For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  విషాదం వెంటాడింది.. భర్త మరణంపై జయసుధ ఉద్వేగం.. భార్యను గుర్తుచేసుకొని దిల్ రాజు కంటతడి

  By Rajababu
  |
  2017-దిల్ రాజు గ్రాండ్ పార్టీ.. సందడి చేసిన స్టార్స్!

  ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స బ్యానర్‌లో 2017 సంవత్సరంలో శతమానం భవతి, నేను లోకల్, ఫిదా, డీజే, రాజా ది గ్రేట్, ఎంసీఏ లాంటి ఆరు బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చిన నేపథ్యంలో సంస్థ అధినేత దిల్ రాజు ఘనంగా విజయోత్సవాన్ని నిర్వహించారు.

  photo Gallery : Sri Venkateswara Creations 2017 Movies Celebrations

  ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో నిరాడంబరంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్, నాని, దేవీ శ్రీ ప్రసాద్, అనుపమ పరమేశ్వరన్, జయసుధ, మెహ్రీన్ పిర్జాదా, భూమిక, దర్శకులు సతీశ్ వెగ్నేష, అనిల్ రావిపూడి, త్రినాథరావు, హరీష్ శంకర్, వేణు శ్రీరాం, శేఖర్ కమ్ముల హాజరయ్యారు. ఈ వేడుకలో దిల్ రాజు, జయసుధ ఉద్వేగానికి లోనయ్యారు.

  జయసుధ మాట్లాడుతూ..

  జయసుధ మాట్లాడుతూ..

  ఈ విజయోత్సవ సభలో జయసుధ మాట్లాడుతూ... డబుల్ హ్యాట్రిక్ కొట్టిన దిల్ రాజుకు కంగ్రాట్స్. ఈ ఏడాది ఆరంభంలో శతమానం భవతి లాంటి ఘనవిజయం పలకరించింది. ఇదే వేదికపై శతమానం భవతి సక్సెస్ మీట్ జరుపుకొన్నాం.

   దిల్ రాజు కమిట్‌మెంట్

  దిల్ రాజు కమిట్‌మెంట్

  దిల్ రాజు లాంటి కమిట్‌మెంట్ ఉన్న నిర్మాతతో ట్రావెల్ చేయడం చాలా సంతోషం. దిల్ రాజు లాంటి కమిట్ మెంట్ ఉన్న ప్రొడ్సుసర్‌తో ఇకముందు జర్నీ చేయాలని కోరుకుంటున్నాను. నేను ఎన్ని సినిమాలు చేశాననే ముఖ్యం కాదు. ఎన్ని మంచి చిత్రాలు చేశామన్నేద ప్రాధాన్యం.

   నా పాత్ర పేరు గుర్తుపెట్టుకొని

  నా పాత్ర పేరు గుర్తుపెట్టుకొని

  ఇటీవల నేను పాండిచ్చేరికి వెళ్లాను. అక్కడ కారు ఎక్కుతుండగా కొందరు యువతి, యువకులు పలుకరించి సెల్ఫీ దిగాలని ప్రయత్నించారు. అయితే నేను వాళ్లతో సెల్ఫీ దిగుతుండగా మీరు డాక్టర్ శైలజ అని ఓ యువకుడు అడిగాడు. అతను ఉత్తరాదికి చెందిన ప్రేక్షకుడు కావడం, ఆయన ఎవడు చిత్రాన్ని చూడటం అందులోని డాక్టర్ పాత్ర పేరు గుర్తుపెట్టుకోవడం చాలా ఆనందం వేసింది. మేము నటించిన పాత్రల పేర్లు గుర్తు పెట్టుకోవడం మా ప్రతిభకు సాక్ష్యం అని జయసుధ అన్నారు.

   భర్త మరణం వెంటాడింది

  భర్త మరణం వెంటాడింది

  దిల్ రాజు, నా జీవితాన్ని ఓ విషాదం వెంటాడింది. నా భర్త ఆకస్మికంగా మరణించడం, దిల్ రాజు భార్య అనిత గారు కూడా మృతి చెందడంతో మేము చాలా కుంగిపోయాం. అయినా ఆ బాధను దిగమింగుకొని వెంటనే మా జర్నీని ప్రయాణించాం. ఏది ఏమైనా ముందుకు సాగడమే జీవితం. జరిగిన దానిని తలచుకుంటే అక్కడే ఆగిపోతే ప్రయోజనం ఉండదు అని జయసుధ ఉద్వేగానికి లోనయ్యారు.

   దిల్ రాజు తన ప్రసంగంలో

  దిల్ రాజు తన ప్రసంగంలో

  ఇక ఇదే వేదికపై తన 20 ఏళ్ల సినీ జీవితం గురించి చెప్పుకొంటూ దిల్ రాజు మాట్లాడారు. ఎన్నో ఒడిదుడుకుల సినీ ప్రయాణంలో నా ఫ్రెండ్స్, కుటుంబసభ్యులు నాకు అండగా నిలిచారు. నా ఆఫీస్ స్టాఫ్ 365 రోజులు.. సెలవులు అనేది చూసుకోకుండా పనిచేశారు. నా సిబ్బంది నాకు ప్రధాన బలం అని దిల్ రాజు చెప్పారు.

  ఫిదా షూటింగ్‌లో ఉండగా

  ఫిదా షూటింగ్‌లో ఉండగా

  ఫిదా షూటింగ్ కోసం నేను అమెరికాలో ఉండగా, నా భార్య అనిత మరణవార్త అందింది. ఆ వార్తతో నేను అక్కడే కుప్పకూలిపోయాను. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. జరిగిందేదో జరిగిపోయింది అనుకొన్నాను. ఫిదా షూటింగ్ ఆపవద్దని నేను శేఖర్ కమ్ములకు చెప్పాను. వెంటనే అమెరికా నుంచి నేను హైదరాబాద్‌కు ప్రయాణమయ్యాను అని మాట్లాడుతూ దిల్ రాజు కంటతడి పెట్టారు.

   నిర్మాత దిల్ రాజు కంటతడి

  నిర్మాత దిల్ రాజు కంటతడి

  భార్య గురించి తలచుకొంటున్న తరుణంలో గుండెలో నుంచి తన్నుకొంటూ వస్తున్న ఉద్వేగాన్ని ఆపుకొన్నారు. శేఖర్ కమ్ముల, వంశీ పైడిపల్లి వేదికపై దిల్‌రాజును ఓదార్చే ప్రయత్నం చేశారు. అలా ఉద్వేగంలో ఉంటూ తన ప్రసంగాన్ని ముగించారు. మధ్యలో పైకి వస్తున్న దు:ఖాన్ని ఆపుకొంటూ తమాయించుకొని తన జీవిత ప్రయాణాన్ని నెమరువేసుకొన్నారు.

   నా జీవిత ప్రయాణంలో

  నా జీవిత ప్రయాణంలో

  మా సినీ ప్రయాణం క్రిస్మస్ రోజున అంటే 20 ఏళ్ల క్రితం 1987 డిసెంబర్ 25న ప్రయాణమైంది. ఈ రోజు అందరూ సక్సెస్ గురించి అందరూ మాట్లాడుతున్నారంటే మా దర్శకులు హార్డ్‌వర్క్ మాత్రమే. 1997, 2007, ఇప్పుడు 2017 సంవత్సరాలు నా జీవితంలో మరిచిపోలేనటువంటి విజయాలు వచ్చాయి.

   పెళ్లి పందిరి సినిమా లేకుంటే

  పెళ్లి పందిరి సినిమా లేకుంటే

  పెళ్లి పందిరి అనే సినిమా మా జీవితంలో లేకుంటే మేము ఇప్పుడు మీ ముందు ఉండలేకపోయేవాళ్లం. పెళ్లిపందిరి సినిమాను కొనుగోలు చేసి విడుదల చేయడానికి మేము ఎన్ని కష్టాలు పడ్డామో మా కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు అని దిల్ రాజు అన్నారు.

   దిల్ రాజు పాటతో వేదికపైకి వందేమాతరం

  దిల్ రాజు పాటతో వేదికపైకి వందేమాతరం

  ఈ కార్యక్రమంలో 2017లో సక్సెస్ సాధించిన ఆరుగురు దర్శకులను దిల్ రాజు సన్మానించారు. నేస్తామా.. ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అనే పాటను పాడి సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌ను వేదికపైకి దిల్ రాజు ఆహ్వానించారు. నేను బాధలో ఉన్నా ఈ పాట పెట్టుకొని రిలాక్స్ అవుతాను. ఇంతమంచి పాటను అందించిన దర్శకులు, వందేమాతరం శ్రీనివాస్‌కు థ్యాంక్స్ అని దిల్ రాజు తన సంతోషాన్ని పంచుకొన్నారు.

  English summary
  Dil Raju's SVC Success Celebrations organised at Hyderabad. MCA, DJ, Raja The Great, Fidaa, Nenu Local, Sathamanam Bhavati movies are got success in Dil Raju Banner. So many stars and Directors are attended for this event. Dil Raju and Jayasudha get emotional in this event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X