»   » పవనిజంతో గర్ల్స్ హల్ చల్, టాటూలతో ఫ్యాన్స్ (ఫోటోలు)

పవనిజంతో గర్ల్స్ హల్ చల్, టాటూలతో ఫ్యాన్స్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: విశాఖపట్నంలో ఈ రోజు తలపెట్టిన పవన్ కళ్యాణ్ 'జనసేన' పార్టీ భారీ బహిరంగ సభ సందర్భంగా అభిమానులు హల్ చల్ చేసారు. సాధారణంగా క్రికెట్ మ్యాచ్ సందర్భంగా చేతులు, ముఖంపై అభిమానులు టాటూలు వేయించుకోవడం మనం చూస్తాం. కానీ ఇక్కడ క్రికెట్ మ్యాచ్‌ను తలపించేలా అభిమానులు జనసేన పార్టీ లోగోలను చేతులు, ముఖంపై టాటూలే వేయించుకున్నారు.

ఇక కొందరు యువతులు పవనిజం టీషర్టులు ధరించి స్టేడియంలో కలియదిరుగుతూ హల్ చల్ చేసారు. ఈ మీటింగుకు భారీ సంఖ్యలో మహిళా అభిమానులు కూడా హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ సమాజం కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో తాము సైతం అంటూ వికలాంగ అభిమానుల కూడా తరలి రావడం గమనార్హం.

ప్రముఖ నిర్మాత ప్రసాద్ వి. పొట్లూరి విశాఖ మీటింగుకు సంబంధించిన ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నారు. సభకు తరలి వచ్చి అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా భారీగా ఏర్పాట్లు చేసారు. బెదింపు కాల్స్ నేపథ్యంలో స్టేడియం, సభా వేదిక వద్ద డాగ్ స్వాడ్‌తో తనఖీలు నిర్వహించారు. అందుకు సంబంధించిన దృశ్య మాలిక స్లైడ్ షోలో...

పవనిజం టీషర్టులతో గర్ల్స్

పవనిజం టీషర్టులతో గర్ల్స్

పవనిజం టీషర్టులు ధరించిన గర్ల్స్ స్టేడియంలో హల్ చల్ చేసారు. అందరి దృష్టినీ ఆకర్షించారు.

టాటూ...

టాటూ...

జనసేన పార్టీ లోగోలను చేతిపై టాటూగ వేయించుకుంటున్న అభిమాని.

విలకలాంగులు సైతం...

విలకలాంగులు సైతం...

రాజకీయాల్లో మార్పు తేవాలని పవన్ కళ్యాణ్ తలపెట్టిన ప్రయత్నంలో తాము సైతం అంటూ వికలాంగ అభిమానులు సైతం తరలి వచ్చారు.

డాగ్ స్వ్కాడ్‌తో తనిఖీలు

డాగ్ స్వ్కాడ్‌తో తనిఖీలు

అగంతకుల నుండి బెదిరింపు కాల్స్ వచ్చిన నేపథ్యంలో సభా వేదిక వద్ద డాగ్ స్వ్కాడ్‌తో తనిఖీలు నిర్వహించారు.

ప్రసాద్ వి పొట్లూరి

ప్రసాద్ వి పొట్లూరి

ప్రముఖ నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వెనక ఉన్నారని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయనే ఈ మీటింగుకు సంబంధించిన ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు.

పవనిజం

పవనిజం

పవనిజం టాటూను చేతిపై వేయించుకుని అభిమానం చాటుకుంటున్న పవన్ కళ్యాణ్ అభిమాని.

వీపుపై జన సేన లోగో...

వీపుపై జన సేన లోగో...

వీపుపై జనసేన పార్టీ లోగో వేయించుకుంటున్న అభిమాని.

మహిళా అభిమానులు

మహిళా అభిమానులు

ఈ మీటింగుకు మహిళా అభిమానులు కూడా భారీ సంఖ్యలో తరలి వచ్చారు. వారి కోసం సభలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసారు.

జనసేనకు జై...

జనసేనకు జై...

జనసేనకు జై కొడుతున్న అభిమాని. జనసేన పార్టీ పేరును చేతిపై టాటూగా వేయించుకుని ఇలా తన అభిమానాన్ని చాటుకున్నాడు.

యూత్...

యూత్...

పవన్ కళ్యాణ్‌కు యూత్‌లో ఏ రేంజిలో ఫాలోయింగ్ ఉందో ఈ ఫోటో చూస్తే అర్థం చేసుకోవచ్చు.

సభా వేధిక వద్ద కళాకారుల ప్రదర్శన

సభా వేధిక వద్ద కళాకారుల ప్రదర్శన

సభా వేధిక వద్ద కళాకారులు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ప్రజల్లో చైతన్యం నింపేలా జనసేన పాటలను ఆలపించారు.

English summary
Power star Pawan Kalyan, who launched his Jana Sena party in Hyderabad on March 14, is campaigning for his new political party in Vizag (Visakhapatnam) today (March 27). He has planned to woo youth in the state through his public meeting, the theme of which is "Youth of the Nation-Fight for the Nation". This much-talked about event is held at Indira Priyadarsini Municipal Stadium in the city.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu