»   »  హీరో సిద్ధార్థ్‌ ట్వీట్ దెబ్బకి... : స్టార్ హీరో క్షమాపణ చెప్పి, మొత్తం తీయించేసారు

హీరో సిద్ధార్థ్‌ ట్వీట్ దెబ్బకి... : స్టార్ హీరో క్షమాపణ చెప్పి, మొత్తం తీయించేసారు

Written By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ముంబయి:రెండు రోజల క్రితం హీరో సిద్దార్ద....సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో పోస్ట్ చేసిన ప్రకటన...ఇప్పుడు బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ క్షమాపణ చెప్పేదాకా వెళ్లింది. రణ్ వీర్ నటించిన జాక్‌ అండ్‌ జోన్స్‌ కంపెనీ ప్రకటన వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆఫీసు పనిని ఇంటికి కూడా తీసుకెళ్లొచ్చు.. అన్న క్యాప్షన్‌తో ఓ మహిళని ఆయన భుజాన వేసుకుని వెళ్తున్న చిత్రంతో ఏర్పాటు చేసిన బిల్‌బోర్డ్‌ తీవ్ర విమర్శలకు తావిచ్చింది.

  స్త్రీలను కించపరిచేలా ఉందని సోషల్‌మీడియాలో నెటిజన్ల నుంచీ పలు విమర్శలు వచ్చాయి. దీంతో కంపెనీ ఆ ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకుంది. ఇలాంటి ప్రకటనలో నటించినందుకు రణ్‌వీర్‌ క్షమాపణలు చెప్పారు.

  రణ్ వీర్ మాట్లాడుతూ...'కంపెనీ.. తమ ప్రకటనను డిజైన్‌ చేసుకుంటున్నప్పుడు వారి సృజనాత్మకతకు స్వేచ్ఛ ఇవ్వడం ముఖ్యమని భావించాను. ఇలా జరిగినందుకు క్షమించండి.. అయితే ఇది జరిగిపోయిన విషయం.

  Jack & Jones ad row: Would never do anything to disrespect women, says Ranveer Singh

  బిల్‌బోర్డును దాదాపు 30 నగరాల్లో రాత్రికిరాత్రే ఏఎస్‌ఏపీ తీసేయడంతో మేము వెంటనే దాన్ని సరిదిద్దుకున్నాం. నేను వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ప్రతి మహిళను గౌరవిస్తాను. వారికి అగౌరవం కలిగేలా ఇంకెప్పుడూ ఏమీ చేయను' అని రణ్‌వీర్‌ ఓ ప్రకటనను విడుదల చేశారు.

  పూర్తి వివరాల్లోకి వెళ్తే... జాక్‌ అండ్‌ జోన్స్‌ బట్టల కంపెనీ.. వారు తాము ఉత్పత్తి చేసే దుస్తుల పబ్లిసిటీలో భాగంగా ఓ యాడ్ తో కూడిన హోర్డింగ్ ని అంతటా ఏర్పాటు చేసారు. ఆ యాడ్ లో బాలీవుడ్ యంగ్ హీరో రణ్‌వీర్‌సింగ్‌ ఓ మోడల్‌ను భుజాలపైకి ఎత్తుకుని ఉన్న ఓ ప్రకటన బోర్డును చెన్నై నగరంలో ఏర్పాటు చేసింది. దీన్ని సిద్దార్ద చూడటం తటస్దిచింది. దాన్ని ట్విటర్లో పోస్ట్‌ చేస్తూ అతడు చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.

  స్త్రీలను గౌరవించే భారతదేశంలో మహిళలను దిగజార్చేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనికి పలువురు నెటిజన్లు సైతం సపోర్ట్ ఇచ్చారు. సోషల్‌ మీడియాలో విమర్శలు రావడంతో స్పందించిన కంపెనీ ఆయనకు బదులిస్తూ ఎవరినీ కించపరచడం తమ ఉద్దేశం కాదని.. వెంటనే సదరు ప్రకటనను వెనక్కు తీసుకుంటున్నామని ప్రకటించింది.

  దీంతో సిద్ధార్థ్‌ చూపిన చొరవకు ప్రశంసలు లభిస్తున్నాయి. అదండీ విషయం. ఆయనే కాదూ మనం కూడా ఇలాంటి యాడ్స్ ఏమైనా అసభ్యంగా ఉన్నట్లు గమనిస్తే మన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ద్వారా కూడా తెలియచేస్తే మంచి పనిచేసినట్లే. ఏమంటారు.

  English summary
  "It was important to give the brand the creative freedom while designing the campaign but I guess we got it wrong on one of those billboards. I am sorry this happened but it is a thing of past. We rectified it immediately by having the hoarding taken down as early as possible from over 30 cities overnight," Ranveer said in a statement here.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more