»   » 'నెపోలియిన్' ఫస్ట్ లుక్ అఫీషియల్ : చిరు మాత్రం కాదు

'నెపోలియిన్' ఫస్ట్ లుక్ అఫీషియల్ : చిరు మాత్రం కాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి హీరోగా రూపొందుతున్న 150 వ చిత్రానికి నెపోలియన్ అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ టైటిల్ తో ఓ పోస్టర్ హలచల్ చేసింది. ఈ పోస్టర్ ని అభిమానులు చాలా మంది షేర్ చేసారు. అయితే ఇప్పుడు మరో నెపోలియన్ రంగంలోకి దిగాడు. అయితే అది చిరంజీవి మాత్రం కాదు.

ప్రతినిధి చిత్రానికి కథ,మాటలు అందించిన ఆనంద రవి దర్శకత్వంలో రూపొందబోయే చిత్రానికి నెపోలియన్ అనే టైటిల్ పెట్టి ఫస్ట్ లుక్ విడుదల చేసారు. భోగేంద్ర గుప్త నిర్మిస్తున్న ఈ చిత్రానికి సిద్దార్ద సదాశివుని సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రం టైటిల్ కు ది మ్యాన్ హూ లాస్ట్ హిజ్ షాడో అనే కాష్షన్ పెట్టి వదిలారు.

It's not Chiru: First Look of Nepolean

అంటే దీన్ని బట్టి అర్దం అవుతోంది ఏమిటీ అంటే నెపోలియన్ టైటిల్ వీరివద్ద ఉందన్నమాట. చిరంజీవి చిత్రానికి ఈ టైటిల్ తో ఫస్ట్ లుక్ ప్రచారం మొదలు కాగానే వీరు ఎలర్టై తమ చిత్రం ఫస్ట్ లుక్ వదిలారు.

నిజానికి గతంలో ఇదే టైటిల్ తో సునీల్ తో చిత్రం చేద్దామని కొన్ని ప్రయత్నాలు జరిగాయి. రాజమౌళి శిష్యుడు ఒకరు సునీల్ తో తను అనుకున్న సబ్జెక్టు కోసం నెపోలియన్ టైటిల్ తో స్క్రిప్టు రెడీ చేసుకుని తిరిగేవారు. బడ్జెట్ ఎక్కవ అవటంతో ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు. ఇదిగో ఇప్పుడు ఇలా మరోసారి ఈ టైటిల్ చర్చనీయాంసమైంది.

English summary
The first look of Nepolean starring a new comer Ravi was released. The film is directed by Anand Ravi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu