Just In
Don't Miss!
- News
Inside info:జగన్ -షా మీటింగ్‌లో ఏం జరిగింది.. మళ్లీ ఢిల్లీకి సీఎం: ఏపీలో కీలక పరిణామాలు
- Lifestyle
బాదం చట్నీతో బోలెడన్నీ లాభాలు... దీన్ని ఈ సమయంలోనే ఎక్కువగా తినాలట...!
- Sports
'ఇండియన్స్‌ను తక్కువ అంచనా వేయం.. ఈ గెలుపు మమ్మల్ని చాలా రోజులు బాధిస్తుంది'
- Automobiles
2030 నాటికి భారత్‌లో రోడ్డు ప్రమాదాలు సున్నా చేయడానికి కేంద్రం ముందడుగు
- Finance
అమెరికా ప్యాకేజీ ఎఫెక్ట్, సెన్సెక్స్ భారీగా జంప్: రిలయన్స్, ఐటీ స్టాక్స్ అదుర్స్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పెళ్లయితే ప్రేమ చచ్చిపోతుంది: రేణు దేశాయ్ హాట్ టాపిక్, తన జీవితమేనా?
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి దర్శకురాలు రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనుకుంటా. పవన్ కళ్యాణ్ తో సహజీవనం, ఓ బాబుకు జన్మనిచ్చాక అఫీషియల్ గా పెళ్లాడటం అందరికీ తెలిసిందే. పెళ్లికి ముందు చాలా ఏళ్ల పాటు అన్యోన్యంగా జీవించిన ఈ జంట పెళ్లయిన కొంత కాలానికే విడిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
వీరు విడిపోవడానికి కారణాలు ఏమిటి అనేదానికి సరైనా కారణాలు కూడా ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. అయితే వీరు విడిపోయినా ఎలాంటి విబేధాలు లేకుండా స్నేహితుల్లా కలిసి ఉండటం విశేషం. పవన్ కళ్యాణ్ ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్య పూణెలో తన తల్లి వద్ద పెరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ తరచూ పూణె వెళ్లి వారితో గడిపి వస్తుంటారు.
నటిగా తెరంగ్రేటం చేసిన రేణు దేశాయ్.... పవన్ కళ్యాణ్ తో పరిచయం తర్వాత సినమాలకు దూరమైంది. ఇన్నాళ్లు ఆమె సినిమా రంగానికి దూరంగానే ఉన్నారు. విడాకుల తర్వాత మళ్లీ ఆమె తన కెరీర్ మీద దృష్టి సారించారు. అయితే నటిగా కాకుండా... నిర్మాతగా, దర్శకురాలిగా తన ప్రస్తానం మొదలు పెట్టారు.
రేణు దేశాయ్ దర్శకత్వంలో ఆ మధ్య 'ఇష్క్ వాలా లవ్' అనే మరాఠి చిత్రం వచ్చింది. పలు కారణాలతో తెలుగులో థియేటర్ రిలీజ్ కు నోచుకోని ఈ చిత్రం సెప్టెంబర్ 4న టీవీలో రిలీజవుతోంది. తాజాగా ట్రైలర్ కూడా రిలీజైంది.
అయితే ట్రైలర్లో హీరోయిన్ చెప్పే కొన్ని డైగులు రేణు దేశాయ్ నిజ జీవితాన్ని అద్దంపట్టేలా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సినిమాకు తానే కథ, స్క్రీన్ ప్లే సమకూర్చిన రేణు దేశాయ్..... తన జీవిత అనుభవాలను ఇందులో జోడించారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ సినిమాలో రేణు దేశాయ్ ఏం చెప్పంది? ట్రైలర్లో ఏముంది? అనే ఆసక్తికర విషయాలు స్లైడ్ షోలో...

ఇష్క్ వాలా లవ్
'ఇష్క్ వాలా లవ్' బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీతో కూడిన డ్రామా. ఆదినాథ్ కొఠారి, సులగ్నా పానిగ్రాహి లీడ్ రోల్స్ చేసారు.

