»   » జై లవ కుశ: సీక్రేట్లన్నీ చెప్పేసాడు

జై లవ కుశ: సీక్రేట్లన్నీ చెప్పేసాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

జై లవకుశ ఫస్ట్ లుక్ వచ్చినప్పుడే ఒక రకమైన ఆసక్తి క్రియేట్ అయ్యింది కళ్ళలో కనిపించిన ఆ షేడ్ చూసి చాలా ఊహించుకున్నారు. సినిమాకే కీలకం అయిన "జై" పాత్రకు ప్రత్యేకమైన మేకప్ ఉండాలన్న ఉద్దేశంతో చిత్ర బృందం ఓ హాలీవుడ్ మేకప్ నిపుణుడిని హైదరాబాద్ రప్పించిన సంగతి తెలిసిందే.

ఫొటోలవల్లనే ఎక్కువ హైప్

ఫొటోలవల్లనే ఎక్కువ హైప్

ఆ టెక్నీషియన్ ప్రత్యేకమైన మేకప్ డిజైన్లు కూడా చేశాడు. దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఆ ఫొటోల్లో ఉన్న ఎన్టీఆర్ ని చూసి ఒక్కకొక్కరూ ఒక్కోరకమైన ఊహాగానాలతో అసలు సినిమా ఎలాఉండబోతుందన్న అంచనాకు వచ్చేసారు. నిజానికి అనుకున్న దానికన్నా ఈ ఫొటోలవల్లనే ఎక్కువ హైప్ వచ్చింది...

పెద్ద మార్పులేమీ లేదు

పెద్ద మార్పులేమీ లేదు

తీరా సినిమా చూస్తే మాత్రం జై పాత్రకు ప్రత్యేకమైన మేకప్ ఏమీ కనిపించలేదు. ఎన్టీఆర్ తన హావభావాలతో ప్రత్యేకత చూపించాడు తప్ప.. మేకప్ పరంగా పెద్ద మార్పులేమీ లేదు. కొంచెం హెయిర్ స్టైల్ మార్చారు. కాస్ట్యూమ్స్ అవీ డిఫరెంటుగా ఉండేలా చూసుకున్నారు.

మూడు పాత్రల కోసం

మూడు పాత్రల కోసం

మరి హాలీవుడ్ మేకప్ నిపుణుడితో ఏం చేయించారన్న సందేహాలు అందరికీ కలిగాయి. ఈ విషయమై దర్శకుడు బాబీ క్లారిటీ ఇచ్చాడు. మూడు పాత్రల కోసం మేకప్ వైవిధ్యంగా ఉండేలా చూడాలని హాలీవుడ్ నిపుణుడిని రప్పించామని.. అలాగే ఇందుకోసం కొన్ని గ్రాఫిక్స్ కూడా ఉపయోగించాలనుకున్నామని.. ఐతే ఎన్టీఆర్ ఆ అవసరం రాకుండా చేశాడని బాబీ చెప్పాడు.

అతడికి మాత్రమే సాధ్యం

అతడికి మాత్రమే సాధ్యం

సాంకేతిక నైపుణ్యంతో కంటే హావభావాలతో తేడా చూపిద్దామని ఎన్టీఆర్ అన్నాడని.. చిన్న చిన్న హావభావాల్ని కూడా చాలా కష్టపడి చూపించాడని.. వైవిధ్యం తీసుకొచ్చాడని బాబీ చెప్పాడు. ఎన్టీఆర్ లాంటి డెడికేషన్ ఉన్న నటుడిని తాను ఇంతవరకు చూడలేదని.. ‘జై లవకుశ' లాంటి సినిమా చేయడం అతడికి మాత్రమే సాధ్యమని బాబీ అన్నాడు.

English summary
Director KS Ravindra aka Bobby To Answer About Hollywood Style In Jai Lava Kusa
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu