»   » సినిమావాళ్లు దారుణంగా బరితెగించారు.... మెగాస్టార్ వైఫ్ కి ఇంత అసహనం ఎందుకు??

సినిమావాళ్లు దారుణంగా బరితెగించారు.... మెగాస్టార్ వైఫ్ కి ఇంత అసహనం ఎందుకు??

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకప్పటి భారతీయ సినిమా ఒకప్పుడు ఉన్నట్టే ఇప్పుడూ ఉండాలంటే ఎలా..!? అప్పట్లో హీరోయిన్ లు నిండుగా చీరకట్టుకొని ఉండేవాళ్ళు కేవలం విలన్ల తో మాత్రమే ఐటం సాంగ్ భామలు ఆడేవాళ్ళు. మారుతున్న పరిస్థితుల తో పాటూ సినిమా, పాత్రల తీరూ మారుతూ వచ్చాయి. కానీ సినిమాలన్నీ ఒకప్పటి మాదిరే ఇప్పుడూ ఉండాలంటే ఎలా? అసలు విలువలంటే ఏమిటి?? అవి కేవలం సినిమాల్లోనే ఉండాలా.. బయటకూడానా?? ఈ ప్రశ్నలు బాలీవుడ్ మెగాస్టార్, సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ భార్యా, ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ జయా బచ్చన్ ని ఎవరూ అడగలేదేమో.. గానీ ఇప్పుడు వస్తున్న సినిమాల్లో భారతీయత లేదనీ, ఇండస్ట్రీ పూర్తిగ పాడైందనీ విరుచుకు పడ్డారు.

అదేమిటో గానీ జయాబచ్చన్ అంత పెద్ద సినీ ఫ్యామిలీ కి చెంది ఉండీ, ఒకప్పటి హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన జయా బచ్చన్ కి సినిమాలో వచ్చిన మార్పులకి కారణం ఏమిటో తెలియనే తెలియదా..?, అసలు భారతీయత లోపించటం అంటే ఏమిటీ?? ఇవన్నీ జయాబచ్చన్ ని ఎవరూ అడగలేరు కాబట్టి ఆవిద ఏమన్నారో మాత్ర చూద్దాం. నిన్న అసలు ఒక రెంజి లో ఇండియన్ సినీ ఇండస్ట్రీలన్నిటి మీదా, ప్ర‌స్తుతం వస్తున్న మూవీల‌పైనా ఫైరైపోయారు. ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజెస్(మామి) 18వ సినీ ఉత్సవంలో భాగంగా దిగ్గజ దర్శకుడు బిమల్ రాయ్ సంస్మరణార్థం మంగళవారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో జయ బచ్చన్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తుత మూవీ ట్రెండ్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Jaya Bachchan Shocking Comments On Current Indian Movies

ఇప్పటి కాలం లో వచ్చే మూవీలు చూడాలంట‌నే భ‌యం వేస్తోంది. 50వ, 60 దశకాల్లో వచ్చిన సినిమాల్లో భారతీయ జీవం ఉట్టిపడేదని, రానురాను ఇప్ప‌టి సినిమాల్లో పాశ్చాత్య సంస్కృతి ప్ర‌భావం ఎక్కువైంది. అయితే, భార‌తీయుల ఆలోచ‌నా ధోర‌ణిలో మాత్ర ఏ మార్పురాలేదు, 'సినిమాలు చూడాలంటేనే భయమేస్తోంది. మానవత్వం, సున్నితత్వం మచ్చుకైనా కనపడవు. తెరనిండా పాశ్చాత్య పోకడలు.. పొట్టపొట్టి దుస్తులు! పాత్రల్లో భారతీయత ఎక్కడుంది? సినిమాల వల్ల జనం కూడా కఠినంగా మారిపోతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే సినిమావాళ్లు దారుణంగా బరితెగించారు. ఫిలింమేకింగ్ పచ్చి బిజినెస్ అయిందిప్పుడు. మాట్లాడితే 100 కోట్ల కలెక్షన్లు, లేదంటే తొలివారం రికార్డులు. బాబోయ్.. ఇవన్నీ నాకు ఎప్పటికీ అర్థంకాని విషయాలు. అందుకే అలాంటి చోట నేను ఉండలేను' అని గుక్క‌తిప్ప‌కుండా చెప్పేసారు జయా బచ్చన్.

అయితే ఆవిడ చెప్పిన విషయాలన్నీ అమితాబ్ కీ, ఆమె కుమారుడు అభిషేక్ కీ, ఆమె కోడలు ఐశ్వర్యకీ కూడా చెప్పి భారతీయత ఉట్టి పడే సినిమాలనే చేయించితే బావుంటుంది కదా అని ప్రేక్షకుల్లో పలువురు జోకులు వేసుకున్నారట.

English summary
Bollywood Old Heroine Jaya Bachchan Shocking Comments On Current Indian Movies at Mumbai Academy of Moving Image (MAMI) festival 2016
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X