»   » ఇకనుంచీ జాకీ చాన్ కాదు...జాకీ జాక్సన్ అట

ఇకనుంచీ జాకీ చాన్ కాదు...జాకీ జాక్సన్ అట

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ మార్షల్ ఆర్ట్స్ హీరో జాకీ చాన్ డాన్స్ కి మన కొరియో గ్రాఫర్ ఫరా ఖాన్ ఫిదా అయిపోయింది. అంతే జాదు ఈయన జాకీ జాక్సన్ అంటూ ఓ బిరుదు కూడా ఇచ్చేసింది. తానుఇ చెప్పిన స్టెప్ చెప్పినట్టుగా చేస్తున్న జాకీ ని చూసి ఫరా ఆశ్చర్య పోయిందట. సోనూ సూద్ తో కలిసి పంజాబీ గాయకుడు దలేర్ మెహందీ పాడిన పాటకు చిందులేసాడు ఈ సూపర్ ఫైటర్...

జాకీచాన్, అమీరా దస్తర్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'కుంగ్ ఫూ యోగా' సినిమా షూటింగ్ రాజస్థాన్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ ఎక్కువ భాగం చైనా లో జ‌రిగింది. మ‌రి కొన్ని కీల‌క స‌న్నివేశాలు కోసం ఇటీవ‌ల జాకీచాన్ ఇండియా వ‌చ్చారు. తాజా షెడ్యూల్ సోమ‌వారం నుంచే మొదలయ్యింది. ఈ షూట్ లో దిశాపాట్నీ, అమైర్ ద‌స్త‌ర్ కీల‌క స‌న్నివేశాల‌తో పాటు, బాలీవుడ్ స్టైల్లో ఉన్న ప్రతేక గీతం కోసమే ఫరాఖాన్ "కుంగ్ ఫూ యోగా" సెట్స్ మీదకి వచ్చారు.

jackie

ఈ పాటకు ఫరాఖాన్ కొరియోగ్రాఫర్ గా ఉన్నారు. దీని చిత్రీకరణకు రాజస్ధాన్ చేరుకున్న ఫరా ఖాన్ షూటింగ్ లో జాకీ చాన్ చేత కొన్ని స్టెప్పులు వేయించింది. వాటిని అలవోకగా జాకీ చాన్ వేయడం చూసిన ఫరా...'కింగ్ ఆఫ్ యాక్షన్ ఇప్పుడు డ్యాన్స్ కూడా చేయగలరు...ఇప్పుడు ఆయన పేరు జాకీ చాన్ కాదు, జాకీ జాక్సన్' అంటూ ట్వీట్ చేసింది. వీరిద్దరి ఫొటో ఇప్పుడు పిచ్చ పాపులర్ అయిపోయింది.

ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌సిద్ది చెందిన జోధ్ పూర్ ప్యాల‌స్ లో మూడు వారాలు పాటు ఈ సాంగ్ షూట్ జ‌ర‌గ‌నుంది. ఈ పాట‌తో షూటింగ్ దాదాపు పూర్త‌వుతుంద‌ని యూనిట్ వ‌ర్గాలు తెలిపాయి. బాలీవుడ్ తార‌లు కూడా ఈ చిత్రంలో న‌టిస్తుండ‌టంతో సినిమా ఇండియాలో కూడా మార్కెట్ పెరుగుతుంద‌ని టీమ్ దీమా వ్య‌క్తం చేసింది. అన్ని ప‌నులు పూర్తిచేసి సాధ్య‌మైనంత తొంద‌రగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తామ‌ని తెలిపారు.

English summary
Jackie Chan dances on a Punjabi track at Kung Fu Yoga’s premiere and it’s shockingly impressive...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu