twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒకే రోజు తేడాలో పవన్ కళ్యాణ్, నాగార్జున

    By Srikanya
    |

    హైదరాబాద్: వచ్చే నెలలో నాగార్జున, పవన్ కళ్యాణ్ భాక్సాఫీస్ వద్ద తలపడనున్నారు. ఇద్దరి సినిమాలూ దసరాకే విడుదల చేసి అభిమానులుకు ఆనందం పంచటానికి సిద్దమవుతున్నారు. నాగార్జున తొలి సోషియో ఫాంటసీ ఢమరుకం చిత్రం అక్టోబర్ 12న విడుదల అవుతూంటే, పవన్ కళ్యాణ్ క్రేజీ చిత్రం కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం అక్టోబర్ 11 న విడుదల అవుతున్నాయి. అయితే ధియోటర్స్ సమస్యను ఎలా ఈ రెండు సినిమాలు సాల్వ్ చేసుకుని, పోటీ పడతాయో చూడాలి అంటున్నారు.

    ఆర్‌.ఆర్‌.మూవీ మేకర్స్‌ సంస్థ ఢమురకం చిత్రాన్ని నిర్మిస్తోంది. అనుష్క హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాసరెడ్డి దర్శకుడు. వెంకట్‌ నిర్మాత. ఢమురుకం చిత్రంలో నాగార్జున ఆటో డ్రైవర్ గా చేస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ శివుడుగా కనిపించనున్నారు. ఇక అనూష్క దైవ శక్తులున్న పార్వతి అంశతో పుట్టిన అమ్మాయిగా మైతిలాజికల్ పాత్రలో కనిపిస్తోంది. రక్త చరిత్రలో చేసిన అభిమన్యు సింగ్ ఇందులో విలన్ గా కనిపించనున్నారు. అలాగే ఈ చిత్రంలో దాదాపు గంటసేపు గ్రాఫిక్స్ ఉంటాయని,తెలుగు తెరపై ఇప్పటివరకూ చూడని విధంగా వాటిని డిజైన్ చేసారని చెప్తున్నారు. ఫస్టాఫ్ మొత్తం కామిడీగా సాగినా,ఇంటర్వెల్ అదిరిపోతుందని చెప్తున్నారు.

    ఢమురకం చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ... ''గతంలో నేను రూపొందించిన యమగోల మళ్ళీ మొదలైంది చిత్రంలో యముడు భూమి మీదకు వస్తాడు. ఇక్కడ శివుడు భూమి మీదకు క్రిందకి దిగి వస్తాడు. అప్పుడు నాగార్జునకీ, హీరోయిన్ కీ, శివుడు కీ మధ్య జరిగే కథనం ఆసక్తి గా ఉంటుంది అన్నారు. ఇక నాగార్జున పక్కా మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇవివి హలో బ్రదర్ తరహాలో కామిడీ టచ్ తో సాగుతుంది అన్నారు. నాగార్జున పాత్ర విభిన్నమైన రీతిలో ఉంటుంది. ఆయన తొలిసారి సోషియో ఫాంటసీ తరహా చిత్రంలో నటిస్తున్నారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేలా గ్రాఫిక్స్‌ ఉంటాయి. సాంకేతికంగా ఉన్నత స్థాయిలో తెరకెక్కిస్తున్నాము'' అన్నారు.

    పవన్‌ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రం చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. గబ్బర్ సింగ్ ఘన విజయంతో ఈ చిత్రం బిజినెస్ మంచి క్రేజ్ తో జరిగింది. పవన్ కళ్యాణ్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం మీడియాపై పూర్తి స్ధాయి సెటైర్ గా ఉండబోతోందని చెప్తున్నారు. నాలుగు నెలల్లో ఈ చిత్రం షూటింగ్ ని పూర్తి చేయాలని పూరీ జగన్నాధ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నటిస్తున్నందుకు గర్వపడుతున్నానని పవన్‌ కామెంట్‌ చేసినట్టు చెబుతున్నారు.

    English summary
    Nagarjuna's ambitious socio fantasy flick, Damarukam have announced that they will be releasing the film on October 12 - a day after the Pawan Kalyan's much anticipated upcoming flick, Cameraman Ganga tho Rambabu (CGTR) scheduled to release on October 11.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X