Don't Miss!
- Sports
అప్పుడు బీసీసీఐ మోసం చేసింది.. అందుకే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటం లేదు: స్టీవ్ స్మిత్
- News
ఎవరికి దేవుడు? ఎందుకు దేవుడు?
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Lifestyle
ఈ రాశుల వారు భగ్నప్రేమికులు, అలా పడిపోతారు ఇలా విడిపోతారు
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
ఏపీ సీఎం వెనుక హాలీవుడ్ పెద్దలు.. తెలుగు సినిమాను తొక్కేందుకే… RRRను ప్రస్తావిస్తూ జనసేన నేత సంచలనం!
ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న టిక్కెట్ ధరల వివాదం తెలుగు సినిమాని వెనక్కు లాగుతోందని చెప్పాలి. నందమూరి బాలకృష్ణ అఖండ చిత్రం కొన్ని చోట్ల భారీ లాభాలను ఆర్జించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో బ్రేక్‌ఈవెన్‌కు కష్టపడుతోంది. అయితే ఇదే విషయం మీద ఏపీ జనసేన నేత స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

సినిమా టికెట్ల ధరను
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిందన్న సంగతి తెలిసిందే. ఏ టికెట్‌ను ఏ ధరకు అమ్మాలో స్పష్టంగా చెబుతూ కొద్దీ రోజుల క్రితం నోటీసులు కూడా జారీ చేసింది. తెలుగు సినీ పరిశ్రమలోని కొంతమంది పెద్దలు ప్రభుత్వ నిర్ణయంపై మండిపడుతున్నారు. బహిరంగానే తమ వ్యతిరేకతను వ్యక్తపరుస్తున్నారు. అయినా కూడా ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్తుంది. మరో పక్క సినిమా టికెట్లను ప్రభుత్వం ఆన్‌లైన్‌లో అమ్మేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. దీనిపై వివాదం కూడా సాగుతోంది.

రేట్ల విషయానికి వస్తే
ఇక సాధారణ థియేటర్లు, మల్టీపెక్సులను క్యాటగిరైజ్ చేసి ధరలను నిర్ణయించింది. ఆ లెక్కన మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో మల్టీప్లెక్సు ప్రీమియం రూ.250, డీలక్స్ రూ.150, ఎకానమీ రూ.75 ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.100, డీలక్స్ రూ.60, ఎకానమీ రూ.40 నాన్ ఏసీ- ప్రీమియం రూ.60, డీలక్స్ రూ.40, ఎకానమీ రూ.20 గా ఉండనుంది. ఇక మున్సిపాలిటీ ప్రాంతాల్లో : మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.150, డీలక్స్ రూ.100, ఎకానమీ రూ.60 ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.70, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30 నాన్ ఏసీ- ప్రీమియం రూ.50, డీలక్స్ రూ.30, ఎకానమీ రూ.15గా ఉంది.

నగర పంచాయతీల్లో ఇలా
అలాగే
నగర
పంచాయతీల్లో
:
మల్టీప్లెక్స్-
ప్రీమియం
రూ.120,
డీలక్స్
రూ.80,
ఎకానమీ
రూ.40
ఏసీ/ఎయిర్
కూల్-
ప్రీమియం
రూ.35,
డీలక్స్
రూ.25,
ఎకానమీ
రూ.15
నాన్
ఏసీ-
ప్రీమియం
రూ.25,
డీలక్స్
రూ.15,
ఎకానమీ
రూ.10
గ్రామ
పంచాయతీ
ప్రాంతాల్లో
:
మల్టీప్లెక్స్-
ప్రీమియం
రూ.80,
డీలక్స్
రూ.50,
ఎకానమీ
రూ.30
ఏసీ/ఎయిర్
కూల్-
ప్రీమియం
రూ.20,
డీలక్స్
రూ.15,
ఎకానమీ
రూ.10
నాన్
ఏసీ-
ప్రీమియం
రూ.15,
డీలక్స్
రూ.10,
ఎకానమీ
రూ.5గా
ఉంది.

RRR టీం ప్రెస్‌మీట్
అయితే ట్రైలర్ రిలీజ్ సందర్భంగా RRR టీం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టింది. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ ఏపీలో సినిమా టెకెట్ ధరల విషయంలో ఏం చేయబోతున్నారని అడిగి పనిలో పనిగా ఎన్టీఆర్ సన్నిహితులు ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్నారని వాళ్ల హెల్ప్ ఏమైనా తీసుకుంటారా అని ప్రశ్నించగా దానికి సమాధానంగా సినిమా టికెట్ ధరల విషయంపై ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని డీవీవీ దానయ్య అన్నారు. త్వరలోనే ఈ అంశం కొలిక్కి వస్తుందన్న ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెద్ద సినిమాలకు వర్కౌట్ కాదన్నారు.
|
జగన్ ప్రయత్నం వెనుక హాలీవుడ్ పెద్దలున్నారా?
ఇక
ఇదే
విషయం
మీద
జనసేన
నేత
బొలిశెట్టి
సత్యనారాయణ
సంచలన
వ్యాఖ్యలు
చేశారు.
ప్రభుత్వం
జోక్యం
లేదు
కాబట్టే
తెలుగు
సినిమా
ప్రపంచ
స్థాయికి
ఎదిగింది..
₹50
మద్యం
సీసా
ప్రభుత్వమే
₹500
కి
అమ్మవచ్చా!
కానీ
ఖరీదైన
సినిమా
టిక్కెట్లు
మాత్రం
చవకగానే
అమ్మాలా?
ముమ్మాటికీ
తెలుగు
సినిమా
స్థాయిని
తగ్గించే
జగన్
రెడ్డి
గారి
ప్రయత్నం
వెనుక
హాలీవుడ్
పెద్దలున్నారా?
ఏమో
అంటూ
అనుమానం
వ్యక్తం
చేసారు.