హాఫ్..హాఫ్..కలిపి ఫుల్ అంటారేంటీ..!? .... వెంకీ.. ఇదేంటి "గురూ"..??

బాబు బంగారంతో చాలా కాలం తర్వాత మాంచి జోష్ ఉన్న పాత్రతో వస్తాడనుకుంటే హిట్ కి దగ్గరిదాకా వచ్చి షర్ట్ కట్ లో పక్కకి వెళ్ళిపోయాడు విక్టరీ వెంకటేష్.. ఇలా లాభం లేదనుకున్నాడేమో ఈ సారి తనకు అచ్చొచ్చిన రీమేక్‌తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. హిందీలో సూపర్ హిట్ అయిన మాధవన్ "సాలా ఖడూస్" ని ఎంచుకున్నాడు. మాధవన్ తో సాలా ఖడూస్ ని డైరెక్ట్ చేసిన సుధ కొంగర ప్రసాద్ తెలుగు రీమేక్‌కు కూడా దర్శకత్వం వహించనుంది. బాక్సింగ్ కోచ్ గా నటించనున్న వెంకీ కోసం "గురు" అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. మామూలుగానే ఫిట్నెస్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వెంకీ ఈ బాక్సింగ్ కోచ్ కి సరిగ్గా సరిపోయాడు.

వెంకీ గురువుగా నటించే ఈ మూవీలో.. ఆయనకి శిష్యురాలిగా ఒరిజినల్ లోనే నటించిన రితికా సింగ్ నటించనుంది. హిందీలో నే కాదు ఈ అమ్మాయికి తెలుగులో కూడా ఇదే మొదటి సినిమా. ఈ ఒక్క పాత్రతో హిందీ.. తమిళ్ తో పాటు తెలుగులోనూ రితికా సింగ్ అరంగేట్రం చేసేస్తుండడం విశేషం అంతా బాగనే ఉంది గానీ ఇక్కడొక మెలిక వింతగా ఉంది. అదేమితంటే...

అఫీషియల్ గా సెప్టెంబర్ 19న గురు షూటింగ్ మొదలైపోయింది.. అంతలోనే ఈ సంవత్సరం డిసెంబర్ 23న రిలీజ్ అంటూ వార్తలు వినిపించటం తో అంతా ఖంగుతిన్నారు.. . కేవలం 90 రోజుల్లోనే ఓ స్టార్ హీరో సినిమాని రిలీజ్ కి ఎలా రెడీ చేస్తారన్నదే పాయింట్. ఎంత రీమేక్ అయినా అది మములు గ అనుకున్నంత ఈజీ అయిఒతే కాదు... అయితే ఇక్కడే ఉంది అసలు విషయం దీనికి ఓ సమాధానం కూడా వినిపిస్తోంది. వెంకీ హీరోగా రీమేక్ అవుతున్న ఈ సినిమాలో.. ముఖ్యమైన పాత్ర అయిన వెంకటేష్ మినహాయిస్తే.. మిగిలిన అందరూ ఒరిజినల్ లో నటించినవారే ఉంటారనే విషయం ఇప్పటికే అనౌన్స్ చేసేశారు. ఇందులోనే అసలు సీక్రెట్ ఉందట.

Is Venkatesh's New Movie is Guru Not Complete Remake!?

ఇప్పుడు ఏం చేయనున్నారూ అంటే వెంకటేష్.. వెంకీ-రితికా సింగ్ ల కాంబినేషన్ లో వచ్చే సీన్స్, వెంకీ కనిపించే సీన్స్ మాత్రం షూట్ చేసి. మిగిలినవన్నీ ఒరిజినల్ నుంచే కాపీ పేస్ట్ లాగా ఇక్కడ అతికిస్తారట. అంటే ఇద్దరే ఇద్దరు నటులతో దాదాపు షూటింగ్ మొత్తం పూర్తయిపోతుంది. ఇక మిగిలిన పార్ట్ ఎటూ రెడీగానే ఉంది ఇకనేం అందుకే మూడు నెలల్లోనే విడుదల చేసేయాలనే టార్గెట్ పెట్టేసుకున్నారట.

అంటే సగం మూవీని పిక్చరైజ్ చేసి.. పాత వెర్షన్ ను కూడా కలిపి మొత్తం పార్ట్ కు కొత్తగా డబ్బింగ్ చెప్పించేస్తే సరిపోతుంది. ఇలా హాఫ్ డబ్బింగ్.. హాఫ్ రీమేక్ చేసేస్తారట. "నేటివిటీ" అన్న ప్రాబ్లెం తప్ప ఇంకే లోపమూ కనిపించదు అనుకుంటున్నారట... కానీ అసలు మొట్ట మొదట దెబ్బ పడేదే నేటివిటీ విషయం లో మన వాతావరణం కనిపించనప్పుడు వెంకీ హిందీలో చేసిన సినిమాని తెలుగులో డబ్ చేసుకొని చూస్తున్నట్టే ఉంటుంది. చూద్దాం మరి ఈ హాఫ్..హాఫ్..ఫుల్ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుందో లేదో... లేక కేవలం వెంకీ భుజాల మీదే సక్సెస్ ని ఎత్తుతారో...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X