»   » జీవితం లో విషాదపు రోజులని పంచుకున్న జగపతి బాబు .....ఎవరన్నా అవకాశం ఇవ్వకపోతారా అని చూసేవాన్ని

జీవితం లో విషాదపు రోజులని పంచుకున్న జగపతి బాబు .....ఎవరన్నా అవకాశం ఇవ్వకపోతారా అని చూసేవాన్ని

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ లో ట్రెండ్ మారుతోంది. మొదట్లో విలన్ వేషాలు వేసిన వారు హీరోలయ్యారు..కామెడీ పాత్రలు వేసిన వారు కూడా హీరోలుగా ప్రేక్షకులు ముందుకొస్తున్నారు. తాజాగా హీరో వేషాలు వేసిన వారు విలన్ వేషాలు వేయడానికి ముందుకొస్తున్నారు. ఈ జాబితాలో 'జగపతి బాబు' స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నాడనే చెప్పవచ్చు. 'లెజండ్' సినిమా ద్వారా ఆయన విలన్ గా మారిపోయారు. సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి విజయాలే నమోదు చేసుకున్నాడు. హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించిన జగపతి బాబు. ఆ దశ దాటిన తరువాత ఆఫర్స్ కోసం చాలా కష్టపడ్డారు. వయసు మీద పడ్డంతో హీరో రోల్స్ కు డిమాండ్ తగ్గింది.

బోయపాటి శీను ఏ ముహుర్తాన జగపతి బాబును విలన్ గా మార్చేసాడో..ఇక వెర్సటైల్ ఆర్టిస్టుగా మారిపోయాడు. రకరకాల విలన్ పాత్రలు వేసేస్తున్నాడు. ఒక విధంగా ప్రకాష్ రాజ్ ను మన నిర్మాతలు, దర్ళకులు మరిచిపోయేట్లు చేసేసాడు.లేటెస్ట్ బజ్ ఏమిటంటే జగపతి బాబును మరో విలన్ క్యారెక్టర్ వరించనుందని. దిల్ రాజు..వేణు శ్రీరామ్ కలిసి హీరో నాగార్జున కు వినిపించిన కథలో మాంచి విలన్ క్యారెక్టర్ కూడా ఉందంట. ఆ క్యారెక్టర్ కు జగపతిబాబును అనుకుంటున్నామని వారు నాగ్ కు వెల్లడించారని వినికిడి.నాగ్ కు జగపతిబాబుకు మంచి సాన్నిహిత్యం వుంది. గతంలో ఓసారి జగపతి బాబు హీరోగా నాగ్ ఆహా అంటూ ఓ సినిమా కూడా నిర్మించాడు. పాత్ర వెరైటీగా వుండడం, జగపతి బాబు ఇప్పుడు విలన్ గా మంచి పామ్ లో వుండడంతో నాగ్ కూడా ఊ అన్నాడని వినికిడి.

 జగపతి బాబు ను అదృష్టం వరించింది:

జగపతి బాబు ను అదృష్టం వరించింది:


హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించిన జగపతి బాబు. ఆ దశ దాటిన తరువాత ఆఫర్స్ కోసం చాలా కష్టపడ్డారు. వయసు మీద పడ్డంతో హీరో రోల్స్ కు డిమాండ్ తగ్గింది. ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోవాలనుకునే టైమ్ లో బోయపాటి శ్రీను రూపంలో జగపతి బాబు ను అదృష్టం వరించింది. విలన్ గా కొత్త అవతారం ఎత్తారు. జగపతిబాబు హీరోగా నటించిన సినిమాలు వచ్చినవి వచ్చినట్టే టపా కట్టేస్తోన్న రోజులవి.

 లెజెండ్‌లో విలన్‌గా :

లెజెండ్‌లో విలన్‌గా :


కొన్ని సినిమాలైతే విడుదల కూడా కాకుండా ఆగిపోవడంతో జగపతిబాబుకి కనీసం పారితోషికం కూడా గిట్టకుండా పోయిన సినిమాలున్నాయి. అలాంటి టైమ్‌లో జగపతిబాబు ఒక సూపర్ డెసిషన్ తీసుకున్నాడు. బాలకృష్ణ లెజెండ్‌లో విలన్‌గా నటించడానికి సై అన్నాడు. అంతే దాంతో జగపతిబాబు రాతే మారిపోయింది.

 విలన్ గా స్టార్ హీరోల సినిమాల్లోనే:

విలన్ గా స్టార్ హీరోల సినిమాల్లోనే:


ఇప్పుడు జగపతిబాబు తెలుగు చిత్ర సీమలో కాస్ట్‌లీయస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ విలన్. ఆయన్ను విలన్ గా తీసుకోడానికి టాలీవుడ్ లో దర్శక, నిర్మాతలందరూ పోటీ పడిపోతున్నారు. అయితే జగపతి బాబు ప్రస్తుతం విలన్ గా స్టార్ హీరోల సినిమాల్లోనే నటిస్తూ బిజీగా ఉన్నారు.

జీవితం లో విషాదపు రోజులని పంచుకున్న జగపతి బాబు .....ఎవరన్నా అవకాశం ఇవ్వకపోతారా అని చూసేవాన్ని

జీవితం లో విషాదపు రోజులని పంచుకున్న జగపతి బాబు .....ఎవరన్నా అవకాశం ఇవ్వకపోతారా అని చూసేవాన్ని

రెండు కోట్లు ఇవ్వనిదే సినిమా చేయట్లేదట. కేవలం తెలుగు చిత్రసీమలోనే కాదు ఇప్పుడు జగపతిబాబుకి తమిళ, మలయాళ చిత్ర సీమల నుంచి కూడా ఆఫర్లు వెల్లువలా వచ్చి పడిపోతున్నాయి. విజయ్‌తో, విశాల్‌తో చెరో సినిమాలో విలన్‌గా నటించడానికి జగపతిబాబు అంగీకరించాడు. మలయాళంలో మోహన్ లాల్ సినిమాలో కూడా విలన్ గా నటిస్తున్నాడు.

 రెండు చేతులా కోట్లు:

రెండు చేతులా కోట్లు:


జగపతిబాబుని విలన్‌గా పెట్టుకుంటే తెలుగులో ఆటోమేటిగ్గా మార్కెట్ పెరుగుతుందని తమిళ హీరోలు తెలివిగా జగపతిబాబుని సైనప్ చేసుకుంటున్నారు. ఒకానొక టైమ్‌లో ఆస్తులన్నీ పోయి ఇబ్బందుల్లో వున్న జగపతిబాబు ఇప్పుడు రెండు చేతులా కోట్లు వెనకేస్తున్నాడంటే అదంతా లెజెండ్ మహిమే మరి.

 ప్రకాష్ రాజ్ చేయాల్సిన పాత్రల్ని:

ప్రకాష్ రాజ్ చేయాల్సిన పాత్రల్ని:


ఈ సంవత్సరం నాన్నకు ప్రేమతో జగపతి బాబు మరోసారి విలన్ గా తన విశ్వరూపం చూపించాడు. అయితే లెజెండ్ లో క్రూయల్ విలన్ గా మెప్పిస్తే , నాన్నకు ప్రేమతో సినిమాలో పాలిష్డ్ , స్టైలిష్ విలన్ గా అదరగొట్టాడు. ఇప్పుడు టాలీవుడ్ లో ప్రకాష్ రాజ్ చేయాల్సిన పాత్రల్ని తనే చేస్తూ ఖరీదైన విలన్ గా దూసుకుపోతున్నాడు.

 యన్టీఆర్ సినిమాలో కూడా:

యన్టీఆర్ సినిమాలో కూడా:


త్వరలో వక్కంతం వంశీ డైరెక్షన్ లో యన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమాలో కూడా జగపతి బాబు విలన్ గా నటించబోతున్నట్టు తెలుస్తోంది. సో.. జగపతి బాబు హీరో టు విలన్ గా టాలీవుడ్ లో బెస్ట్ అనిపించుకుంటున్నాడు.

 సినిమాలకు దూరమయ్యాడు:

సినిమాలకు దూరమయ్యాడు:


ఒకప్పుడు కుటంబ కథా చిత్రాల హీరోగా ఓ వెలుగు వెలిగాడు జగపతి బాబు. ఫ్యామిలీ టైప్‌ సినిమాలతోబాటు మాస్‌ పాత్రలు కూడా ఆయనకు బాగానే పేరు తీసుకొచ్చాయి. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆయన కొన్నాళ్లపాటు సినిమాలకు దూరమయ్యాడు. ఆ సమయంలో ఆర్థిక కష్టాలు కూడా వెంటాడాయి. అయితే బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘లెజెండ్‌' సినిమా ఆయన దిశను మార్చేసింది. రజనీకాంత్‌, మోహన్‌లాల్‌ వంటి హీరోలతో కలిసి నటించే అవకాశాల్ని తీసుకొచ్చింది.

 పులి మురుగన్‌:

పులి మురుగన్‌:


మోహన్‌లాల్‌ హీరోగా మలయాళంలో రూపొందిన ‘పులి మురుగన్‌' (తెలుగులో మన్యం పులి) వంద కోట్ల రూపాయల వసూళ్లు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అందులో జగపతిబాబు విలన్‌గా నటించి కేరళలో కూడా పాగా వేశాడు. ఈ సందర్భంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

 ఎదురు చూసేవాణ్ని:

ఎదురు చూసేవాణ్ని:


‘‘లెజెండ్‌' సినిమాకు ముందు నాకెవరైనా అవకాశం ఇస్తారా అని ఎదురు చూసేవాణ్ని. ‘నేను బిజీగా ఉన్నానండి' అని చెప్పే రోజు మళ్లీ వస్తుందా? అనుకునేవాణ్ని. కానీ, ఇప్పుడది నిజమైంది. ఎన్ని దెబ్బలు తిన్నా మళ్లీ నిలదొక్కుకున్నా. ఇదంతా టైమ్‌ మహిమ. ‘పులి మురుగన్‌' సినిమా నాకో అందమైన అనుభూతిని మిగిల్చింద'ని జగపతి చెప్పాడు.

English summary
Jagapathi Babu is now most sought after actor for villain roles in big hero movies in both Telugu and Tamil. From Rajinikanth's movie to Mahesh Babu's film
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu