»   » లేటెస్ట్ లవర్‌తో సల్మాన్ ఫైట్.. వదిలేసి వెళ్లిన వాంటర్.. అసలేం జరిగిందటే..

లేటెస్ట్ లవర్‌తో సల్మాన్ ఫైట్.. వదిలేసి వెళ్లిన వాంటర్.. అసలేం జరిగిందటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు ప్రియురాళ్లతో గొడవపడటం కొత్తేమీ కాదు. గతంలో ఐశ్వర్యరాయ్, కత్రినా కైఫ్‌తో తీవ్రస్థాయిలో గొడవపడినట్టు మీడియాలో వార్తలు జోరుగా ప్రచారమైన సంగతి తెలిసిందే. తన తాజా ప్రియురాలు రుమేనియాకు చెందిన ఇలియా వాంటర్‌తో సల్లూభాయ్ గొడవపడినట్టు సమాచారం. వారిద్దరి మధ్య జరిగిన గొడవ కారణంగానే సల్మాన్ నిర్వహిస్తున్న దబాంగ్ టూర్‌కు దూరంగా ఉన్నట్టు కథనాలు ప్రచురితమయ్యాయి.

దంబాంగ్ టూర్‌లో..

దంబాంగ్ టూర్‌లో..

సల్మాన్, వాంటర్ మధ్య అఫైర్ జోరుగా సాగుతున్నదని ప్రచారం జరుగుతున్నది. మాల్దీవుల్లో నిర్వహించిన తన మేనల్లుడి పుట్టిన రోజు వేడుకలకు కూడా వాంటర్ హాజరైంది. సల్మాన్‌తో సన్నిహితంగా ఉన్న చిత్రాలు మీడియాలో కనిపించాయి. వాంటర్ ఇప్పటికే గాయనిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె దంబాగ్ టూర్‌లో భాగం కావాలనుకొన్నది. అయితే అందుకు సల్మాన్ అభ్యంతరం చెప్పడంతో వారి మధ్య గొడవ జరిగినట్టు సమాచారం.

సోనాక్షి, బిపాసతో సల్మాన్ టూర్..

సోనాక్షి, బిపాసతో సల్మాన్ టూర్..

దంబాంగ్ టూర్‌లో భాగంగా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ బాలీవుడ్ తారలు సోనాక్షి సిన్హా, బిపాస బసు తదితరులతో కలిసి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్నాడు. ఈ కార్యక్రమంలో తన సోదరుడు సోహైల్ ఖాన్, చెల్లెలు అర్పితాఖాన్ కూడా భాగమయ్యారు.

బాలీవుడ్ తెరపై వాంటర్..

బాలీవుడ్ తెరపై వాంటర్..

ఇదిలా ఉండగా, వాంటర్‌ను సల్మాన్ బాలీవుడ్ తెరకు పరిచయం చేస్తారని అప్పట్లో ఊహాగానాలు జోరందుకున్నాయి. కానీ యాక్టింగ్ కాకుండా ఆమె గాయనిగా బాలీవుడ్‌కు పరిచయం కావడం పరిశ్రమ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేశాయి. గతంలో సోనాక్షి సిన్హా, కత్రినా కైఫ్, డైసీ షా, సూరజ్ పంచోలి తదితరులను సల్మాన్ పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ ‌లో బిగ్ స్క్రీన్‌పై కనపడేందుకు వాంటర్ తహతహలాడుతున్నట్టు ఓ వార్త ప్రచారంలో ఉన్నది.

ఆఫర్లు వస్తున్నాయి..

ఆఫర్లు వస్తున్నాయి..

ఇటీవల కాలంలో యాక్టింగ్ పరంగా మంచి ఆఫర్లు వస్తున్నాయి. చాలా స్క్రిప్టులు చదువుతున్నాను. కొన్ని క్యారెక్టర్లు బాగా నచ్చాయి. త్వరలోనే నటించే విషయమై తగిన నిర్ణయం తీసుకొంటాను అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వాంటర్ పేర్కొన్నారు. యాక్టింగ్‌ను ఎంచుకొన్నా కేవలం పరిమితమైన చిత్రాల్లోనే నటిస్తాను. యాక్టింగ్ అనేది నా ప్రధానమైన ఛాయిస్ కాదు ఆమె తెలిపింది.

English summary
Trouble seems to be brewing in Salman Khan and Iulia Vantur's love life. Vantur is miffed with Salman and the two even had a huge fight before the Salman left for his Dabangg tour. Khan touring New Zealand and Australia for the past week along with Sonakshi Sinha, Bipasha Basu, was accompanied by mom Salma, brother Sohail and sister Arpita on the tour. But his ladylove Iulia was nowhere to be seen.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu