'జగదేకవీరుడు-అతిలోక సుందరి' రచయిత కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ సినీ రచయిత శ్రీనివాస చక్రవర్తి ఈరోజు కన్నుమూశారు. అనారోగ్యంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.
చిరంజీవి, శ్రీదేవి జంటగా తెరకెక్కి సంచలన విజయం సాధించిన జగదేకవీరుడు-అతిలోక సుందరి చిత్రానికి ఆయన మూలకథ అందించారు. పెళ్లి, పట్నం వచ్చిన పతివ్రతలు, అన్నదమ్ముల సవాల్ తదితర చిత్రాలకు ఆయన రచయితగా పనిచేశారు. అన్నదమ్ముల సవాల్ చిత్రానికి రచయితగా పనిచేశారు.



Click it and Unblock the Notifications











