»   »  చిరంజీవి జగపతి బాబుల మధ్య వార్..?

చిరంజీవి జగపతి బాబుల మధ్య వార్..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగాస్టార్ చిరంజీవి హీరోగా 150వ సినిమా సెట్స్ లోకి వెళ్లడానికి ఒక్కొక్క మెట్టే ఎక్కుతోంది ఆలస్యం ఔతున్నా గానీ ఆ సమయాన్ని కూడా సినిమా ని మరింత మెరుగు పెట్టటానికే వాడుకుంటున్నారు. దాదాపు ఎనిమిదేళ్ళూగా ఎదురు చూసిన అభిమానులు చిరు ను మళ్ళీ చూసే సినిమా అత్యద్బుతంగా ఉండాలనే కోరుకుంటారు కాబట్టి. ఆ స్థాయి హంగులను సిద్ధం చేసుకుంటుంది.

ఈ చిత్రంలో హీరోయిన్ గా నయనతార, అనుష్క పేర్లు వినపడుతున్నాయి.ఐతే ఇప్పటికీ హీరోయిన్ అన్న విశయం లో సరైన క్లారిటీని ఇచ్చే వారత ఏదీ వినిపించలేదు...

హీరోయిన్ తర్వాత సినిమాకు అతిముఖ్యమైన ఎలిమెంట్ అయిన విలన్ కోసం కూడా వేట తీవ్రంగానే సాగింది. ఈ చిత్రంలో విలన్ గా ఎవరు చేస్తారనే దానిపై బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్, అరవింద్ స్వామి పేర్లు వినపడ్డాయి. అయితే లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ చిత్రంలో ఇప్పుడు జగపతిబాబును విలన్ గా తీసుకోవాలనుకుంటున్నారట. ఇదే విశయం మీద ఇప్పుఇడు చర్చలు జరుగుతున్నాయట.

Jagapathi Babu in consideration as villaian in Chiru 150th Movie

నందమూరి బాలకృష్ణ "లెజెండ్" తో హీరో నుండి విలన్ గా మారిపోయిన గా మారిన జగపతి బాబు, తర్వాత ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాలో కూడా విలన్ గా నటించాడు. నందమూరి హీరోల తర్వాత ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి కూడా జగపతి బాబే విలన్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.

ఇప్పటికి అయితే వీ.వీ.వినాయక్,సినిమా యూనిట్ సభ్యుల దగ్గర విశ్వసనీయ సమాచారం ప్రకారం చిరు-వినాయక్ కలయికలో తెరకెక్కనున్న "కత్తిలాంటోడు" కి నిన్నటి ఫ్యామిలీ హీరో జగపతి బాబు, చిరు తో తల పడనున్నారట,. సీనియర్ హీరో బాలయ్యతో పాటు యంగ్ హీరోల సినిమాల్లోని ఆయా పాత్రలని తనదైశ శైలిలో పండిస్తూ సెకెండ్స్‌ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్న జగపతి, చిరు రీ ఎంట్రీ సినిమాలో విలన్‌గా దాదాపు ఖాయమని తెలుస్తోంది.

ఈ సినిమాకి మాతృక అయిన మురుగదాస్ తెరకెక్కించిన "కత్తి"లో తోత రాయ్ చౌదరి అనే నటుడు పోషించిన పాత్రలో జగపతి కనపడనున్నారు. తొలుత ఈ పాత్రకి వేరేవాళ్ళని అనుకున్నా ఈ పాత్రకు జగపతి అయితేనే కరెక్టని చిత్ర బృందం ఫిక్సయ్యారట.

పేరుకి జగపతి విలన్‌గా నటిస్తున్నా స్టైల్ పరంగా హీరోల తోజ్ సరి సమానంగా కనిపిస్తున్నాడు.. ఫిజిక్ ని కూడా అంతే రేంజ్ లో మెయింటెయిన్ చేస్తున్నాడు ఈ సూపర్ హీరో... మరి హీరోలకి ఈ యాంటీ హీరో పెద్ద తలనిఒప్పే కదా. ఆ లెక్కన చిరు కూడా జగపతి బాబుని డామినేట్ చేయటానికి మరింత కష్ట పడాలేమో...

English summary
Jagapathi Babu to play villain in Chiranjeevi's 150th?
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu