For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Jayanthi no more: ఆమెకు వచ్చిన అవార్డులు.. తెలుగులో నటించిన గొప్ప చిత్రాలు ఇవే

  |

  కొంత కాలంగా సినీ కుటుంబంలో వరుసగా విషాదాలు జరుగుతున్నాయి. కోవిడ్ మహమ్మారి కారణంగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా గొప్ప గొప్ప ప్రముఖులు కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది నటీనటులు, టెక్నీషియన్లు, ఆర్టిస్టులు ఇలా సినీ రంగంతో సంబంధం ఉన్న పలువురు ప్రముఖులు ప్రాణాలను కోల్పోయారు. ఈ క్రమంలోనే తాజాగా సౌతిండియాలో మరో పెను విషాదం చోటు చేసుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో దాదాపు 500 లకు పైగా చిత్రాల్లో నటించిన సీనియర్ నటి జయంతి సోమవారం ఉదయం కన్నుమూశారు.

  చాలా కాలంగా ఆ సమస్యతో ఇబ్బంది

  చాలా కాలంగా ఆ సమస్యతో ఇబ్బంది

  దాదాపు ముప్పై ఏళ్లుగా జయంతి ఆస్తమాతో బాధ పడుతోన్నారు. ఈ క్రమంలోనే ఆమె పలుమార్లు ఆస్పత్రిలో చికిత్సను కూడా తీసుకున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది అక్టోబర్‌లో జయంతి తీవ్ర స్థాయిలో అస్వస్థతకు గురయ్యారు. అప్పటి నుంచి చాలా కాలం పాటు ఆమె చికిత్సను తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆ మధ్య ఆరోగ్యం మెరుగడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

  ప్రముఖ హీరోయిన్‌కు రోడ్డు ప్రమాదం: తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలు.. ఘటనలో తెలుగమ్మాయి మృతి
  https://telugu.filmibeat.com/news/heroine-yaashika-aanand-met-an-accident-101179.html

  మళ్లీ క్షిణించిన ఆరోగ్యం.. హఠాన్మరణం

  మళ్లీ క్షిణించిన ఆరోగ్యం.. హఠాన్మరణం

  ఈ మధ్యనే బాగానే ఉన్నా.. తాజాగా జయంతికి మరోసారి ఆరోగ్యం క్షిణించింది. దీంతో సోమవారం ఉదయం తుది శ్వాసను విడిచారు. ఈ సీనియర్ నటి మరణంతో దక్షిణాదిలోని అన్ని సినీ పరిశ్రమల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈమె మృతి పట్ల సినీ ప్రముఖులంతా సంతాపం తెలుపుతున్నారు. అలాగే, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.

   జయంతి నేపథ్యం ఇదే.. ఆ గౌరవంతో

  జయంతి నేపథ్యం ఇదే.. ఆ గౌరవంతో

  జయంతి 1945లో కర్నాటక రాష్ట్రంలో జన్మించారు. హీరోయిన్‌గా మారిన తర్వాత ఆమె ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన నటనతో అలరించారు. ఈ క్రమంలోనే దక్షిణాది భాషలతో పాటు మరాఠీలోనూ నటించారు. సుదీర్ఘమైన కెరీర్‌లో 500లకు పైగా సినిమా్ల్లో నటించిన ఆమె.. ఎన్నో మైలురాళ్లను చేరుకున్నారు. జయంతిని కన్నడ చిత్ర పరిశ్రమ ‘అభినయ శారద' అనే బిరుదుతో గౌరవించింది.

  అద్భుతమైన నటనతో అవార్డుల పంట

  అద్భుతమైన నటనతో అవార్డుల పంట

  సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో జయంతి ఎన్నో అవార్డులను అందుకున్నారు. మరీ ముఖ్యంగా ‘ఎడకల్లు గుడ్డాడ మేలే', ‘మనస్సినత్తే మాంగళ్య', ‘ధర్మధారి తప్పిత్తు', ‘మసనాడ హూవు', ‘తులసి' వంటి చిత్రాలకు ఉత్తమ నటిగా అవార్డులు అందుకున్నారు. అలాగే, 2005లో కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి జయంతి ‘రాజ్‌కుమార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్' అవార్డును కూడా స్వీకరించారు.

  యాంకర్ సుమపై సినీ నటి షాకింగ్ కామెంట్స్: వయసు పెరిగినా తీరు మారలేదు.. చాలా అసూయ అంటూ!

  తెలుగులోనూ సత్తా.. ఈ తరం వాళ్లతో

  తెలుగులోనూ సత్తా.. ఈ తరం వాళ్లతో

  1961లో వచ్చిన ‘భార్య భర్తలు' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు జయంతి. అప్పటి నుంచి ‘జగదేక వీరుని కథ', ‘డాక్టర్ చక్రవర్తి', ‘బొబ్బిలి యుద్ధం', ‘అగ్గి పిడుగు', ‘సుమంగళి', ‘భక్త ప్రహ్లాదా', ‘అగ్ని పూలు', ‘తల్లి బాధ్యత', ‘జస్టిస్ చౌదరి', ‘రక్త సంబంధం' వంటి చిత్రాల్లో నటించారు. సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ ‘పెదరాయుడు' వంటి మూవీలతో పాటు ఈ తరం వాళ్లతోనూ చేశారు.

  English summary
  Big Tragedy in South Indian Film Industries. Today Marning Veteran Actress Jayanthi Passes Away Due Health Issues.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X