ప్రేమను కాపాడుకోవడానికి పెళ్లి అవసరం లేదు
ట్రైలర్లో...ప్రేమను కాపాడుకోవడానికి పెళ్లి అవసరం లేదు అనే డైలాగ్..... రేణు దేశాయ్ తన జీవితం నుండి అన్వయించిందే అని అంటున్నారు.

పవన్ తో సహజీవనం
పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడిన రేణు దేశాయ్ అతనితో పెళ్లికి ముందే సహజీవనం చేసారు. ఈ సహజీవనంలో అకీరా జన్మించాడు.

ఒత్తిడితో పెళ్లి
చిరంజీవి రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న వేళ వీరి పెళ్లిపై ఒత్తిడి పెరిగింది. అందుకే సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు.

పెళ్లయితే ప్రేమ చచ్చిపోతుంది...
పెళ్లయితే ప్రేమ చచ్చిపోతుంది అనే మరో డైలాగ్ కూడా ట్రైలర్లో ఉంది. రేణు దేశాయ్ జీవితం కూడా ఇలానే ఉంది. పెళ్లయిన తర్వాత ప్రేమ చచ్చిపోయింది. పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ విడిపోయిన సంగతి తెలిసిందే.

రేణు దేశాయ్
మహారాష్ట్రలోని పూణెలో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబంలో డిసెంబర్ 4, 1981లో దేశాయ్ జన్మించింది.

కెరీర్
మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన రేణు దేశాయ్ 2000 సంవత్సరంలో పార్థిబన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన ‘జేమ్స్ పాండు' చిత్రం ద్వారా సినిమా రంగ ప్రవేశం చేసింది.

అలా పవన్ తో పరిచయం
అదే సంవత్సరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘బద్రి' చిత్రంలో పవన్ సరసన నటించింది రేణు దేశాయ్.

లవ్
‘బద్రి' సినిమా సమయంలోనే పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, అదే వారి మధ్య ప్రేమకు బీజం పడింది. అలా పవన్ కళ్యాణ్ జీవితంలో రేణు దేశాయ్ ప్రవేశించింది.

పవన్ కోసం త్యాగం
పవన్ కళ్యాణ్‌తో ప్రేమలో పడ్డాక రేణు దేశాయ్ తన సినిమా కెరీర్‌ను ఆయన కోసం త్యాగం చేసింది. బద్రి తర్వాత ఆమె ఇతర హీరోల సినిమాల్లో నటించలేదు. మళ్లీ 2003లో పవన్ కళ్యాణ్‌తో ‘జానీ' చిత్రంలో నటించింది.

సెన్సేషన్
పవన్ కళ్యాణ్‌తో రేణు దేశాయ్ సహజీవనం తెలుగు సినిమా పరిశ్రమలో ఓ సెన్సేషన్. వీరు పెళ్లి చేసుకోకుండానే 2004లో అకీరాకు జన్మనిచ్చారు.

వివాహం
పెళ్లి చేసుకోకుండానే ఎంతో సంతోషంగా జీవనం సాగిస్తున్న పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ 2009లో పెళ్లాడారు. చిరంజీవి రాజకీయాల్లో ప్రవేశించడంతో పవన్-రేణు సంబంధంపై విమర్శలు వచ్చాయి. దీంతో సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు.

కాస్టూమ్ డిజైనర్ గా
నటిగా కెరీర్‌కు ముగింపు చెప్పిన తర్వాత ఆమె పవన్ నటించిన ఖుషి, జానీ, గుడుంబా శంకర్, బాలు, అన్నవరం చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసారు.

దాంపత్యానికి గుర్తు
పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ దాంపత్య జీవితానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు పెట్టారు. కొడుకు అకీరా నందన్, కూతురు ఆద్యా

రూమర్స్
పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ బంధంపై తరచూ మీడియాలో రకరకాల రూమర్లు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. కానీ అవన్నీ ఆధారం లేని వార్తలే అని అనేక సందర్భాల్లో తేటతెల్లం అయ్యాయి. తన పర్సనల్ విషయాల గురించి మీకెందుకు అని ఓ సినిమాలో పవన్ కళ్యాన్ మీడియాకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.

నిర్మాతగా, దర్శకురాలిగా
రేణు దేశాయ్ నిర్మాతగా మారి ‘మంగలాష్ తక్ వన్స్ మోర్' అనే మరాఠీ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. తర్వాత ‘ఇష్క్ వాలా లవ్' అనే చిత్రానకి దర్శకత్వం వహించారు.

పవన్ వల్లనే
గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ వైఫ్ నుంచి ఇండి పెడెంట్ నిర్మాతగా ఎలా మారారు? అనే ప్రశ్నకు రేణు దేశాయ్ స్పందిస్తూ.....‘ఈ మార్పు అనేది చాలా స్మూత్‌గా జరిగింది. పవన్ కళ్యాణ్ వల్ల సినిమా ఇండస్ట్రీలో చాలా విషయాలు నేర్చుకున్నాను. స్క్రిప్టు, స్టోరీ, మ్యూజిక్ సిట్టింగ్స్‌తో ఫిల్మ్ మేకింగ్‌కు సంబంధించిన అన్ని విషయాల్లో ఇన్ వాల్వ్ అయ్యాను. ఇందుకు పవన్‌కు థాంక్స్ చెప్పాలి' అని చెప్పుకొచ్చారు.

ఆయన సహాయం లేకుండా
నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్నాక ఆయన(మాజీ భర్త పవన్) హెల్ప్ లేకుండానే ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాను. అడిగితే ఆయన అన్ని విధాలా అండగా ఉంటారు. కానీ నేను దీన్ని చాలెంజ్ గా తీసుకున్నాను. ఈ దారిలో ఒంటరిగా ప్రయాణించాలని డిసైడ్ అయ్యాను. స్క్రిప్టు ఎంచుకోవడం, ఆర్టిస్టులను కలవడం, మ్యూజిక్ డైరెక్టర్లను కలవడం, ఇలా అన్ని విషయాలు సొంతగా చూసుకుంటున్నాను. నా భార్య మిమ్మల్ని కలవడానికి వస్తుంది...అని పవన్ నన్ను రికమండ్ చేయడు' అని వెల్లడించారు.

పురుషాదిక్యం ప్రపంచంలో
సినిమా ఇండస్ట్రీ అంటేనే పురుషాధిక్య ప్రపంచం. ఇలాంటి పరిశ్రమలో మీకేమైనా చాలెంజ్ ఎదురైందా? అనే ప్రశ్నకు రేణుదేశాయ్ స్పందిస్తూ...‘సినిమా అంటేనే వ్యాపారం. ఏ రంగంలో అయినా పోటీ సహజమే. కొన్ని సవాళ్లను ఎదుర్కనాల్సి వస్తుంది. నేను పవన్ కళ్యాణ్ మాజీ వైఫ్‌ను కాబట్టి నాతో సినిమాలు చేయడానికి అంతా ముందుకు వస్తారని అనుకోవడం లేదు. పెద్ద పెద్ద యాక్టర్లు నా వ్యూ పాయింట్ ను అర్థం చేసుకుంటున్నారు. నేను సరైన దారిలోనే వెలుతున్నానని అనుకుంటున్నాను' అని వెల్లడించారు.

పిల్లలు
పిల్లల పెంపకంలో రాజీపడను తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తూ...నిర్మాతగా, దర్శకురాలిగా కెరీర్‌ను ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అనే ప్రశ్నకు రేణుదేశాయ్ స్పందిస్తూ ‘కెరీర్‌తో పిల్లల కోసం కూడా సమయం కేటాయించడం నా బాధ్యత. రోజులో కనీసం ఒకసారైనా వారితో కలిసి భోజనం చేస్తాను. తల్లిగా నా బాధ్యతలు నిర్వహించడంలో రాజీపడే ప్రసక్తే లేదు' అని వెల్లడించారు.

యమున ఇంటర్వ్యూ పూర్తి విశేషాలు: వ్యభిచారం కేసు, ఫ్యామిలీ, చిరు, పవన్, ఇంకా చాలా...
యమున ఆర్టికల్ కోసం క్లిక్ చేయండి