»   » సల్మాన్ వర్జినే కానీ ఆమె కాదే! ప్రియురాలు గురించి షాకింగ్ విషయాలు!

సల్మాన్ వర్జినే కానీ ఆమె కాదే! ప్రియురాలు గురించి షాకింగ్ విషయాలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: 50 ప్లస్ మరియు స్టిల్ వర్జిన్ అయిన బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్... త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కొంత కాలంగా సల్మాన్ తో విదేశీ భామ లూలియా వేంటర్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండటంతో ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారనే వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అయితే ఈ వార్తలకు, పుకార్లకు తెర దింపుతు లూలియా వేంటర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. సల్మాన్ ఖాన్ కు, తనకు మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని, తమ మధ్య స్నేహం మాత్రమే ఉందని, ప్రేమ దోమ లేదని తేల్చి చెప్పింది. అతనితో డేటింగ్ చేయడం లేదంటూ కుండబద్దలు కొట్టింది.

అయితే లులియా మాటలను ఎవరూ నమ్మడం లేదు. కేవలం మీడియాను బోల్తా కొట్టించడానికే ఆమె ఇలాంటి ప్రకటన చేసిందని అంటున్నారు. కేవలం ఫ్రెండ్ అయితే దేశం కాని దేశం వచ్చి సల్మాన్ ఖాన్ తో తిరగాల్సిన అవసరం ఏమిటి? సొంత ఫ్యామిలీని వదిలి సల్మాన్ ఖాన్ ఫ్యామిలీతో నెలల తరబడి గడపటం లాంటివి కళ్లముందు కనిపిస్తుంటే మీ మధ్య ఎలాంటి సంబంధం లేదంటే ఎవరు నమ్ముతారు? అంటూ ప్రశ్నిస్తున్నారు.

కాగా... లూలియా వేంటర్ గురించి, ఆమె జీవితం గురించి ఆరా తీస్తే కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందుకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో...

లూలియా వేంటర్

లూలియా వేంటర్

రొమేనియాకు చెందిన లూలియా వేంటర్. 1980లో జన్మించింది. వయసు 35. సల్మాన్ కంటే 15 ఏళ్లు చిన్నది.

కెరీర్

కెరీర్

చదువుకు పూర్తయిన తర్వాత మోడల్ గా, టీవీ ప్రజెంటర్ గా కెరీర్ మొదలు పెట్టింది.

పాపులర్

పాపులర్

రొమేనియర్ టీవీ షోల ద్వారా ఆమె బాగా పాపులర్ అయింది.

ఆమెకు ఆల్రెడీ పెళ్లయింది

ఆమెకు ఆల్రెడీ పెళ్లయింది

లూలియాకు రొమేనియర్ ఫిల్మ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజీషియన్ మారిస్ మోగాతో ఇప్పటికే ఓసారి వివాహం అయింది.

విడిపోయారు

విడిపోయారు

మారిస్ మోగాతో లూలియా వేంటర్ 2009లొనే విడిపోయింది. తర్వాత సల్మాన్ ఖాన్ తో ప్రేమలో పడింది.

ఫస్ట్ మీటింగ్

ఫస్ట్ మీటింగ్

సల్మాన్ సోదరుడు సొహైల్ ఖాన్ మూవీ ‘జై హో' సమయంలో సల్మాన్, లులియా మధ్య పరిచయం ఏర్పడింది.

ఐటం నంబర్

ఐటం నంబర్

బాలీవుడ్ లో ఓ తేరీ అనే చిత్రంలో లూలియా వేంటర్ ఐటం సాంగ్ చేసింది. పులకిత్ సామ్రాట్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఫెయిలైంది.

సల్మాన్-లులియా

సల్మాన్-లులియా

ఈ క్రమంలో సల్మాన్ తో లూలియా చాలా క్లోజ్ అయింది. సల్మాన్ షూటింగుల సమయంలో అతన్నే అంటిపెట్టుకుని ఉంటోంది. దీంతో ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు గుప్పుమన్నాయి.

సల్మాన్ ఫ్యామిలీకి కూడా

సల్మాన్ ఫ్యామిలీకి కూడా

సల్మాన్ ఖాన్ ఫ్యామిలీకి కూడా లులియా చాలా క్లోజ్ అయింది. సల్మాన్ తల్లి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆమె కనిపించడమే ఇందుకు నిదర్శనం.

ఎవరు నమ్ముతారు?

ఎవరు నమ్ముతారు?

మీడియాలో తమ గురించి తీవ్రంగా ప్రచారం జరుగుతుండటంతో .... లులియా స్పందించింది. సల్మాన్ తో స్నేహమే తప్ప మరెలాంటి ఎఫైర్ లేదంటోంది. ఇంత తతంగం జరిగాక లూలియా ఇలా మాట్లాడుతుండటంతో ఆమె మాటలు ఎవరూ నమ్మడం లేదు.

English summary
An interview by Salman Khan's rumoured girlfriend Iulia Vantur came as a shocker recently where she said that she is only friends with Salman and there is no love between them. When her ''just friends'' comment went viral on the internet, Iulia took to Instagram and wrote, "When the press doesn't have new subjects they take very old interviews, just to have titles. Copy- paste era." So, the Romanian beauty has finally revealed that she is in no mood to friendzone Salman. Iulia is currently accompanying Salman on the shooting of Kabir Khan's Tubelight in Leh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu