»   » సాంగ్ చెత్తగా ఉన్నా సల్మాన్ అదరగొట్టాడు..(వీడియో సాంగ్)

సాంగ్ చెత్తగా ఉన్నా సల్మాన్ అదరగొట్టాడు..(వీడియో సాంగ్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సల్మాన్ ఖాన్, సోనమ్ కపూర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో'. సినిమా ప్రమోషన్లో భాగంగా మరో లేటెస్ట్ వీడియో సాంగును విడుదల చేసారు. ‘జబ్ తుమ్ చాహో' అంటూ సాగే పాటను ఈ పాట వినడానికి అంత బాగోలేదనే టాక్ వినిపిస్తోంది. హిమేష్ రేషిమియా ఈ సాంగును కంపోజ్ చేసారు.

వినడానికి పాట అంత సొంపుగా లేక పోయినా...ఇందులో సల్మాన్ యాక్టింగ్ మాత్రం అదరగొట్టాడని అంటున్నారు అభిమానులు. మరి సాంగును మీరూ చూసి హిమేష్ రేషిమియా కంపోజింగ్ ఎలా ఉందో, సల్మాన్ యాక్టింగ్ ఎలా ఉందో కామెంట్ బాక్సులో వెల్లడించండి.

'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో' చిత్రాన్ని తెలుగులో ‘ప్రేమ లీల' టైటిల్ తో డబ్బింగ్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ ని, ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల రిలీజ్ చేసారు. హిందీతోపాటు తెలుగులోనూ నవంబర్‌ 12న విడుదలవుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి రామ్‌చరణ్‌ వాయిస్‌ ఇస్తుండడం విశేషం.

ఇందులో నీల్ నితీన్ దేశ్ముఖ్, అనుపమ్ ఖేర్, స్వర భాస్కర్, సంజయ్ మిశ్రా తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హిమేష్ రేష్మియా, నేపధ్య సంగీతం: సంజయ్ చౌదరి, చాయాగ్రహణం: వి.మణికందన్, కూర్పు: సంజయ్ సంక్ల, పంపిణీ: ఫాక్స్ స్టార్ స్టూడియోస్, నిర్మాణం: రాజశ్రీ ప్రొడక్షన్స్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సూరజ్ బరజాత్య!

English summary
Salman Khan starrer Prem Ratan Dhan Payo's latest song, Jab Tum Chaho is out and might we be honest, the song is bad! What has happened to Himesh Reshammiya and why is he making such songs. The only saving grace in this song is Salman Khan and his acting! The video has saved the day, else it is impossible for one to listen to the audio and not go deaf.
Please Wait while comments are loading...