»   » మహేష్ బాబు మెగా డీల్ తో అటు ఫ్యాన్స్ ని ఇటు బాక్సాపీస్ నీ ఊపేస్తాడట..!

మహేష్ బాబు మెగా డీల్ తో అటు ఫ్యాన్స్ ని ఇటు బాక్సాపీస్ నీ ఊపేస్తాడట..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ 'త్రీ ఇడియట్స్" తెలుగులో రీమేక్ కానున్న సంగతి తెలిసిందే. మహేష్-శంకర్ ల కలయికలో రానున్న ఈ భారీ చిత్రం పై పలు కథనాలు ఇప్పటికే మీడియాలో వెల్లువెత్తాయి కానీ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. అయితే ఈ చిత్ర నిర్మాణం కోసం తెరవెనుక మాత్రం నిరవధికంగా చర్చలు జరుగుతూనే వున్నాయి. వన్ బై వన్ ఆశ్చర్యానికి గురిచేస్తూనే వున్నాయి. తాజా సమాచారం ప్రకారం తనదైన శైలికి భిన్నంగా ఈ చిత్రాన్ని మూడే మూడు నెలల్లో కంప్లీట్ చేసెయ్యాలని, 2011 సమ్మర్ లో సౌత్ ఇడియట్స్ రిలీజవ్వాలని అనుకుంటున్నారట శంకర్.

తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందనున్న ఈ భారీ ప్రాజెక్ట్ కోసం లొకేషన్స్ ఫైనలైజ్ చేసుకోవడం, షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోవడం ఆల్ రెడీ జరుగుతున్నాయి. ఇక మహేష్ తో శంకర్ కుదుర్చుకున్న మెగా డీల్ ఏమిటంటే, 'త్రీ ఇడియట్స్" కోసం ప్రిన్స్ జస్ట్ 45 షూటింగ్ లో పాల్గొంటే చాలని చెప్పారట. కేవలం నెలన్నరలో తన సినిమా పూర్తవ్వగలిగే అద్భుతాన్ని, ఆనందాన్ని ఒక్కసారైనా చవిచూసేందుకు మహేష్ కూడా చాలా ఉత్సాహపడుతున్నాడట. ఇదే నిజమై నిలిస్తే..ఈ ఆలోచన అమల్లోకొస్తే దసరాకి త్రివిక్రమ్ 'ఖలేజా"-సంక్రాంతికి శ్రీను వైట్ల సినిమా సమ్మర్ లో శంకర్ 'త్రీ ఇడియట్స్" చిత్రాలతో అటు ఫ్యాన్స్నీ ఇటు బాక్సాఫీస్ నీ ఊపేస్తాడు మహేష్...

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu