»   » హృతిక్-కంగనాల వివాదం లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ...

హృతిక్-కంగనాల వివాదం లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ లో ఇప్పుడున్న హాట్ టాపిక్ ఏమటీ అంటే మారిన మాజీ ప్రేమికులు హృతిక్ రోషన్, కంగనారనౌత్ ల వివాదమే. ఇప్పుడు బీ-టౌన్ లో ఎక్కువ మంది మాట్లాడుకునే సంగతి హృతిక్ రోషన్, కంగనారనౌత్ ల గొడవే... తాజాగా నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వీరి మధ్య గొడవ పై స్పందించింది. హృతిక్, కంగనాల మధ్య ఏర్పడిన వివాదం త్వరలోనే ముగుస్తుందని ఆశాభావం వ్యక్తంచేసింది.

ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఫెర్నాండెజ్.. 'హృతిక్-కంగనాల వివాదం త్వరలోనే సమసిపోతుంది. దీనివల్ల ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు. ఇప్పట్నుంచి వారిద్దరూ సరైన పంథాలో వెళ్లాలి. ఇద్దరూ ఓ నిర్ణయానికి వస్తారని భావిస్తున్నా' అని చెప్పింది.

Jacqueline Fernandez wants Hrithik Roshan Kangana spat to end

ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధార్థ మల్హోత్రా కూడా ఇదే విషయం పై మాట్లాడుతూ హృతిక్, కంగనాల వివాదం వారి వ్యక్తిగతమని అన్నాడు. వారి విషయం తనకు తెలియదని, దీని గురించి మాట్లాడే హక్కు లేదని చెప్పాడు.

హృతిక్, కంగనాల మధ్య విభేదాలు ఏర్పడ్డాక పరస్పరం లీగల్ నోటీసులు ఇచ్చారు. కంగనా పంపిన్ మెయిల్స్ ను హృతిక్ బయటపెట్టడంతో గొడవ మరింత పెద్దదై పత్రికలకెక్కింది. తన మెయిల్ ను హ్యాక్ చేసింది కాక తర్వాత, తన పేరుతో ఫేక్ ఈమెయిల్ అకౌంట్ ఉందంటూ హృతిక్ ఫిర్యాదు చేయడంపై కంగనా ప్రశ్నించింది. అప్పటినుంచి ఈ వివాదం రోజుకో మలుపుతిరుగుతూ మరింత ముదిరింది.

English summary
Bollywood actress Jacqueline Fernandez today said, she hopes that the ongoing feud between Hrithik Roshan and Kangana Ranaut ends soon
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu