గచ్చిబౌలి స్టేడియంలో ‘జగదేక వీరుడు-అతిలోక సుందరి’ షో!

By Bojja Kumar

హైదరాబాద్: మెగాస్టార్‌ చిరంజీవి, శ్రీదేవి జంటగా తెరకెక్కిన ‘జగదేక వీరుడు - అతిలోక సుందరి' చిత్రాన్ని 26 సంవత్సరాల తరువాత మళ్లీ వెండి తెరపై చూడవచ్చని దర్శకుడు రాఘవేంద్రరావు తెలిపారు. అభిమానుల విజ్ఞప్తి మేరకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తున్న హైదరాబాద్‌ స్కై ఫెస్ట్‌-2015 సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు రాఘవేంద్ర రావు తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. క్యాన్సర్‌ బాధితుల సహాయార్థం ఈ ఫెస్ట్ నిర్వహిస్తున్నందున ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Over the years, many people told Aswini Dutt garu & me that they had missed 'Jagadeka Veerudu Athiloka Sundari' in...

Posted by K Raghavendra Rao on Thursday, December 24, 2015

మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' చిత్రం అప్పట్లో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదలై 26 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

'జగదేక వీరుడు అతిలోక సుందరి' చిరంజీవి కెరీర్ లో ఓ ఆణిముత్యం లాంటి సినిమా. తెలుగు సినీ చరిత్రలో ఈ చిత్రం సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అయితే.. మళ్ళీ ఆ సినిమాని రీమేక్‌ చేస్తారనే విషయమై గతంలో ఊహాగానాలు వచ్చాయి. ఓ దశలో 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమాని అశ్వనీదత్‌ నిర్మాతగా.. రామ్ చరణ్‌ హీరోగా, శ్రీదేవి కుమార్తె హీరోయిన్‌గా రూపొందిస్తున్నారనే ప్రచారమూ జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X