»   »  జల్సా కొత్త రికార్డు

జల్సా కొత్త రికార్డు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Pawan Kalyan
గీతాఅర్ట్స్ బ్యానర్‌పై పవన్ కళ్యాణ్ ,ఇలియానా జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన 'జల్సా' ఇప్పుడు మరో రికార్డుతో అందరి నోట్లో నానుతోంది. ప్రపంచ వాప్తంగా అత్యధిక వసూళ్ళు సాధించిన టాప్ టెన్ చిత్రాలను ప్రతీ వారం అమెరికాలోని 'బాక్సాఫీస్ మెజో' అనే సంస్థ వెల్లడిస్తుంది. ఈ వారం టాప్ టెన్ లో టాప్ నైన్ గా జల్సా నిలిచిందని ప్రకటించటం మాకు చాలా గర్వంగా ఉందని అల్లు అరవింద్ సక్సెస్ మీట్ లోచెప్పారు. అలాగే ఇంతటి గ్రాండ్ సక్సెస్ డైరెక్టర్ వల్లనో, హీరో పవన్ వల్లనో, నావల్లనో జరిగింది కాదని, ఉమ్మడి కృషి ఫలితంగా ఈసక్సెస్ సాధించామన్నారు. 'జల్సా' ప్రపంచవ్యాప్తంగా 1000 స్క్రీన్స్‌తో రిలీజ్ చేసామనీ మొదటివారంలో కోటీ 17 లక్షల మంది ప్రేక్షకులు చూడటం .. 21 కోట్ల రూపాయలు వసూలు చేయటం మరొక రికార్డు అన్నారు. అలాగే జల్సా రిలీజ్ చెయ్యటానికి తాము అనుసరించిన పంథా సక్సెస్ అయ్యిందని అన్నారు. ఈ సినిమా ఇచ్చిన విజయాన్ని ఆదర్శంగా తీసుకుని మరో భారీ హిట్ చిత్రం నిర్మిస్తానని అరవింద్ హామి ఇచ్చారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X