»   » మహేష్ నెక్ట్స్ సినిమా ప్రకటన, ఇది మీరు ఊహించనది

మహేష్ నెక్ట్స్ సినిమా ప్రకటన, ఇది మీరు ఊహించనది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్‌బాబు ఏ కొత్త చిత్రం కమిటవ్వుతున్నాడు అనే విషయంపై ఎప్పుడూ మీడియాలోనూ,అభిమానుల్లోనూ చర్చ జరుగుతూంటుంది. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న ఆయన తదుపరి చిత్రం ఏం చేయబోతున్నారనే విషయమై గత కొంత కాలంగా జరుగుతున్న స్పెక్యులేషన్స్ కు తెరపడింది.

మహేష్ బాబు నటించబోయే సినిమా పూరిజగన్నాథ్ డైరెక్షన్ లోనా? లేక..? కొరటాల శివ డైరెక్షన్ లోనా అనే సందేహాల్లో ఉండగానే, తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.

మహేష్ తన పుట్టిన రోజు సందర్భంగా కొత్త చిత్రాన్ని అంగీకరించారు. ఇటీవల నాగార్జున, కార్తి కలిసి నటించిన ఊపిరి సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమాకు ఓకే చెప్పారు. పి.వి.పి సినిమా పతాకంపై పరల్ వి. పొట్లూరి సమర్పణలో పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నె ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

ఊపిరి చిత్రాన్ని వంశీ పైడిపల్లి తెరకెక్కించిన తీరు మహేష్‌ను ఆకట్టుకోవడంతో ఆయనతో సినిమా చేయడానికి ముందుకొచ్చారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మురుగదాస్‌తో చేస్తున్న సినిమా తరువాత వంశీపైడిపల్లి చిత్రం సెట్స్‌పైకి రానున్నట్లు సమాచారం.

అమెరికా నేపథ్యంలో చిత్ర కథ ఉండగా, షూటింగ్ దాదాపు అమెరికాలోనే జరగనున్నట్టు సమాచారం. నేడు మహేష్ పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పి.వి.పి సినిమా వర్గాలు తాజా చిత్రాన్ని పోస్టర్ ద్వారా ప్రకటించాయి.

ప్రస్తుతం మురగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నట్లు టాక్. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కాగా, ఈ సినిమా తర్వాత ఈ కొత్త చిత్రం తెరకెక్కుతుంది.

English summary
Superstar Mahesh Babu is celebrating his birthday today (August 9th). On this occasion, PVP Cinema today officially announced a movie with Mahesh Babu in the direction of Vamshi Paidipally. year.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X