»   » ఐశ్వర్యరాయ్ ‘జజ్బా’ అఫీషియల్ ఫోస్టర్

ఐశ్వర్యరాయ్ ‘జజ్బా’ అఫీషియల్ ఫోస్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఐశ్వర్యరాయ్ త్వరలో ‘జజ్బా' సినిమా ద్వారా మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది. ఆమె సంజయ్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ అఫీషియల్ పోసర్టర్ రిలీజైంది. పోస్టర్లో ఐశ్వర్యరాయ్, ఇర్ఫాన్ ఖాన్ టైంతో పోటీ పడుతూ పరుగెడుతూ ఉండటం గమనార్హం. ఈ చిత్రంలో ఆమె పవర్ ఫల్ పాత్రలో కనిపించబోతోంది.

ఇందులో ఆమె సింగిల్ మదర్, క్రిమిల్ లాయర్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమా పెర్ఫార్మెన్స్ పరంగా ఐశ్వర్యరాయ్ కి మంచి పేరు తెచ్చి పెడుతుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. ఇందులో ఆమె పలు యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటించింది. విభిన్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Jazbaa Official Poster

ఐశ్వర్యరాయ్ తో పాటు ఇర్ఫాన్ ఖాన్, షబానా అజ్మి, అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎస్సెల్ విజన్ ప్రొడక్షన్స్ ప్రై.లి. వైట్ ఫాదర్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 09 నాటికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా కోసం ఐశ్వర్యరాయ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

English summary
The first official poster of Aishwarya Rai-Irrfan starrer Jazbaa is out!
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu