»   » ఇండస్ట్రీ హాట్ టాపిక్: హీరో నందు..డైరక్షన్,గర్ల్ ఫ్రెండ్ సూసైడ్..ఇంకా (వీడియో)

ఇండస్ట్రీ హాట్ టాపిక్: హీరో నందు..డైరక్షన్,గర్ల్ ఫ్రెండ్ సూసైడ్..ఇంకా (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రీసెంట్ గా విడుదలైన పెళ్లి చూపులు చిత్రంలో విక్రమ్ పాత్ర ద్వారా ప్రశంసలు అందుకుంటున్న హీరో నందు మరోసారి ఓ సర్ఫైజ్ తో ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచాడు. తన దర్సకత్వంలో నటుడుగా నటిస్తూ చేసిన షార్ట్ ఫిలిం అందరూ మెచ్చుకుంటున్నారు. రిలీజైన కొద్ది సేపటిలోనే అందరి ప్రశంసలతో పాటు వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ షార్ట్ పిలిం చూస్తే మీరూ మెచ్చుకోకుండా ఉండలేరు. ఇప్పటికే మంచు లక్ష్మి, గోపీ మోహన్, బెనర్జీ, సందీప్ కిషన్ ..ఇలా చాలా మంది ఈ షార్ట్ ఫిలిం ని మెచ్చుకున్నారు.

జోక్ టైటిల్ తో రూపొందిన ఈ షార్ట్ ఫిలిం ఓ రొమాంటిక్ ధ్రిల్లర్. ఈ షార్ట్ ఫిలిం చూస్తే ఖచ్చితంగా నందులో మంచి దర్శకుడు ఉన్నాడని అర్దమవుతుంది. అంతేకాదు మంచి రచయిత కూడా ఉన్నాడు. ఈ షార్ట్ పిలిం కు రచన నందునే. మంచి ఆఫర్ వస్తే దర్శకుడుగా కూడా ప్రూవ్ చేసుకుంటాడని మనకీ షార్ట్ ఫిలిం నిదర్శనంగా కనిపిస్తుంది.

ఈ షార్ట్ ఫిలిం ఓ నటుడు కథని తెలుపుతుంది. అంతేకాదు సరదాగా మీడియాలో ప్రసారమయ్యే గాసిప్స్ ఒక్కోసారి కొందరి జీవితాల్లో ఎలా చిచ్చు పెడతాయో తెలియచేస్తుంది. వీటితోపాటు షార్ట్ టెంపర్ లో నోరు జారితో ఉండే ప్రమాదం,దాని పరిణామాలు తెలియచేస్తాయి. డార్క్ మూడ్ లో సాగినా ఎక్కడా పట్టుసడలని స్క్రీన్ ప్లే, షాట్ మేకింగ్ మనల్ని అబ్బురపరుస్తాయి. దర్శకుడుగా నందు తొలి ప్రయత్నం అంటే నమ్మబుద్ది కాదు.

ఇక దర్శకుడుగా నందు టాలెంట్ ని మొదట నమ్మిన హర్ష బసవ (కొత్త బంగారు లోకం)ని ఈ విషయంలో మెచ్చుకోవాలి. ఎందుకంటే దాదాపు 75,000 రూపాయలుని తమ మిత్రుల చేత పెట్టుబడి పెట్టేలా చేసాడు. అలాగే అజయ్ ఘోష్ వంటి సీనియర్ ఆర్టిస్ట్(ఇందులో పోలీస్ పాత్ర ధారి) సైతం ఎంత బిజీగా ఉన్నా రూపాయతీసుకోకుండా కేవలం నందు మీద ఉన్న నమ్మకంతో ఈ షార్ట్ పిలిం చేసారు. అలాగే కెమెరామెన్ ఛోటోకే.ప్రసాద్ కూడా. ఈ టీమ్ కు మంచి భవిష్యత్ ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఈ షార్ట్ ఫిలిం చూసిన ప్రముఖ దర్శక,నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ...తనకు దర్శకుడుగా నందు నచ్చాడని, ఓ సినిమా చేసిపెట్టమని అడిగినట్లు తెలుస్తోంది. చూస్తూంటే తెలుగులో ఓ మంచి దర్శకుడు రాబోతున్నాడని సూచనలా లేదు. మీ కామెంట్స్ క్రింద కామెంట్ భాక్స్ లో చేయండి.

English summary
Actor Nandu on sprung a surprise by releasing a short film ‘Joke’ which he directed (besides featuring in it). The short, besides being applauded for its content, performances and direction.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu