»   »  ఐశ్వర్య మీ క్లాస్‌మేటా? మీడియాపై జయా బచ్చన్ ఫైర్

ఐశ్వర్య మీ క్లాస్‌మేటా? మీడియాపై జయా బచ్చన్ ఫైర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: అందమైన రూపం, అంతకంటే అందమైన జీవితం పొందిన ఐశ్వర్యరాయ్ ఎంత అదృష్టవంతురాలో అని ఆమె అభిమానులు చర్చించుకున్న సందర్భాలు అనేకం. బచ్చన్ ఫ్యామిలీ మెంబర్ అయ్యే అవకాశం దక్కించుకుని ఆమె మరింత లక్కీగా మారిందని తాజా సంఘటన స్పష్టం చేస్తోంది. ఐశ్వర్యరాయ్ భర్త అభిషేక్, అత్త మామలు జయా బచ్చన్, అమితాబ్ బచ్చన్ ఆమెపై చూపిస్తున్న ప్రేమే అందుకు నిదర్శనం.

ఇటీవల జరిగిన ఓ ప్రెస్ మీట్లో.....తన కొడలిని మీడియా వారు 'ఐశ్వర్య' అని సంబోధించడం జయా బచ్చన్‌కు కోపం తెప్పించింది. తన కోడలిని అలా పిలవొద్దని....'ఐశ్వర్య రాయ్ బచ్చన్' అని పూర్తి పేరుతో పిలవాలని ఆమె సూచించారు. 'ఏంటి ఐశ్వర్యా..ఐశ్వర్యా అని పిలుస్తున్నారు. ఆమె మీతో కలిసి చదువుకుందా?' అంటూ జయా బచ్చన్ మీడియా ప్రతినిధులపై ఫైర్ అయ్యారు.

జయా బచ్చన్...తన కోడలికి మద్దతుగా నిలవడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఆమెపై సినిమా గాసిప్పులు వచ్చినప్పుడు ఆమె తీవ్రంగా స్పందించారు. తమ కోడలిని అపఖ్యాతి పాలు చేసేందుకు ప్రయత్నించిన కొందరు స్టార్ హీరోలను ఆమె పరోక్షంగా హెచ్చరించారు కూడా. మరో వైపు ఐశ్వర్యరాయ్ మామ అమితాబ్ కూడా కోడలిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు.

ఇంత ప్రేమగా చూసుకునే కుటుంబంలో కోడలిగా ప్రవేశించడం ఐశ్వర్యరాయ్ ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో అని ఆమె ఫ్యాన్స్ సంతోష పడుతున్నారు. మరి అత్తారింట్లో తనపట్ల చూపుతున్న ప్రేమపై ఐశ్వర్యరాయ్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ విషయం అడిగేందుకు మీడియా వారు ఆమె ఎప్పుడు కలుస్తుందా? అని ఎదురు చూస్తున్నారు.

English summary

 Aishwarya Rai Bachchan is surely the lucky one. She's not only Abhishek Bachchan's love of life, but also no less than a daughter to Amitabh and Jaya Bachchan. As per the reports, Jaya Bachchan recently slammed the media persons, after they addressed the Bachchan bahu as 'Aishwarya'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu