Just In
- 8 min ago
KRACK వివాదం.. దిల్ రాజు గురించి మాట్లాడే అర్హతే లేదు.. బెల్లంకొండ సురేష్ కామెంట్స్
- 1 hr ago
క్రాక్ ఓటీటీ రిలీక్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు రాబోతోందంటే?
- 1 hr ago
ఇన్నేళ్లకు ఆ విషయం తెలిసింది.. ఇకపై నేనేంటో చూపిస్తా.. రామ్ కామెంట్స్ వైరల్
- 1 hr ago
సలార్ సినిమాకు హీరోయిన్ టెన్షన్.. వాళ్ళు ఖాళీగా లేరట
Don't Miss!
- News
తిరుమలలో అపచారం: ఎక్కడి నుంచి వచ్చాయో గానీ: శ్రీవారి ఆలయం వద్ద తిష్ఠ: భక్తుల అసహనం
- Sports
యువరాజ్ సింగ్ పంచుకున్న భరతనాట్యం బౌలింగ్.. చూస్తే వావ్ అనాల్సిందే!వీడియో
- Finance
startup India seed fund: స్టార్టప్స్ కోసం రూ.1000 కోట్ల నిధి
- Automobiles
కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
యువతరాన్ని ఉర్రూతలూగించే ప్రియమణి 'క్షేత్రం'...!
జగపతి బాబు, ప్రియమణి, కిక్ శ్యామ్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'క్షేత్రం". శ్రీ బాలాజీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. టి.వేణుగోపాల్ దర్శకత్వం వహిస్తున్నారు. వై.ఎస్.ప్రతాప్‌రెడ్డి సమర్పిస్తున్నారు. జి.గోవిందరాజు నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఈ 'క్షేత్రం' సినిమాలో ప్రియమణి రెండు విభిన్న పాత్రలను పోషిస్తున్నారు. అందులో ఒకటి ట్రెండీ కేరెక్టర్ అయితే... మరొకటి చారిత్రక నేపథ్యంలో వచ్చే నాగపెంచలమ్మ పాత్ర. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రియమణి ఈ పాత్రలను పోషిస్తున్నట్టు చిత్రదర్శకుడు టి వేణుగోపాల్ చెప్పారు. ఇప్పటివరకూ గ్లామర్ పాత్రలతో యువతరం అభిమానాన్ని చూరగొన్న ప్రియమణి.. ఈ సినిమాతో కుటుంబ ప్రేక్షకులకు కూడా చేరువ కానున్నారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
ఇంకా వేణుగోపాల్ మాట్లాడుతూ 'జగపతిబాబు పాత్ర ఈ కథకు వెన్నెముక. ఆయన కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయే పాత్ర ఇది. 'కిక్" శ్యామ్ ఇందులో ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ప్రియమణి, కిక్ శ్యామ్ కాంబినేషన్ సన్నివేశాలు యువతరాన్ని ఉర్రూతలూగిస్తాయి' అన్నారు. నిర్మాత జి.గోవిందరాజు మాట్లాడుతూ 'నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా సాగుతున్న కథ ఒక్కసారిగా కొత్త మలుపు తీసుకుంటుంది. ఆ మలుపే ఈ సినిమాకు హైలైట్. త్వరలో పాటల్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. దీపావళికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని తెలియజేశారు.
కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, ఆదిత్యమీనన్, రాజీవ్ కనకాల, ఉత్తేజ్, అక్కినపల్లి రాజ్‌కుమార్, బ్రహ్మాజీ, అన్నపూర్ణమ్మ, హేమ, శివపార్వతి తదితరులు ఇతర ముఖ్యపాత్రధారులు. మాటలు: పరుచూరి బ్రదర్స్, సంగీతం: కోటి, కెమెరా: ఎమ్వీ రఘు, కళ: రఘు కులకర్ణి, పాటలు: సుద్దాల అశోక్‌తేజ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అక్కినపల్లి విజయ్‌కుమార్.