For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అభిమాని ఎదిగితే గర్విస్తా: చిరంజీవి, ‘జక్కన్న’ ట్రైలర్ సూపర్ (ఫోటోస్)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: సునీల్, మన్నార్ చోప్రా హీరో హీరోయిన్లుగా ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా రూపొందుతోన్న చిత్రం జక్కన్న. వంశీ కృష్ణ అకెళ్ళ దర్శకత్వంలో ఆర్.సుదర్శన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దినేష్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం శుక్ర‌వారం హైద‌రాబాద్ శిల్ప‌క‌ళావేదిక‌లో జ‌రిగింది.

  ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన మెగాస్టార్ చిరంజీవి బిగ్ సీడీని విడుద‌ల చేశారు. ఆడియో సీడీల‌ను చిరంజీవి విడుద‌ల చేసి తొలి సీడీని హీరో సునీల్‌కు అందించారు. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను మ‌న్నార్ చోప్రా, సినిమాటోగ్రాఫ‌ర్ విడుద‌ల చేశారు.

  ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ సునీల్ నాపై చూపించే అభిమానం, అప్యాయ‌తే న‌న్నిక్క‌డికి ర‌ప్పించాయి. నేనంటే అభిమాన‌మ‌ని. నా డ్యాన్సుల‌ను స్టేజ్‌పై వేసి ఈ స్టేజ్‌కు వ‌చ్చాన‌ని సునీల్ ఎప్పుడు అంటుంటాడు. ఒక అభిమాని ఎదిగాడంటే త‌ల్లిదండ్రులు త‌ర్వాత గ‌ర్వించే వ్య‌క్తిని నేనే. ఈరోజు సునీల్ ఎంతో మందికి ఇన్‌స్పిరేష‌న్‌గా నిల‌బ‌డ్డాడు. క‌ష్టాన్ని న‌మ్ముకుంటే సినిమా ప‌రిశ్రమ‌లో ఎవ‌రైనా ఎదుగుతార‌ని చెప్ప‌డానికి సునీల్ మంచి ఉదాహ‌ర‌ణ‌' అన్నారు.

  ఈ సినిమాలో సునీల్ డ్యాన్సులు చూస్తుంటే మ‌న‌కున్న బెస్ట్ డ్యాన‌ర్స్‌ లో సునీల్ ఒక‌డని చెప్ప‌వ‌చ్చు. ట్రైల‌ర్ చూస్తుంటే ప్యామిలీ డ్రామా, రొమాన్స్‌, కామెడి, యాక్ష‌న్ స‌హా అన్నీ ఎలిమెంట్స్‌తో నిండు

  గా క‌న‌ప‌డుతుంది. ఇది ప్రేక్ష‌కుల‌ను త‌ప్ప‌కుండా అల‌రిస్తుంద‌న‌డంలో సందేహం లేదు. సినిమా సూప‌ర్‌డూప‌ర్ హిట్ అవుతుంది. కొంత గ్యాప్ త‌ర్వాత వస్తున్న ఈ సినిమా సునీల్‌కు బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని అందిస్తుంది అని చిరంజీవి తెలిపారు.

  స్లైడ్ షోలో ఆడియో వేడుకకు సంబంధించిన ఫోటోలు, ట్రైలర్.... అన్నయ్య చిరంజీవి గురించి సునీల్ చెప్పిన విశేషాలు

  అన్నయ్య చిరంజీవి వల్లే..

  అన్నయ్య చిరంజీవి వల్లే..

  హీరో సునీల్ మాట్లాడుతూ ``అన్నయ్య చిరంజీవిగారి సినిమాను లైన్ లో నిలబడి పోట్లాడి టికెట్ తీసుకుని సినిమా చూసి నేను ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నాను. ఇంత కంటే ఏం కావాలి. చిరంజీవిగారి వల్లే ఈరోజు నేనిక్కడ నిలబడి ఉన్నాను. ఆయన ఎంతో బిజీగా ఉన్నప్పటికీ నాకోసం ఇక్కడకు వచ్చారు. ఆయనకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం' అన్నారు.

  కామెడికే బోర్ కొట్టేలా

  కామెడికే బోర్ కొట్టేలా

  సినిమా గురించి సునీల్ మాట్లాడుతూ....సినిమా గురించి చెప్పాలంటే సినిమా అంతా కామెడీయే నిండి ఉంటుంది. కామెడికే బోర్ కొట్టేలా ప్ర‌తి స‌న్నివేశం ఉంటుంది. క‌థ కొత్త‌ద‌నంతో పాటు భ‌వానీ ప్ర‌సాద్ అద్భుత‌మైన డైలాగ్స్ రాశారు. సినిమాటోగ్ర‌ఫీ రాంప్ర‌సాద్‌గారు నన్నెంతో అందంగా చూపించారు. దినేష్ ఎంతో బ్యూటీపుల్ మ్యూజిక్ అందించారు. ద‌ర్శ‌కుడు వంశీ అకెళ్ళ నాతో పాటు రెండేళ్ళ పాటు ట్రావెల్ చేశాడు. కొత్త ఆలోచ‌న‌కు ఎంట‌ర్‌టైన్మెంట్ మిక్స్ చేసి తీసిన సినిమా ఇది. నేను ఇప్పుడు దాకా చేసిన సినిమాల్లో విప‌రీత‌మైన కామెడి చేసిన సినిమా ఇది అన్నారు.

  సునీల్ సొంత ఖర్చు

  సునీల్ సొంత ఖర్చు

  చిత్ర నిర్మాత ఆర్‌.సుద‌ర్శ‌న్ రెడ్డి మాట్లాడుతూ ``సునీల్‌తో సినిమా చేయాల‌నుకుంటే సునీల్ ఇన్‌వాల్వ్‌మెంట్ ఎక్కువ‌గా ఉంటుంద‌ని అనడంతో ముందు భ‌య‌ప‌డ్డాను. కానీ నేను ఇంత దూరం రావ‌డానికి కార‌ణం సునీల్‌గారే. సినిమా కోసం త‌న స్వంత ఖ‌ర్చుతో కొంత మంది రైట‌ర్స్‌ను పెట్టుకుని క‌థ‌ను అందంగా రాయించుకున్నారు. ఈ సినిమా ఇంత బాగా రావ‌డానికి ఏకైక కార‌ణం సునీల్‌గారే అని చెప్పుకొచ్చారు.

  నటీనటులు, టెక్నీషియన్స్

  నటీనటులు, టెక్నీషియన్స్

  కబీర్ సింగ్, సప్తగిరి, పృథ్వీ, పోసాని, నాగినీడు, రాజ్యలక్ష్మి, చిత్రం శ్రీను, అదుర్స్ రఘు, రాజా రవీంద్ర తదితరులు ఇతర తారాగణంగా నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్, మ్యూజిక్: దినేష్, ఫైట్స్: కనల్ కణ్ణన్, డ్రాగన్ ప్రకాష్, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, డైలాగ్స్: భవాని ప్రసాద్, కో ప్రొడ్యూసర్స్: ఆయుష్ రెడ్డి, అక్షిత్ రెడ్డి, నిర్మాత: ఆర్.సుదర్శన్ రెడ్డి, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వంశీకృష్ణ అకెళ్ళ.

  ట్రైలర్

  జక్కన్న ట్రైలర్ ఇదే... చాలా బావుంది.

  English summary
  Sunil acting Jakkana Movie Audio held at Shilpa Kala Vedika in Hyderabad yesterday (24th June) evening.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X