For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఓ మగాడు నాకే ముద్దొచ్చాడు: రామ్ చరణ్ గురించి జగపతి బాబు!

  By Bojja Kumar
  |

  రామ్ చరణ్, సమంత, జగపతి బాబు, ఆది ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'రంగస్థలం' మూవీని ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ హిట్ చేసిన నేపథ్యంలో సోమవారం థాంక్యూ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ చిత్రంలో ప్రెసిడెంట్ పాత్ర పోషించిన జగపతి బాబు ఆసక్తికరంగా ప్రసంగించారు. ముఖ్యంగా రామ్ చరణ్ గురించి, సుకుమార్ గురించి ఆయన చెప్పిన మాటలు ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి.

  Rangasthalam Movie Is About To Reach 100Cr Collection
  ఓ మగాడు నాకే ముద్దొచ్చాడు

  ఓ మగాడు నాకే ముద్దొచ్చాడు

  రంగస్థలం సినిమా డబ్బింగ్ చెప్పేటపుడు నేను జగపతి బాబు అనే సంగతి మరిచిపోయి చిట్టిబాబును విపరీతంగా ప్రేమించాను. ఎంతలా అంటే తొలిసారి ఓ మగాడు నాకే ముద్దొచ్చాడు. ఈ క్యారెక్టర్ చూసి ఈ ప్రెసిడెంట్‌గాన్ని చంపేయాలి చిట్టిబాబూ అని నేనే ఫీలయ్యాను. ఎప్పుడు చంపుతాడు ఈ నాకొడుకును అనే ఫీలింగ్ వచ్చది. ఆడియన్స్‌కు కూడా అదే ఫీలింగ్ వచ్చేసింది... అందుకే సినిమా సూపర్ హిట్ అయింది అని జగపతి బాబు అన్నారు.

  పొట్టేసుకుని ఉంటే హాట్, సెక్సీ అంటారేంటి?

  పొట్టేసుకుని ఉంటే హాట్, సెక్సీ అంటారేంటి?

  నాకు నిజంగా ఒకటి అర్థం కాలేదు. నేను చొక్కా తీసేసి, ఇంత పొట్టేసుకుని అటూ ఇటూ తిరుగుతుంటే హాట్, సెక్సీ అంటారేంటండీ? థాంక్యూ వెరీమచ్ దట్... నా టైమ్ అట్లా ఉంది. (మధ్యలో సుకుమార్ మైకు అందుకుని... ఈ పొట్టకూడా ఆయన కావాలని పెట్టుకోవాల్సి వచ్చింది. ఆయనకు బొజ్జ లేదు సీన్ కోసం అలా బొజ్జను ముందుకని ఉగ్గపట్టుకుని ఉన్నారు. మొదట నేను ఒకసారి చెప్పాను. ఆ తర్వాత ప్రతి సీన్లో ఆయన దాన్ని కంటిన్యూ చేశారు అని తెలిపారు).

  సుకుమార్ ఒక్కడే గుర్తించాడు

  సుకుమార్ ఒక్కడే గుర్తించాడు

  ఇక్కడ ప్రత్యేకంగా సుకుమార్ కు థాంక్స్ చెప్పి తీరాలి. నాకు, ఆడియన్స్‌కు రిలీఫ్ ఏమిటంటే క్యారెక్టరైజేషన్ డిఫరెంటుగా ఉండటమే. లెజెండ్ నుండి ఇప్పటి వరకు ఒక పద్దతిలో ఉంది. లెజెండ్ నా కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్ అయితే రంగస్థలం నాకు సుకుమార్ ఇచ్చిన ఇంకో లైఫ్. నేను ఫస్ట్ నుండి అంటూనే ఉన్నాను. నేను మాస్ కూడా చేయగలను, ఊరగా కూడా కనబడగలను. ఎవరూ గుర్తించలేదు. సుక్కూ ఒక్కడే గుర్తించాడు.

  సుక్కూ కళ్లలో ఆనందం

  సుక్కూ కళ్లలో ఆనందం

  నా లుక్ ప్రేక్షకులకు కూడా బోర్ కొడుతోంది. ఇక లుక్ మార్చడా అనే ఫీలింగ్ వారికి వచ్చినపుడు ఈ పాత్ర రావడం సంతోషంగా ఉంది. సుక్కూతో చేస్తున్నపుడు ఎవరూ గుర్తుండరు. ఆయన కళ్లు చూస్తూ ఉంటాను. ఆయన కళ్లలో గ్లో కనిపించినపుడే సంతోషం అనిపిస్తుంది. ఆ గ్లో వచ్చే వరకు యాక్ట్ చేయాలనే ఫీలింగ్ నాలో ఉండేది.

  వెళ్లడం అవసరమా అన్నారు...

  వెళ్లడం అవసరమా అన్నారు...

  ఒకటి రెండు క్లోజ్‌ల కోసం రాజమండ్రి రమ్మని అడిగారు. చాలా మంది షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని వెళ్లడం కరెక్టా? అని అడిగారు. సుక్కూ ఒక్క క్లోజ్ పెట్టినా అది గొప్ప క్లోజ్ అవుతుందని వారికి నేను చెప్పేవాడిని. నేను ఊరికే వెళ్లడం లేదు, నా స్వార్థం కోసం వెళుతున్నాను అనేవాడిని... అని జగపతి బాబు తెలిపారు.

  English summary
  Jagapathi Babu Superb Speech at Rangasthalam Thank You Meet on Mythri Movie Makers. #Rangasthalam 2018 Telugu Movie ft. Ram Charan, Samantha, Pooja Hegde and Aadhi Pinisetty. #Rangasthalam is directed by Sukumar and Music composed by DSP / Devi Sri Prasad. Produced by Naveen Yerneni, Y Ravi Shankar and Mohan Cherukuri under Mythri Movie Makers banner.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more