»   » లవ్ లో ఫెయిలయ్యాను, పెళ్ళి ఆలోచన లేదు: సుడిగాలి సుధీర్

లవ్ లో ఫెయిలయ్యాను, పెళ్ళి ఆలోచన లేదు: సుడిగాలి సుధీర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ తెలుగు చానెల్‌లో ప్రసారమయ్యే 'జబర్దస్త్‌' కార్యక్రమం ద్వారా బుల్లితెర ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటుడు సుడిగాలి సుధీర్. ఇతనికీ రష్మీ కీ లింకుందని.. అతనితో డేటింగ్ చేస్తోందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి. ఐతే ఇవన్నీ రూమర్లు కాదు నిజమే అనే వాళ్ళు కూడా ఉన్నారు.

ఏకంగా జబర్దస్త్ షోలోనే వీరి ఎఫైర్‌పై మిగిలిన కామెడీ యాక్టర్లు సెటైర్లు వేస్తున్నారు. స్కిట్లలోనూ వీరిద్దరి పేర్లు జోడించే ఆటాడేసుకుంటున్నారు. కానీ ఇదంతా రూమరే అనీ, తనకూ రష్మీకి మధ్య ఏమీ లేదని మొదటినుంచీ చెప్తూనే ఉన్నాడు సుధీర్.

Jabardasth Sudigali Gali Sudheer opens up about his love

అసలు అమ్మాయిలంటే తనకు పడదని.. తన జీవితంలో లవ్‌లో ఓసారి ఫెయిలయ్యానని, అప్పటి నుంచి అమ్మాయిల వెంట కన్నెత్తి చూసిందిలేదని అన్నాడు. ఇలాంటి పుకార్ల వల్ల తనకొచ్చే పెళ్లి సంబంధాలు పోతున్నాయని, ఎవరూ పిల్లనివ్వడానికి కూడా రాలేని స్థితి వస్తోందని నవ్వుతూ చెప్పాడు సుధీర్. తన తండ్రి.. తనతో కలిసి పనిచేసే ఫ్రెండ్స్‌ని అన్నీ ఎంక్వైరీ చేస్తారని చెబుతూ తనకు పెళ్లీ గిల్లీ ఏమీ ఇష్టంలేదని చెబుతుంటానని అన్నాడు.

ఫ్రెండ్స్‌తో సరదాగా బెంగళూరు, చెన్నై వెళ్లి ఎంజాయ్ చేస్తానే తప్పా.. తాను తిరుగుబోతును కాను అని అంటాడు సుధీర్. జీవితంలో పెళ్లి మాత్రం చేసుకోవాలని లేదని అంటాడు ఈ నవ్వుల రాజా. మొత్తం మీద సుడిగాలి సుధీర్ జబర్దస్త్ గాసిప్స్ వరుసలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు. కానీ పేరు గొప్ప ఊరు ఇంకేదో అన్నట్టు.

English summary
Jabardasth Comedian Sudheer know as Sudigali sudheer reveals his failuere Love storry and rumers witha Rashmo Gautam
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu