twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జయలలిత జీవిత చరిత్రలో రమ్యకృష్ణ? (పోస్టర్స్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఆమె జీవితం ఆధారంగా సినిమా తీయాలనే ఆలోచనలు కూడా తెరపైకి వచ్చాయి. ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఆమె స్టార్ హీరోయిన్ గా, ఆపై రాజకీయ నాయకురాలిగా, తమిళ ప్రజలు ఎంతగానో ఆరాధించే ముఖ్యమంత్రిగా తమిళనాడు చరిత్రలో నిలిచిపోయారు.

    ఇప్పటికే పలువురు ఫిల్మ్ మేకర్స్ జయలలిత జీవితంపై సినిమా తీసే విషయమై ప్రయత్నాలు మొదలు పెట్టలారు కూడా. ఈ పాత్ర చేయడానికి ఎవరు సరైన వారు అనే చర్చ కూడా సోషల్ మీడియాలో ప్రారంభమైంది. చాలా మంది ఈ పాత్ర రమ్యకృష్ణ అయితే బావుంటుందనే అభిప్రాయం వ్యక్తి చేస్తున్నారు.

     పోస్టర్లు హల్ చల్

    పోస్టర్లు హల్ చల్

    కొందరు అభిమానులు ‘మదర్' అనే టైటిల్ లో రమ్యకృష్ణ ఫోటోలను మార్పింగ్ చేసి పోస్టర్లు క్రియేట్ చేసారు. ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో హచల్ చేస్తున్నాయి.

    రమ్యకృష్ణ స్పందిస్తూ

    రమ్యకృష్ణ స్పందిస్తూ

    ఈ పోస్టర్లపై రమ్యకృష్ణ స్పందిస్తూ ‘ఇది ఎవరో ఫ్యాన్స్ క్రియేట్ చేసిన పోస్టర్. చూడటానికి చాలా బావుంది. నాకు ఇంతకు ముందు డ్రీమ్ రోల్ అంటూ ఏదీ లేదు. కానీ ఇప్పుడు ఉంది. ఎవరైనా మంచి స్క్రిప్ట్ తో నా వద్దకు వస్తే జయలలితగారి పాత్రలో నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నారు.

     శక్తివంతమైన మహిళ

    శక్తివంతమైన మహిళ

    జయలలితగారు ఒక శక్తివంతమైన మహిళ. నాలాంటి ఎంతో మంది ఆడవాళ్లకు ఆమె స్ఫూర్తినిచ్చింది. ఆమె జీవిత చరిత్రతో సినిమా వస్తే...అలాంటి అవకాశం నాకు చేసే అవకాశం వస్తే గౌరవంగా, అదృష్టంగా భావిస్తాను అన్నారు.

    కల నిజం కావాలి

    కల నిజం కావాలి

    నాకు ఇంతకు ముందు డ్రీమ్ రోల్ అంటూ ఏదీ లేదు. కానీ జయలలిత పాత్ర చేయాలని ఇపుడు డ్రీమ్ రోల్ గా పెట్టుకున్నాను. నా డ్రీమ్ వీలైనంత త్వరగా నిజమవ్వాలనని కోరుకుంటున్నాను అన్నారు. మరి ఆమె డ్రీమ్ నిజం చేసే దర్శకుడు ఎవరో చూడాలి.

    English summary
    Tamil Nadu late Chief Minister Jayalalithaa was one of the most powerful lady and to make a movie on her, is a very difficult task for the film makers. Now a fan made first look poster of Ramya Krishna as Jayalalithaa is going viral on the social media platform and creating sensation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X