినట్టేనా..?? ఇద్దరి మధ్యా అంత గొడవేమిటి

Posted By:
Subscribe to Filmibeat Telugu

వక్కంతం వంశీ..ఎన్టీఆర్ క్యాంప్ లో వున్న రైటర్. జనతా గ్యారేజ్ తరువాత ఎన్టీఆర్ వక్కంతం వంశీ డైరక్షన్ లోనే సినిమాచేస్తారని నిన్న మొన్నటి వరకు వినిపించింది. కొంతమంది స్టార్లకు అభిమానులు ఉంటారు వారు ప్రేక్షకులు కారు సినిమా వాళ్లే అయితే అలాంటి అభిమానులను సంపాదించడంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముందుంటాడు. ఇక తనతో సినిమా చేయడానికి తాను పరిచయమున్న ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇదే తరహా లో జూనియతోనే నా తొలి ప్రయత్నం అంటూ ఓపిగ్గా వెయిట్ చేస్సడు వంశీ.

ఎన్ని భారీ ఆఫర్లు వచ్చినా మొదటి సినిమా జూనియర్ తోనే అంటూ పంతం పట్టి కూర్చున్నాడు. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఓ కథను వినిపించగా, ఆయన ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు పచ్చజెండా కూడా ఊపాడనీ. కానీ ఎన్టీఆర్ వరుసగా ఇతర కమిటైన సినిమాలతో బిజీగా ఉండడంతో తర్వాత చేద్దామనుకున్నారనీ వార్తలొచ్చాయి. మూడు రోజుల క్రితం కూడా ఈ ఇద్దరి సినిమా పేరు "ధడ్కన్" అని నిర్ణయించారనీ కూడా చెప్పుకున్నారు... అంతలో ఏమైందో గానీ ఇప్పుడు వక్కంతం జూనియర్ తూఅ చేసే సినిమా ఆగిపోయిందనీ ఆయన ఎంన్టీఆర్ క్యాంప్ నుంచి బయటకు వాచారనీ చెప్పుకుంటున్నారు. అసలు ఈ ఇద్దరి మధ్యా ఏం జరిగిందన్నది మాత్రం తెలియటం లేదు....

దడ్కన్:

దడ్కన్:

రెండు రోజుల క్రితం యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తర్వాత చేస్తున్న సినిమా టైటిల్ దడ్కన్ అని వక్కంతం వంశీ ఆ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి.

చెప్పేసాడు:

చెప్పేసాడు:

కానీ నిన్న ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ తరువాత సినిమా ఇంకా డిసైడ్ చేసుకోలేదని, కాస్త విశ్రాంతి తీసుకుంటానని, అంత త్వరగా సినిమాలు చేసేయాలన్న ఆతృత లేదని చెప్పేసాడు.

మళ్లీ హ్యాండ్ ఇచ్చేశాడట:

మళ్లీ హ్యాండ్ ఇచ్చేశాడట:

ఏమైందో ఏమో కాని ఎన్.టి.ఆర్ నుండి వక్కంతం దూరం వెళ్తున్నాడని టాక్. ఇద్దరి మధ్య ఏ విషయంలో సఖ్యత చెడిందో తెలియదు కాని ఇన్నాళ్లు ఎన్టీఆర్ తో సినిమా తీయాలని హోప్స్ పెట్టుకున్న వక్కంతం వంశీకి తారక్ మళ్లీ హ్యాండ్ ఇచ్చేశాడట.

ఫ్యాన్స్ ఉత్సాహం:

ఫ్యాన్స్ ఉత్సాహం:

జనతా రిలీజ్ టైంలో తారక్ నటిస్తున్న తర్వాత సినిమా టైటిల్ దడ్కన్ అని చెప్పగానే ఫ్యాన్స్ కు మరింత ఉత్సాహం కలిగింది.

జూనియర్ సీరియస్:

జూనియర్ సీరియస్:

అయితే తారక్ ప్రమేయం లేకుండానే ఆ టైటిల్ ఎనౌన్స్ చేశాడని వక్కంతం మీద జూనియర్ సీరియస్ అయ్యాడట. ఇక తన సినిమా ఆశలను కూడా వదులుకోవాలన్నట్టు సంకేతాలిచ్చాడట.

బయటకు వచ్చేశాడు:

బయటకు వచ్చేశాడు:

అందుకే వక్కంతం వంశీ తారక్ కాంపౌండ్ నుండ్ బయటకు వచ్చేశాడని హాట్ న్యూస్ నడుస్తుంది. ఎన్ని భారీ ఆఫర్లు వచ్చినా మొదటి సినిమా జూనియర్ తోనే అంటూ పంతం పట్టి కూర్చున్నాడు

మరో న్యూస్:

మరో న్యూస్:

ఇక మరో పక్క మాత్రం ఇన్నాళ్ల నుండి తన సినిమా కోసం ఎదురుచూస్తున్న వంశీని ఇంకా జూనియర్ వెయిట్ చేయించే ఆలోచనలో ఉన్నాడట అందుకే ఇక ఓపిక పట్టలేక వేరే హీరోతో సినిమా ప్రయత్నాలు చేసేందుకే వంశీ అవుట్ అయ్యాడని అంటున్నారు.

రెండేళ్ళు:

రెండేళ్ళు:

తారక్ చేసిన చాలా సినిమాలకు కథ అందించిన వక్కంతం వంశీ డైరక్టర్ గా మారేందుకు దాదాపు రెండేళ్ల నుండి వెయిట్ చేస్తున్నాడు.

ఇంకో న్యూస్ ఏమిటంటే:

ఇంకో న్యూస్ ఏమిటంటే:

వక్కంతం వంశీ తనంతట తానే ఎన్టీఆర్ క్యాంప్ వీడి బయటకు వచ్చేసినట్లు తెలుస్తోంది. మరి ఎందుకు అలా వచ్చేసాడు అన్నది తెలియదు కానీ, వచ్చేసిన మాట మాత్రం పక్కా అని తెలిసింది. సో, ఇక ఎన్టీఆర్ తరువాత సినిమా మరి ఎవరు డైరక్ట్ చేస్తారో చూడాలి.

English summary
Vakkantam Vamshi the script writer of Temper and who want to direct junior is now out from NTR's camp
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu