»   » అది చిన్న అపార్థం అంతే..! షూటింగ్ గొడవ పై తేల్చేసిన జయసుధ

అది చిన్న అపార్థం అంతే..! షూటింగ్ గొడవ పై తేల్చేసిన జయసుధ

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రస్తుతం జయసుధ 'హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య' అనే చిత్రంలో విప్లవ చిత్రాల నాయకుడు ఆర్. నారాయణమూర్తి భార్య పాత్ర చేస్తున్నారు. చదలవాడ స్వీయ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ సడన్గా ఆగిపోయింది. దీనికి కారణం జయసుధ అని భోగట్టా. తరచుగా షూటింగ్కి లేట్ గా వస్తోన్న జయసుధతో చదలవాడ సమయానికి రావాలని చెప్పారట.

దాంతో జయసుధకి కోపం వచ్చి, ఆయనతో వాగ్వాదానికి దిగి సెట్నుంచి ఉన్నపళంగా వెళ్లిపోయి, మళ్లీ ఆ షూటింగ్కి వెళ్లలేదనీ, ఆమెని కాంటాక్ట్ చేయడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కానీ జయసుధ నుంచి బదులు రాలేదట. కీలకమైన పాత్ర చేస్తున్న జయసుధ లేకపోవడంతో షూటింగ్ షెడ్యూల్ మొత్తం అప్సెట్ అయి సినిమా మధ్యలో నిలిచిపోయిందట. ఇప్పుడు ఆమెకి బదులుగా మరొకర్ని తీసుకోవాలా లేక తననే బతిమాలుకోవాలా తెలీక చదలవాడ తల పట్టుకున్నారట. జయసుధని రీప్లేస్ చేసినట్టయితే ఇంతవరకు షూటింగ్ చేసిన దాంట్లో చాలా భాగం వృధా అయి బడ్జెట్ పరిధులు దాటిపోతుందని బాదపడుతున్నట్టూ వచ్చిన వార్తల పై జయసుధ స్పందించారు.

Jayasudha clears the air about her Walkout from sets

చిత్ర వర్గాల ప్రకారం కాస్ట్యూమ్‌ డిపార్ట్‌మెంట్‌ నిర్ణీత సమయంలోగా జయసుధకు దుస్తులు అందించలేకపోయింది. దీంతో ఆమె కొంతవేచి చూసి.. ఆలస్యంగా షూటింగ్‌కు వచ్చింది. విషయం తెలియని నిర్మాత ఆగ్రహానికి లోనయ్యాడు. జయసుధ వ్యక్తిగత సిబ్బందిపై కేకలు వేశాడు. నిర్మాత కోపానికి గురైన విషయం తెలియడంతో జయసుధ ఆయనకు వివరణ ఇచ్చింది. ఇందులో తన తప్పేం లేదని తెలిపింది. గత 30 ఏళ్లుగా జయసుధ తన కాస్ట్యూమ్స్‌ తానే డిజైన్‌ చేసుకుంటున్నది.

ఇందుకోసం ఒకరోజు ముందుగానే దర్శకుడితో సంబంధిత సీన్‌లోవేసుకోవాల్సిన దుస్తుల కోసం ఆమె చర్చిస్తుంది.,,దీనిపై జయసుధ మీడియాతో స్పందిస్తూ 'ఇదేం పెద్ద విషయం కాదు. చిన్న అపార్థం వల్ల ఇది జరిగింది. దర్శకుడు నాకు ఫోన్‌ చేశాడు. ఎలాంటి జాప్యం లేకుండా డిసెంబర్‌ 3 నుంచి షూటింగ్‌ షెడ్యూల్‌ ప్రకారం కొనసాగుతుంది' అని తెలిపారు. ఆర్‌ నారాయణమూర్తి కోసమే ఈ సినిమాను జయసుధ ఒప్పుకొన్నట్టు సన్నిహత వర్గాలు తెలిపాయి.

English summary
“It’s not a big issue, just a small misunderstanding. The director called me and said there is no delay said Jayasudha about her Walkout from Head constable venkatramaiah sets.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu