»   » తొలి ప్రయత్నంలోనే స్టార్ హీరో బెంభేలు, ఆర్థిక ఇబ్బందులే కారణమా..?

తొలి ప్రయత్నంలోనే స్టార్ హీరో బెంభేలు, ఆర్థిక ఇబ్బందులే కారణమా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన రణబీర్ కపూర్ ప్రస్తుతం 'జగ్గా జాసూస్' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్న ఈచిత్ర నిర్మాణంలో కూడా రణబీర్ భాగస్వామిగా ఉన్నాడు.

అయితే నిర్మాతగా ఇదే తన మొదటి, చివరి సినిమా అని, మళ్లీ సినిమా నిర్మాణం జోలికి వెళ్లనుగాక వెళ్లను అని చెప్పేశాడు ఈ యంగ్ హీరో. నిర్మాతగా తాను పనికిరానని, నటుడిగానే సరిపోతానని రణబీర్ స్టేట్మెంటును చూస్తే.... జగ్గా జాసూస్ సినిమా నిర్మాణంలో ఈ హీరోగారి చేతిచమురు బాగానే వదిలినట్లు బాలీవుడ్లో చర్చించుకుంటున్నారు.

తాత పేరు నిలబెట్టాలనుకుని...

తాత పేరు నిలబెట్టాలనుకుని...

రణబీర్ కపూర్ తాత, ఒకప్పటి బాలీవుడ్ సూపర్ స్టార్ రాజ్ కపూర్ 1948లో ఆర్‌.కె.ఫిలిమ్స్‌ బేనర్ స్థాపించి చాలా సినిమాలు తీశారు. అయితే రణబీర్ తండ్రి రిషి కపూర్‌కు సినిమా నిర్మాణంపై అంతగా పట్టులేక పోడడంతో 1999 తర్వాత నుండి ఈ బేనర్లో సినిమాలు నిర్మించడం లేదు. తాత పేరు నిలబెట్టాలనే ఉద్దేశ్యంతో ఆర్.కె.ఫిల్మ్స్ సంస్థను మళ్లీ లైమ్ లైట్ లోకి తెచ్చాడు రణబీర్.

తొలి సినిమాకే చేతులు కాలాయా?

తొలి సినిమాకే చేతులు కాలాయా?

అయితే ‘జగ్గా జాసూస్' నిర్మాణంలో భాగస్వామ్యమైన రణబీర్ కపూర్ చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడని, అందుకే ఇకపై మళ్లీ సినిమా నిర్మాణం వైపు వెళ్లబోనని నిర్ణయించుకున్నట్లు బాలీవుడ్లో టాక్.

జగ్గా జాసూస్

జగ్గా జాసూస్

జగ్గా జాసూస్ సినిమా విషయానికొస్తే... ఇదో మ్యూజికల్ అడ్వంచర్ రొమాంటిక్ ఫిల్మ్. కత్రినా కైఫ్ హీరోయిన్. యూటీవీ మోషన్ పిక్చర్స్ అధినేత సిద్ధార్థరాయ్ కపూర్ తో కలిసి రణబీర్, అనురాగ్ బసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఒక యంగ్ డిటెక్టివ్ మిస్సయిన తన తండ్రి వెతుక్కుంటూ వెళ్లి ఎలాంటి సాహసాలు చేశాడు అనే కాన్సెప్టుతో ఈ సినిమా సాగుతుంది. జులై 14న సినిమా విడుదల కాబోతోంది.

అందరూ చూస్తుండగా దర్శకుడి పెదాలను ముద్దాడిన రణబీర్ కపూర్

అందరూ చూస్తుండగా దర్శకుడి పెదాలను ముద్దాడిన రణబీర్ కపూర్

సినిమా ప్రమోషన్ల కోసం ఎంతకైనా తెగించే బాలీవుడ్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ జంటగా అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జగ్గా జాసూస్' ప్రెస్ మీట్లో జరిగిన సంఘటన చూసి అంతా ముక్కున వేలేసుకున్నారు.

పూర్తి వివరాలు, వీడియో కోసం క్లిక్ చేయండి.

English summary
Ranbir Kapoor has given up as a producer after his very first film Jagga Jasoos. Ranbir who was elated to turn producer with Jagga will not be producing any more films and declared that this film his last film as a producer.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu